Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వర్ణగిరి వెంకటేశ్వరుడి గుడి… ఈ వైకుంఠద్వార దర్శనం వేళ…

January 10, 2025 by M S R

.

స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి గుడి… మానేపల్లి జువెలర్స్ వాళ్ల ప్రైవేటు గుడి… థాంక్ గాడ్… అడ్డమైన దిక్కుమాలిన దేవాదాయ శాఖ కన్నుపడలేదు, లేకపోతే ఈపాటికే ‘దిక్కుమాలి’పోయేది…

హైదరాబాద్ సమీపంలో గుడి… వందల ఎకరాల్లో ప్రాంగణం… బోలెడు మంది ఉద్యోగులు… పేద్ద విగ్రహం… అంతా వోకే… ఏడాది క్రితం మొదటిసారి పోయినప్పుడు… అడ్డమైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ తీరు చూసి, గుడి మెయింటెనెన్స్ చూసి చిరాకెత్తి… 50 రూపాయల టికెట్లు తీసుకుని మరీ బయటి నుంచే దండం పెట్టి వచ్చేశాం…

Ads

నాకు దేవుడు భక్తసులభుడిగా ఉండాలి… అంతే… కష్టసాధ్యుడు, క్లిష్టసాధ్యుడు అయితే నాకు ఆ దేవుడే అక్కర్లేదు… మరో సందర్భంలో రెండోసారి వెళ్లినప్పుడు కొద్దిగా మార్పు… మరీ గేమ్ చేంజర్ కాదు గానీ కాస్త అనుభవ పాఠాలతో మార్పులు చేస్తున్నట్టున్నారు… ఏమో, ఆ చిన జియ్యరుడు దూరదూరంగా ఉంటున్నాడేమో, అందుకే బాగుపడుతున్నదేమో…

సరే, వైకుంఠ ఏకాదశి కదా… వైష్ణవాలయాలకు ఉత్సవశోభ ఉంటుంది… అసలే విష్ణుమూర్తి అలంకారప్రియుడు, పైగా ముక్కోటి ఏకాదశి… ఇక అలంకరణలు, ప్రత్యేకపూజలు అన్నీ… వైకుంఠ ఏకాదశి అనే సెంటిమెంట్ ఏమీ లేదు, ఐనా వెళ్దాం అనుకుని… జీరో అంచనాలతోనే వెళ్తే… అబ్బురం… జస్ట్, ఆరు నెలల్లో గణనీయ మార్పు… పార్కింగ్ స్లాట్ దగ్గర నుంచీ…

అసలు అది కాదు… గుడి లోపలకు వెళ్లాక ఆ అలంకరణ తీరు చూసి అబ్బురం… పూలు, పళ్లు, నెమలీకలు, పూలకొమ్మలు, కొబ్బరికాయలు… వాట్ నాట్..? ఎక్కడ ఎలా వీలైతే అక్కడ అంతగా అలంకరణ… క్యూ లైన్ల దగ్గర నుంచీ మార్పు కనిపించింది… గతంలో 50 టికెట్టు, 1000 టికెట్టు లేదా డోనర్ ప్రివిలేజ్…

ఇప్పుడు 100, 300, 500 దర్శనాలుగా మార్చారు… కానీ ఓ ఆశ్చర్యం ఏమిటంటే..? మామూలు రోజుల్లో విరగబడుతున్నారు కదా, యాదగిరిగుట్టకు వస్తున్న భక్తసంఖ్యకన్నా అధికంగా… మరి వైకుంఠ ఏకాదశి రోజున ఇంత భారీ ఖర్చుతో విశేష ఏర్పాట్లు చేస్తే రోజువారీ సగటుకన్నా తక్కువ రద్దీ కనిపించడం..!!

జలశయన పద్మనాభస్వామి ప్రాంగణంలో అలంకరణ అల్లిమేట్… నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని గుళ్లకు ఎంతసేపూ ఆదాయ ధ్యాస తప్ప ఓ టేస్టుతో అద్భుతంగా అలంకరించి ఓ విశేష ఉత్సవంలా చేయాలనే సోయే ఉండదు… అఫ్ కోర్స్, తిరుమల వేరు… అద్భుతమైన అలంకరణ…

ఆ ఫోటోలు తనివితీరా చూడాల్సిందే… అందుకేనేమో… వీవీవీఐపీలు విరగబడ్డారు… ఆ ఆరుగురు మృతి చెందిన తొక్కిసలాట వార్తలు ఎలా ఉన్నా సరే, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు… ఏదీ ఆగదు, ఎవరి కోసం ఏదీ మారదు…

ఇదెందుకు చెప్పడం అంటే..? దేవాలయాలు ప్రభుత్వ పెత్తనం కింద ఉండటంకన్నా ప్రైవేటు, కార్పొరేటు పెత్తనంలో ఉంటే డెఫినిట్‌గా బాగుంటాయి… మితిమీరిన రద్దీ వల్ల స్వర్ణగిరి గుడి మెయింటెనెన్స్ ఇంకా గాడిన పడకపోవచ్చుగాక… కానీ ప్రైవేటు ప్రైవేటే…

ఆ స్వర్ణగిరి వేంకటేశ్వరుడు దిక్కుమాలిన దేవాదాయ, అక్రమ పెత్తనం కిందకు వెళ్లకుండా ఆ స్వామి తనను తాను రక్షించుకుంటాడనే ఆశతో,.. ఆకాంక్షతో…!! సదరు గుడి నిర్మాతలకు ఓ సూచన… విశిష్ఠ అతిథులకు కూడా శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం ప్లస్ వేదపండితుల ఆశీస్సులు కూడా ప్రవేశపెడితే… తిరుమలకు రిప్లికా… గ్యారంటీ..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions