Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తిడితే పడాలి… మళ్లీ అదే అదే మాట్లాడాలి… తిట్లు తట్టుకోవడం ఓ కళ…

July 1, 2023 by M S R

Bharadwaja Rangavajhala……  తిట్టను అరిగించుకోవడం ఎలా? మొన్నామధ్య నెల్లూరు వెంకటనారాయణ గారు భోజనానికి పిల్చినప్పుడు … ఓ మాట అడిగారు. ఆయనకి నా కజిన్ తో ఫ్రెండ్సిప్ ఉంది. కజిన్ అంటే …. మా మేనత్తగారి అల్లుడు… ఈయన నాతో ఫేసుబుక్కులో స్నేహం చేస్తున్న సందర్భంలో … వారి దగ్గర నా ప్రస్తావన వచ్చిందట …

అప్పుడు మా మేనత్తగారి అమ్మాయి … (వీళ్లందరినీ … నేను చాలా చిన్నపిల్లలుగానే చూస్తానిప్పటికీ … వీళ్లు ఇంకా ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఉన్న రోజుల్లోనే నేను మా మేనత్తగారింట్లో కూర్చుని చండ్రపుల్లారెడ్డి గార్రాసిన కమ్యునిస్టు పార్టీ చరిత్ర చదివేను … అది అక్కడే మర్చిపోయొచ్చాను. మా మేనత్తగారు దాన్ని పనిమనిషి చేత అవతల పారేయించారట తర్వాత .. పాపం …)

అసలు ఆ భరద్వాజ అనే పాత్ర ఎవరో తెల్సా అని అడిగిందట వీరిని …

Ads

ఆయనో జర్నలిస్టు అని ఏదో చెప్పబోయారట ఈయన.

సదరు భరద్వాజ అనే పెద్దమనిషి మా బావే … మేనమామ కుమారుడు అని వివరించిందట ఆవిడ.

ఈయనకి కొంచెం పెద్ద బోల్డు ఆశ్చర్యం వేసింది …

ఆవిడ ద్వారా మా కుటుంబం ఆరెస్సెస్ అసోసియేషన్ అనే విషయం ఆయనకి చూచాయగా తెల్సు ..

దీంతో …

మొన్న భోజనానికి పిల్చినప్పుడు పిచ్చాపాటీ మాట్లాడుతుండగా …

ఏవండీ … మీ వాళ్లందరూ ఆరెస్సెస్ కదా మీరేమిలా ? వాళ్లెప్పుడూ తిట్టలేదా మిమ్మల్ని అన్నారు.

అయ్యో, ఎందుకు తిట్టలేదూ, ఇప్పటికీ తిడుతూనే ఉన్నారన్నాను.

ఆ మధ్య రాముడి మీద నేనేదో ఫేస్బుక్కులో ఏదో రాస్తే అది మా బ్యాచ్ కి తెల్సి … ఒకరికొకరు ఫోనుల్చేసుకుని మరీ వాడిలా రాశాట్ట … మనమేం చేయలేమా వాడ్ని అని సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు … మా బావొకడు చెప్పాడు అన్జెప్పా .

ఆయనా నాకు తెల్సు అన్నాడీయన.

సూపర్ అనుకున్నా … ప్రపంచం చాలా చిన్నది అంటే ఇదే … అని ఓ వివరణ కూడా ఇచ్చారు వెంకటనారాయణ గారు.

అప్పుడు నేనో మాట చెప్పా …

తిట్టించుకోవడాన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాన్నేను .. అని …

తిట్లకి ఆవేశపడకుండా … ఉండాలి … అవతలివాడు తిట్టినా మనం అనుకున్నది మనం మాట్లాడేయాలి … వాడు మరింతగా రెచ్చిపోయి తిట్టినా వాడ్ని మన్నింపు వేడుకుని మరీ మనం చెప్పదల్చుకున్నది చెప్తూనే ఉండాలి … అంతే తప్ప వాడ్ని వ్యక్తిగతంగా దూషించకూడదు.

మనం చెప్పాల్సింది మానకూడదు …

వాడు మరీ … చేతనాత్మకంగా మన నడకకు అడ్డం పడ్డప్పుడు ఇక ముందుకు వెళ్లడం కష్టమనిపించినప్పుడు మహర్షి చారుమజుందార్ చెప్పినట్టు వర్గశత్రు నిర్మూలన చేయొచ్చు గానీ … అంత వరకు మాత్రం ఆవేశపడకూడదు …

బూతులు తిట్టినా తట్టుకోగలగాలి .. వ్యక్తిగతంగా తీసుకుని బాధ పడకూడదు … హర్ట్ అవకూడదు .. మన పని నచ్చనివాడు మన్ని తిట్టినప్పుడు మనం ఆ పని మానేశామంటే … మనం చేసిన పని మీద మనకి గౌరవం లేనట్టే కదా …

అంతగా మనకే గౌరవం లేని పని మనమేల చేయవలె?

మనం గౌరవిచ్చే పని గురించి ఎవరెన్ని విధాల తిట్టినా దుమ్మెత్తి పోసినా … పట్టించుకోరాదు … ఆవేశపడరాదు …

మనం ఏ భావజాలాన్నైతే టార్గెట్ చేస్తామో ఆ భావజాలాన్ని మోసే వారు ఖచ్చితంగా మన మీద దాడి చేస్తారు. అలా దాడి చేయకపోతే ఆశ్చర్యపోవాలి …

వాళ్లతో చర్చల్లోకి దిగరాదు … వారికంటే బయట ఉండే విస్తృత ప్రజానీకానికి నీ ఆర్గ్యుమెంటు అర్ధం చేయించి, తద్వారా నీవు తప్పనుకుంటున్న భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలి గానీ …

ఈ తిట్టేవాళ్లతో చర్చిస్తూ కూర్చుంటే పనవదు…

అలా నిన్ను నిల్చున్నచోటే నిలబెట్టేయడానికే ఈ తిట్ల దాడి జరుగుతుంది … అదే దాని లక్ష్యం.

మనసులను గాయపరచి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని … తన మీద జరిగిన దాడిని తిప్పికొట్టే పనిలో అవతలవాడిని ఎంగేజ్ చేయడం కోసమే మెసెంజర్లలోకి వచ్చి తిడుతూ ఉంటారు కొందరు గ్యానులు …

నిజానికి ఇట్టి గ్యానుల కొరకే ఇది రాస్తున్నాను … గత మూడ్రోజులుగా మెసెంజర్లోకి వచ్చి పడ్డ ఆవేశమే నాచే ఇలా రాయిస్తోంది …

వాటిని చదవాలి. ఒకటికి రెండు సార్లు చదవాలి తప్ప … రియాక్ట్ కాకూడదు …

ఇలా తిట్లకు అలవాటు పడడడం … తిట్లను తట్టుకోగలగడం … తిట్లకు ప్రాపర్ గా రియాక్ట్ కావడం ఇవన్నీ కూడా సామాజిక జీవనంలో కాస్త బలంగా ఉన్న వారు ప్రాక్టీసు చేయాల్సిన అవసరం చాలా ఉందనిపించింది.

ఇదేదో కేవలం ఆరెస్సెస్ వారికే పరిమితం కాదు …

మన నానా విధ కమ్యునిస్టుల్లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది … తమ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్న వారి మీద తిట్ల దాడి చేయడంలో వారూ తక్కువ వారేం కాదు …

వాటినీ భరించాలి … తిట్టు అనేది అవతలివారి మానసిక దౌర్బల్యంగా మాత్రమే చూడాలి తప్ప మనని వాడు గాయపరుస్తున్నాడనుకోరాదు ..

పాత రోజుల్లో కొసరాజు గారు రాసినట్టు దూషణ భూషణ తిరస్కారములను ఆశీస్సులుగా తలచేవారికి …

ఈ ప్రపంచంలోకి మనం రావడమే ఇల్లరికం అల్లుడులా వచ్చామనుకుంటే ఎంత పిలాసఫీ అండీ ఆ పాటలో ..

పీకపుచ్చుకుని బయటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడీ … అంటే … ఏమిటీ …

ఆసుపత్రులకు కోట్ల రూపాయలు కట్టి అలా సినిమా నడిపించేస్తూ ఉంటారే వాళ్లన్నమాట … ఇలా … బోల్డు జీవితం రాశారు గురువుగారు … మహానుభావుడు … మళ్లీ వేదాంతంలో పడిపోతున్నాను …

అంచేత తిట్ల విషయంలో సాధ్యమైనంత ప్రజాస్వామికంగా వ్యవహరించేలా మన్ని మనం తర్ఫీదు చేసుకుందాం …

నిజానికి అమీర్ పేటలో ఇలా తిట్లకి అలవాటు పడించేందుకు ఒక ఇన్స్ టిట్యూట్ పెట్టి నడపాల్సిన అవసరం కూడా ఉందని గుర్తించాన్నేను.

ఉద్యోగంలో కావచ్చు … జీవితంలో కావచ్చు … ఉద్యమాల్లో కావచ్చు ఎక్కడైనా తిట్లకు అలవాటైన వాడు దూసుకెళ్లి విజయాలు అందుకుంటాడు .. కనుక కెరీర్ ఓరియంటేషన్ లో భాగంగా తిట్ల ఇన్స్ టిట్యూట్లను కూడా పెట్టాలి … నిజానికి ప్రతి కళాశాలలోనూ స్కూల్లోనూ కూడా ఇందు కోసం క్లాసులు పెట్టాలి … తిట్ల మేనేజ్మెంటు కోర్స్ లాంటిది ఒకటి విశ్వవిద్యాలయాల వాళ్లు పెట్టొచ్చు … అదీ తిట్ల పురాణం … స్వస్తి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions