.
జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్ దాకా టీవీ షోలలో అప్పటికప్పుడు ప్రేమలు పుట్టిస్తారు… ట్రాకులు స్టార్ట్ చేస్తారు… అదంతా ఫన్ కోసం… ఆ రొమాన్స్ కేవలం తెర వరకే… సరే, కొందరు నిజంగానే ప్రేమలో పడిపోయి పెళ్లి కూడా చేసుకుంటారు, అది వేరే సంగతి…
లైక్ రాకింగ్ రాకేశ్, సుజాత… విడిపోయేవాళ్లూ ఉంటారు… లైక్ ఫైమా, ప్రవీణ్… బట్, దాదాపు 9, 10 ఏళ్లపాటు సుధీర్, రష్మి లవ్ ట్రాక్ తెలుగు టీవీ షోలకు సంబంధించి అల్టిమేట్… తమది నటన అని చెబుతున్నా సరే టీవీక్షకులు మాత్రం వాళ్లను తమకిష్టమైన జంటగానే చూస్తుంటారు… అఫ్‌కోర్స్, ఇప్పుడు తెర మీద కెమిస్ట్రీ లేదు, వేర్వేరు షోలు చేస్తున్నారు కాబట్టి…
Ads
ఈమధ్య ప్రియాంక జైన్, శివకుమార్ జంట పాపులరైంది… యాదమరాజు స్టెల్లా పెళ్లి చేసుకున్నారు… అప్పుడప్పుడూ ఇద్దరు కలిసి కనిపిస్తుంటారు షోలలో… బిగ్‌బాస్‌లో విష్ణుప్రియ, పృథ్వి నడుమ మొదలైన లవ్ ట్రాక్… ప్రస్తుతం ఇద్దరూ కలిసి షోలలో నటిస్తూ మరింత రక్తికట్టిస్తున్నారు…
ఇప్పుడు విషయం ఏమిటంటే.? లవ్వులు, బ్రేకప్పులు కామన్… కొన్ని నటన, కొన్ని ఒరిజినల్… ఐతే ఒరిజినల్‌గా ఏదైనా జంటకు బ్రేకప్ అయితే దాన్ని పదే పదే టీవీ షోలలో గెలకడం చిరాకు పుట్టించే వ్యవహారం… ఆ జంట నిఖిల్, కావ్య…
ఇద్దరూ కన్నడమే… ఏదో తెలుగు సీరియల్‌లో నటిస్తూ ప్రేమలో పడ్డారు… కొన్నాళ్లు కలిసి తిరిగారు, కలిసే ఉన్నారు… కానీ ఏదో తేడా కొట్టింది విడిపోయారు… నిఖిల్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడూ ఈ బ్రేకప్ ప్రస్తావనే… బయట ఉన్న కావ్యను కూడా గెలికి ఏదో నిఖిల్ మీద నెగెటివ్ కామెంట్లు చేయించడం…
బయటికి వచ్చాక కూడా అంతే… అసలే శ్రీముఖి గొంతు, అరుపులు, కేకలు చికాకు పెడుతుంటాయి కదా, పైగా ఇదో తలనొప్పి… ఆమధ్య ఏదో షోలో వాళ్లిద్దరినీ గెలికే ప్రయత్నం చేసింది… మామూలుగానే నిఖిల్ పెద్దగా ఎమోషన్స్ కనబర్చడు… కూల్… తరువాత ఇంకేదో షోలో సుడిగాలి సుధీర్ కూడా ఇలాగే గెలికాడు… ఎప్పుడూ స్ట్రెయిట్ జవాబు ఇవ్వడు నిఖిల్… అలియాస్ నికూల్…
తాజాగా మళ్లీ కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గలర్స్ షోలోకి నిఖిల్ వచ్చాడు… మళ్లీ ఇదే గోకుడు… లవ్‌లో సెకండ్ చాన్స్ ఇస్తావా అనే ప్రశ్న… ఓ కాగితం తీసుకుని, దాని మీద ఏదో రాసి కాల్చేశాడు… ఇకనైనా దీన్ని ఆపేయండ్రోయ్ అని రాసి, కాల్చేసి, ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు… వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నారు… కలిసి ఉండాలా, విడిపోవాలా వాళ్లిష్టం…
వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి… బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు, బయటికి వెళ్లగానే కావ్య దగ్గరకు వెళ్లి, తప్పయిందని చెబుతానని అన్నాడు నిఖిల్… కానీ అదేమీ వర్కవుట్ కానట్టుంది… సో, వాళ్లను అలా వదిలేయండర్రా…!!
Share this Article