Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…

April 11, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. ఒక పక్క తాత్కాలిక యుద్ధ విరమణ అని చర్చలు జరుగుతుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు!
నిన్న సాయంత్రం హార్మోజ్ జలసంధి మీద నిఘా వేసి తిరిగి వెళ్లిపోతున్న అమెరికన్ నిఘా డ్రోన్ MQ-4C TRITON ని కూల్చేసింది ఇరాన్!
200 మిలియన్ల డాలర్ల ఖరీదు చేసే నిఘా ( surveillance) అన్ మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన MQ-4C Triton రిమోట్ ఆపరేటర్స్ కంట్రోల్ నుండి తప్పిపోయింది!

గురువారం రోజున పర్షియన్ గల్ఫ్ మీద మూడు గంటలపాటు ఎగిరి చివరగా హార్మోజ్ స్ట్రెయిట్ మీద ఎగురుతూ టెహ్రాన్ వైపు వెళ్ళడానికి వంపుగా తిరుగుతున్న సమయంలో డిస్ట్రెస్ మెసేజ్ code 7700 ని బేస్ కి పంపిస్తూ క్రమంగా కిందికి దిగుతూ అదృశ్యం అయిపొయింది!
డిస్ట్రెస్ కోడ్ 7700 అంటే ఎమర్జెన్సీ అని అర్ధం!

Ads

ఎవరన్నా ఎటాక్ చేశారా లేక టెక్నీకల్ సమస్య వల్ల ప్రమాదం జరిగి కూలిపోయిందా అన్నది తెలియరాలేదు.
ఆన్లైన్ ఫ్లైట్ రికార్డింగ్ వెబ్ సైట్ Flight Radar 24 కధనం ప్రకారం MQ-4C UAV ఇటలీ లోని అమెరికన్ నావల్ బేస్ అయిన సిగోనెల్లా ( american naval station Sigonella, Italy ) నుండి బయలుదేరి టెహ్రాన్ మీదుగా పర్షియన్ గల్ఫ్ మీద మూడు గంటల పాటు ఎగిరి చివరగా హార్మోజ్ స్ట్రెయిట్ మీద ఎగురుతూ టెహ్రాన్ మీదుగా ఇటలీ వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ భూభాగం మీద కూలిపోయింది!

బహుశా టెహ్రాన్ మీదుగా ఎగురుతూ పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్ళినప్పుడు చైనా ఉప్పందించి ఉంటుంది! ఎటూ తిరిగి టెహ్రాన్ మీదుగా ఎగురుతూ ఇటలీ వెళ్ళిపోతుందని ఊహించి హార్మోజ్ స్ట్రెయిట్ దగ్గర కాపు కాచి కూల్చేసి ఉండవచ్చు!

సైలెంట్ కిల్లర్ SA-67 ఖాతాలో MQ-4C కూడా చేరిపోయింది! MQ -4C లో అత్యాధునిక సెన్సర్స్ ఉన్నాయి కానీ SA -47 మిసైల్ ని గుర్తించి ఆపరేటర్ ని అలర్ట్ చేయలేకపోయింది!
MQ- 4C లో చీకట్లో కూడా చూడగల 360 డిగ్రీల కెమెరా ఉంటుంది. ఇటలీ లోని నావల్ బేస్ లోని ఆపరేటర్స్ లైవ్ లో వీడియో చూడగలరు కానీ ఎలాంటి మిసైల్ వాళ్లకి కనపడలేదు అంటే అది SA – 67 పనే అయిండవచ్చు!

భారత్ పరిస్థితి ఏమిటి?
నార్త్రప్ గ్రుమ్మన్ (Northrop Grumman ) MQ-4C Triton (HALE – High Altitude Long Endurance ) ని గతంలో మనకి అమ్మడానికి ప్రయత్నించింది. భారత నావీ బోయింగ్ P-8I పెసోడియన్ ( సబ్ మెరైన్ హంటర్, కిల్లర్- Poseidon- 8I maritime patrol ) లని కొనడానికి ఒప్పందం చేసుకున్నప్పుడు నార్త్రప్  తన MQ-4C ట్రీటన్ ని బోయింగ్ P-8I పెసోడియన్ తో కలిపి వాడితే మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని డెమో ఇచ్చింది కానీ భారత నావీ తిరస్కరించింది!

2020 లో జెనరల్ అటమిక్స్ ( General Atomics ) సంస్థ నుండి MQ-9B Sea / Sky Guardian డ్రోన్స్ ని లీజు ప్రాతిపదికన ఒప్పందం చేసుకొని హిందూ మహాసముద్రం మీద నిఘా కోసం వాడింది భారత నావీ.
2024 అక్టోబర్ లో భారత నావీ 31 MQ-9B Sea /Sky డ్రోన్స్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 4 బిలియన్ డాలర్లు! ఈ సంవత్సరం చివరలో డెలివరీ చేయాల్సి ఉండగా రేర్ ఎర్త్ మినరల్స్ కొరత కారణంగా ఆలస్యం అవొచ్చు!

మరి MQ-4C TRITON HALE మాటేమిటి?
భారత నావీ స్వదేశీ పరిజ్ఞానం తో HALE – High Altitude Long Endurance డ్రోన్ ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది MQ-4C TRITON తో సమానంగా ఉంటుంది! 2029 లో మొదటి టెస్ట్ ఫ్లైట్ ఉండవచ్చు. ఇంజిన్ అయితే కావేరి ని వాడుకోవచ్చు!

ఇంతలో ఎంత మార్పో కదా!
రష్యా నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటున్నాం కాబట్టి ట్రంప్ CAATSA ( Countering America’s Adversaries Through Sanctions Act ) విధించి MQ-9B Sea/Sky గార్డియన్ డ్రోన్స్ భారత్ కి అమ్మకుండా అడ్డుకుంటాడేమో అనే ఆందోళనల నుండి… ఇప్పుడు స్వంతంగా అభివృద్ధి చేసుకునే దశలోకి భారత్ వచ్చేసింది!
MQ-9B Sea /Sky గార్డియన్ UAV ల కోసం MRO ( Maintenance, Repaire, Overhaul ) ఫెసిలిటి ని భారత్ లో ఏర్పాటు చేయబోతున్నది జెనరల్ ఆటమిక్స్!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?
  • మావిగన్ ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక…
  • చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…
  • మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…
  • ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
  • రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?
  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…
  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions