అయోధ్య రాముడిని జాతి ఓన్ చేసుకోవడం అంటే..? రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ పంపించిన అక్షితల్ని మనింటి పూజగదిలోని అక్షితలతో కలిపి రాముడికి మనసారా ఓ మొక్కు సమర్పించుకోవడం..! అంటే, జాతి యావత్తూ ఆ గుడిని స్వాభిమాన సంకేతంగా ఆమోదించడం, మనసులోకి ఆవాహన చేసుకోవడం…!
బాలరాముడి ప్రాణప్రతిష్ట ముహూర్తం సమీపించేకొద్దీ… హిందూ సమాజంలో ఆ సందడి, జోష్, పండుగ వాతావరణం, భక్తి ఉద్వేగం పెరుగుతోంది… అనేక మంది విశిష్ట కానుకల్ని పంపిస్తున్నారు… వాటన్నింటినీ అయోధ్య దేవాలయం ఎలా స్వీకరించగలదనే విభ్రమ కలుగుతోంది… అవన్నీ కాదనలేదు, వాటిని నిజంగా దేవుడికి ఎలా సమర్పించాలో కూడా తెలియదు… ఉదాహరణకు…
3.5 అడుగుల వ్యాసంతో 108 అడుగుల భారీ అగరుబత్తి ఒకటి వడోదర నుంచి అయోధ్యకు పయనమైంది… (దీన్ని కొందరు ధ్వజస్థంభం అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు…)
Ads
దీన్ని ఇంటి దగ్గరే రూపొందించడానికి వడోదరలోని తరసలికి చెందిన విహాభాయ్ భార్వాడ్ ఆరు నెలలుగా కష్టపడుతున్నాడు… ఆయనకు గతంలో 111 అడుగుల అగరుబత్తి రూపొందించిన అనుభవమూ ఉంది… దీని కోసం ఆయన 3000 కిలోల గిర్ ఆవు పేడ, 91 కిలోల గిర్ ఆవు నెయ్యి, 280 కిలోల దేవదార్ చెట్టు చెక్క, 376 కిలోల గుగ్గుల బెరడు, 370 కిలోల కొబ్బరి పొడి, 560 కిలోల తాల్, జావ్, 425 కిలోల ఇతర సుగంధ పదార్థాలు వాడాడట…
ఇలాంటి కానుకలే బోలెడు… నేపాల్ రెండు భారీ సాలిగ్రామ శిలల్ని పంపించిన ముచ్చట చదువుకున్నాం ఆల్రెడీ… శిల్పాలకు వాడుకోకపోయినా ఈ శిలలను గుడిలో ఎక్కడైనా భద్రంగా దర్శనానికి వీలుగా ఉంచాలని నేపాల్ ప్రతినిధివర్గం కోరుతోంది… తమిళనాడు రామేశ్వరం నుంచి 620 కిలోల భారీ గంట కూడా అయోధ్యకు పయనమైంది… అంత పెద్ద గంట మోగించడం ఎలా..?
8 అడుగుల పొడవైన స్వర్ణపూత పాలరాతి సింహాసనం రాజస్థాన్ కళాకారులు పంపించారు… దీన్ని ఏకంగా గర్భగుడిలోనే అకామిడేట్ చేస్తామని ట్రస్ట్ చెబుతోంది… మన తెలుగు నేల నుంచి భారీ పాదుకలు వెళ్తున్నాయి… అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ 10 అడుగుల పొడవు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఓ భారీ తాళాన్ని పంపించాడు… తాళపు చెవి నిడివి 4 అడుగులు… ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళం… చాన్నాళ్లు కష్టపడ్డాడు…
సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 5000 అమెరికన్ డైమండ్స్‌తో కూడిన ఓ నెక్లెస్‌ను సీతమ్మవారి కోసం ఆఫర్ చేశాడు… ఇక నిర్మాణానికి అవసరమైన విరాళాలను ట్రస్టు కోరితే, అవసరమైన నిధులకన్నా మూణ్నాలుగు రెట్లు ఎక్కువ వచ్చాయి… దాంతో విరాళాల స్వీకరణే ఆపేశారు… ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి జస్ట్, శాంపిల్ ఉదాహరణలు మాత్రమే… దేశం స్వాతంత్ర్యం పొందాక సోమనాథ్ గుడిని పునరుద్ధరించింది… ప్రభుత్వ వ్యయం… కానీ అయోధ్యతో ప్రతి రామభక్తుడి అనుబంధం, ఉద్వేగం వేరు… ఏ గుడితోనూ యావత్ హిందూ జాతి ఇంతగా కనెక్ట్ కాలేదు…!! అవునూ, శూర్ఫణఖ జన్మభూమి, రావణ జన్మభూమి అని కొక్కిరించిన బొందుగాళ్లను ట్రస్ట్ పిలిచిందా..? అయోధ్య వెళ్లి సాగిలపడతారా..?!
Share this Article