.
రిపబ్లిక్ టీవీ లైవ్‌లో… మొన్న పహల్‌గామ్ పైశాచిక ఉగ్రచర్యలో తన సోదరుడిని పోగొట్టుకున్న ఓ వ్యక్తి చెబుతున్నాడు…
‘‘మా వదిన నొసటన సిందూరాన్ని తొలగించారు ఉగ్రవాదులు… మన ప్రభుత్వం, మన ఆర్మీ, మన ఎయిర్‌ఫోర్స్ నా సోదరుడిని మళ్లీ తీసుకువచ్చి మాకు అప్పగించకపోవచ్చు… కానీ మా వదిన నొసటన సిందూరాన్ని గౌరవించారు… జయహో ఆపరేషన్ సిందూర్’’
Ads
… ఆపరేషన్ సిందూర్‌కు ఆ పేరు ఎంత ఆప్ట్ కదా అనిపించింది అతని మాటలు వింటుంటే… మతం పేరు అడిగి మరీ, వారం రోజుల క్రితమే పెళ్లయి వచ్చిన వరుడిని బలిగొని, వధువును ‘పో, పోయి మీ మోడికి చెప్పుకోపో’ అన్నారు కదా ధూర్తులు… సిందూర్ పేరు కరెక్టు… సిందూర్ ముత్తయిదతనానికీ, మాంగల్యానికి సూచిక…
వేరే టీవీ చానెళ్లతో పోలిస్తే రిపబ్లిక్ టీవీ అర్ధరాత్రి అప్‌డేట్స్, దాడుల కవరేజీలో వెనుకబడినట్టు కనిపించింది కానీ పొద్దునే అర్నబ్ గోస్వామి తనే స్వయంగా స్టూడియోకు వచ్చి డిబేట్ స్టార్ట్ చేశాడు… ఎక్కడా గుంజాటన లేదు, సూడో సెక్యులరిస్టుల భాష లేదు…
భారత్ మాతకు జై అంటూ పహల్‌గామ్ బాధితుల వాయిస్ తీసుకుంటూ, యుద్ధ దృశ్యాలను చూపిస్తూ… రెయిజ్ టు అకేషన్… జోరుగా కవరేజీ కొనసాగిస్తున్నాడు… కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పని చేసింది… డాన్ వంటి పాకిస్థానీ పాపులర్ మీడియా సైట్లను, వీడియోలను ఇండియాలో నిషేధించారు…
అర్ధరాత్రి 1.44 గంటలకు ప్రారంభమైన దాడిని ముప్పావు గంటలో ముగించేసింది ఇండియా… ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త ఆపరేషన్… మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించారు… బల్వాపూర్ ఇండియా బోర్డర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అంటే ఇండియా ఎంత సీరియస్‌గా, ఎంత దూరం వెళ్లి అటాక్స్ చేసిందో అర్థం చేసుకోవచ్చు…
పాకిస్థాన్ అందుకే అర్జెంటుగా ఎమర్జెన్సీ ప్రకటించింది… దాదాపు 80 మంది ఉగ్రవాదులు మరణించారని ప్రాథమిక సమాచారం… బ్రహ్మాస్ క్షిపణులను ప్రయోగించినట్టు కొందరు చెబుతున్నారు గానీ ఆర్మీ ధ్రువీకరణ లేదు…
10 గంటలకు ఆర్మీ అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది… యుద్ధ సంబంధ కీలక విభాగాలతో మోడీ 11 గంటలకు భేటీ వేసి సమీక్ష జరపనున్నాడు…
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఇండియా దాడి పట్ల రిగ్రెట్స్ అని చైనా స్పందించింది… దాని గుణం తెలిసిందే కదా… బెలూచ్ పోరాటం పెరిగేకొద్దీ, పాకిస్థాన్‌లో పెట్టిన పెట్టుబడులు హరించుకుపోతాయి కదా… పైగా భారత వ్యతిరేకత రక్తంలోనే ఉంది కదా చైనీయులకు…
ఒక మాట…. ప్రగతి శీల శక్తులుగా కాలరెగరేసే కొందరు చివరకు పాకిస్థానీ ఫేక్ క్యాంపెయిన్‌కు సహకరిస్తూ, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు… ఎస్, పాకిస్థాన్ నిజానికి అసలు శత్రువు కాదు… ఈ దేశానికి వెన్నుపోటు పొడిచే ఇలాంటోళ్లే…!!
సూచన… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మెదళ్లు అరికాళ్లలో ఉన్న రాజకీయ నాయకులూ, ప్లీజ్ ఈ కొన్నిరోజులైనా మీ తుచ్ఛమైన పరస్పర విమర్శలు మానేయండర్రా…
.
రాత్రి మొత్తం మోడీ మెలకువగా ఉంది ఆపరేషన్ సమీక్షలో అన్నట్టు వార్తా కథనాలు…
.
Share this Article