.
శామ్ పిట్రోడా అనే ఓ చిత్రమైన కేరక్టర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో… పిచ్చి కూతలకు ప్రసిద్ధుడు… అనేకసార్లు ఏదో కూస్తాడు, కొన్నిసార్లు క్షమాపణలు చెబుతాడు… ఇంకొన్నిసార్లు పార్టీయే ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటుంది… మరికొన్నిసార్లు తనను పార్టీ నుంచి తరిమేస్తారు…
సింపుల్, నాలుగు రోజులకే మళ్లీ పార్టీలోకి వస్తాడు… అదే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు… అంతిమంగా ఆ పోస్టు నుంచి తనను ఎవడూ పీకలేడు… 82 ఏళ్లు ఇప్పుడు… తను ఒడిశాలో ఓ గుజరాతీ కుటుంబంలో పుట్టాడు… టెలికాం ఇంజినీర్, ఎంటర్‌ప్రెన్యూర్… చికాగోలో ఉంటాడు…
Ads
ఇతర దేశాల్లో రాహుల్ ప్రోగ్రామ్స్, ప్రసంగాలు ఆర్గనైజ్ చేస్తుంటాడు… తనను తాను telecom inventor, entrepreneur, development thinker and policy maker అని చెప్పుకుంటాడు… 1989లో టెలికామ్ కమిషన్‌కు తొలి చైర్మన్, నేషనల్ నాలెడ్జి కమిషన్‌కు కూడా లీడ్ చేశాడు కొన్నాళ్లు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు…
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదీ అంటే… హిండెన్‌బర్గ్ అని ఓ షార్ట్ సెల్లింగ్ కుట్ర కంపెనీ ఉంది కదా… అబద్ధాలు ప్రచారం చేసి, తరువాత ఆ షేర్లను కొని, అమ్మి బాగుపడుతూ ఉండే కంపెనీ… ఆదానీని టార్గెట్ చేసింది… నిజంగానే ఓ దశలో ఆదానీ కిందామీదా పడ్డాడు, దీన్ని తట్టుకోలేక…
రాహుల్ గాంధీ నేరుగా హిండెన్‌బర్గ్‌తో డీల్ చేశాడట ఇదంతా… ఈ విషయం ఎలా బయటపడింది..? ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ తెలుసు కదా… అది శామ్ పిట్రోడాకు సంబంధించిన మెయిల్స్, నెట్‌వర్క్‌ను ఛేదించింది… సర్వర్లను హ్యాక్ చేసింది…దానికి ఇది చాలా చిన్న పని… అసలు ఆదానీని టార్గెట్ చేయడం వెనుక మోడీని పొలిటికల్ టార్గెట్ చేయాలనే లక్ష్యం ఉన్నట్టు అది తేల్చింది…
స్పుత్నిక్ ఇండియా ఈమేరకు రిపోర్ట్ చేసింంది… ఇదీ కథ… అంతేకాదు, నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో సోనియా, రాహుల్ మాత్రమే కాదు, ఈ శామ్ పిట్రోడా కూడా ఉన్నాడు నిందితుడిగా… సో, కాంగ్రెస్‌కు సంబంధించిన ఇలాంటి యవ్వారాలు ఏం తవ్వినా సరే వాటిల్లో శామ్ పిట్రోడా జాడలు కనిపిస్తున్నాయి… సో, శామ్ పిట్రోడాను కాంగ్రెస్ నుంచి వెలివేయడం ఎవరికీ సాధ్యం కాదు…
ఇప్పుడు అర్థమైంది కదా… రాహుల్ గాంధీ అప్పుడప్పుడూ విదేశాలకు వెళ్లి ఏం చేస్తుంటాడో.,. చేస్తే తప్పేమిటి అంటారా..? వెళ్లనివ్వండి, కానీ వెళ్లినచోట ఇండియా సిస్టమ్స్, ఎన్నికల మీద పిచ్చి కూతలు కూయవద్దు కదా…
సావర్కర్‌ను కించపరిచిన కేసు ఉంది కదా, ఆ కేసు కొట్టివేతకు సుప్రీం కోర్టుకు వెళ్తే, చివరకు కోర్టు కూడా ముక్క చీవాట్లు పెట్టి, ఇదిలాగే కొనసాగిస్తే సీరియస్ యాక్షన్ ఆదేశిస్తామని హెచ్చరించింది… మొత్తానికి శామ్ పిట్రోడా, రాహుల్ గాంధీ… ఇద్దరూ ఇద్దరే… కాంగ్రెస్ పార్టీకి విలువ కట్టలేని ఆస్తులు..!!
Share this Article