Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సైలెంటుగా భలే పేల్చావు బ్రహ్మాజీ అంకుల్ … ఆంటీకి సెటైరిక్ కౌంటర్…

August 30, 2022 by M S R

కొద్దిరోజులుగా సదరు పొట్టి దుస్తులు, ఐటమ్ సాంగుల యాంకరిణి రచ్చ రచ్చ చేస్తోందిగా… నన్ను ఆంటీ అని పిలుస్తారురా, ఆఫ్టరాల్ నేను 37, అయితే ఆంటీని అయిపోయానా, ఇది ఏజ్ షేమింగ్ అని వీరంగం వేస్తోందిగా… ఇది నన్ను తిట్టినట్టే అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుంది… తనను ట్రోల్ చేస్తున్న వాళ్ల మీద కనీసం దేశద్రోహం సెక్షన్లు పెట్టాలన్నంత కోపంతో ఊగిపోతోంది ఫాఫం… అంతేలే, ఆమె బాధ ఆమెకు జాతీయ సమస్య…

అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ ఆమెను తిట్టించాడట, అర్జున్‌రెడ్డి సినిమా సమయంలో… ఇప్పుడు లైగర్ మట్టిగొట్టుకుపోయింది కదా, మంచిగైంది, ఉసురు తగిలింది, కర్మ ఫలం అనుభవించు అన్నట్టుగా ట్వీట్ చేసి గోక్కున్నది ఆమే… ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోలింగు, ఈమె ఫైరింగు కామనే… కాకపోతే ఈమధ్య చాలారోజులుగా గ్యాప్ వచ్చింది, దాంతో మొదలుపెట్టేసింది… విజయ్ ఫ్యాన్సే కాదు, సహజంగానే ఆమె వ్యవహారధోరణి పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్లు కూడా అందుకున్నారు…

ఆంటీ అని పిలిస్తే ఏజ్ షేమింగ్ అనేది ఆమె చట్టపరిజ్ఞానానికి అబ్బురపడాల్సిన వాదన… సరే, మళ్లీ ఆ వివాదం లోతుల్లోకి, ఆ రచ్చలోకి ఎందుకులే గానీ… నటుడు బ్రహ్మాజీ ఉన్నాడు కదా… చాలా మెచ్యూర్డ్ పర్సనాలిటీ… మొన్న రాధాకృష్ణ ఓపెన్ హార్ట్‌లో మరోసారి తన పక్వమైన ఆలోచనల తీరును బయటపెట్టుకున్నాడు… జోవియల్… ప్రతిదాన్నీ గుండెకు తీసుకుని బాధపడే రకం కూడా కాదు… తెలుగు హీరోలందరితోనూ బాగుంటాడు…

Ads

తన వయస్సు 57… సాధారణంగా ఏ పంచాయితీలోనూ వేలు పెట్టడు, కాలు పెట్టడు… అడుసు తొక్కనేల, కడుక్కోనేలా అనే తత్వం… ఓ బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అప్పటికే ఆమె డైవర్సీ… ఓ బాబు కూడా… బ్రహ్మాజీ ప్రేమలో అనిర్వచనీయ నిజాయితీ ఉంది… అందుకే ఆమె, బాబు సరిపోతారు అనుకున్నాడు… మళ్లీ పిల్లలు కూడా వద్దనుకున్నాడు…

అలాంటి బ్రహ్మాజీ సైలెంటుగా ఓ ట్వీట్ వదిలాడు… మస్తు వైరల్ అయిపోతోంది అది… ఇదే అది…

brahmaji

‘‘అంకుల్ ఏంట్రా అంకుల్… కేసు వేస్తా… ఏజ్, బాడీ షేమింగా..?’’ ఇంతే ఆ ట్వీట్… మామూలు రోజుల్లో ఈ ట్వీట్ పెట్టి ఉంటే పెద్దగా ఎవరి దృష్టీ పడేది కాదేమో… కానీ సదరు యాంకరిణి ఆంటీ రచ్చ ఒకటి నడుస్తోంది కదా… సేమ్, అదే స్టయిల్‌లో పేలింది ట్వీట్… కేసు వేస్తా, ఏజ్ షేమింగ్ అవన్నీ ఆంటీకి కాపీ పదాలే… జబర్దస్త్ సెటైర్ పడింది…

తను సరదాగానే ట్వీటి ఉండవచ్చుగాక… కానీ ఆంటీ రచ్చలో ఆమె ధోరణిని ఏవగించుకునేవాళ్లంతా బ్రహ్మాజీ ట్వీట్‌ను భలే ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది… మామూలుగా ఆ యాంకరిణి వ్యవహారశైలి నచ్చకపోయినా సరే, ఇండస్ట్రీలో, టీవీ సర్కిళ్లలో ఆమె నోట్లో ఎవరూ నోరు పెట్టరు… (అపార్థం వద్దు, మాటవైరానికి సాహసించరు అని…) బ్రహ్మాజీ వంటి నటులైదే ఆమడ దూరంలో ఉండిపోతారు… ఐనాసరే, తను కూడా ఈ వ్యంగ్య ట్వీటును వదిలాడు అంటే… విశేషమే…! ఆమె ఉసురు తగులుతుందేమో, జాగ్రత్త అంకుల్… సారీ, బ్రదర్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…
  • డార్క్ వెబ్ అంటే… అది ఇల్లీగల్ కాదు, క్షుద్రమూ కాదు నానీ…
  • లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…
  • అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
  • ఫాఫం సాక్షి… నానాటికీ ప్రమాణాల ఖుర్బానీ… ఇదీ ఓ ఉదాహరణ…
  • హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions