గోపంచకం తాగితే సకల అరిష్టాలు, పాపాల నుంచి విముక్తి…. గోమూత్రం నుంచి బంగారం లభించును… గోమలం నుంచి కరోనా మందు తయారు చేయవచ్చును… గోవు మెడలు నిమిరితే బీపీ, స్ట్రెస్ నుంచి మోక్షం………….. ఇలా గోమాత గురించి గోప్రేమికులు నానా వ్యాఖ్యలూ చేస్తుంటే చాలామందిమి నవ్వుకున్నాం, ఇంకా ఏ లోకంలో ఉన్నారురా భయ్ మీరు అని వెక్కిరించాం… గతంలో గోమాంసం తినేవాళ్లట యోగులు, రుషులు గట్రా అంటే కుపితులమయ్యాం… చివరకు గోవులు కూడా బీజేపీ పార్టీయే అని జతకట్టేసి…. మన వీర కేసీయార్ అభిమాన భృత్యగణం, జగన్ వీరాభిమాన దళం ప్లస్ యథావిధిగా కాంగిరేసు, కమ్యూనిస్టు భక్తబృందాలు తూలనాడుతుంటే నిజమే కావచ్చు, అపరిమిత మేధో సంపత్తి కలిగిన సోషల్ గణం కదా, నిజమేనేమో అనుకున్నాం… బీజేపీని తిట్టడం వేరు, హిందూయిజాన్ని తిట్టడం వేరు అనే తేడా లేకుండా పోయిన స్థితినీ చూశాం, చూస్తున్నాం, చూస్తాం… దుంపతెగ, ఆ బీజేపీ వాళ్లూ సేమ్ సేమ్… అనేకసార్లు గువ్వకు సిగ్గూశరం కూడా లేకుండా మాట్లాడతారు… సరే, దాన్నలా వదిలేస్తే… నిజంగానే ఆవుకు… కాదు, కాదు, ఆవు పేడతో ఓ ప్రయోజనం ఉందటండోయ్… పడికలు చేయడం, హోమగుండాల్లో, పూజల్లో కాల్చడం కాదు… ఇది చదవండి… ఈనాడులో వచ్చిన వార్త…
జైగోమాత… ఆవు పేడ నుంచి… నిజమేనండీ… ఆవు పేడ నుంచి… ఆ సేంద్రియ వ్యర్థం నుంచి రెండుమూడు సూక్ష్మజీవులను వేరు చేశారట శాస్త్రవేత్తలు… జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం… దాన్నుంచి ఒక బయో కంపోజర్ తయారు చేశారు… జస్ట్, 20 రూపాయల పొడి… ఓ చిన్న డబ్బా… డ్రమ్ముల కొద్దీ ద్రావణం తయారు చేసి పిచికారీ చేస్తే…. చీడపీడల నుంచి రక్షణ… బయో ఎరువు… విత్తనశుద్ధి ఎట్సెట్రా అన్నీ… ఎహె, మేమొప్పుకోం అంటారా..? అరె, ఉత్తరాదిలో వేల మంది రైతులు వాడుతున్నారు, మన తెలుగునాట కూడా మన ఈటీవీ, ఈనాడు అన్నదాత ప్రచారం పుణ్యమాని బోలెడు మంది తెలుగు రైతులు కూడా వాడి ప్రయోజనం పొందుతున్నారట… ఛిఛీ, మన సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే ఎట్సెట్రా పిచ్చి పత్రికల వ్యవసాయ స్పెషల్ పేజీలు చెత్తా, చెత్తన్నర… అది మామూలు గేదెల పేడకన్నా దరిద్రం… వాయిక్, థూ…
Ads
ఈ ఈనాడు వార్తలో బాగా నచ్చిందేమిటయ్యా అంటే…? ఈ సూక్ష్మజీవుల ద్రావణం ఉపయోగించాక మట్టిలో వానపాముల సంఖ్య బాగా పెరగడం… వానపాములు పెరగడం అంటే మట్టి తన సహజ మాతృస్థితిని పొందిందీ అని అర్థం… పవర్ ఫుల్ రసాయనాల వాడకంతో మట్టి తన లక్షణాల్ని కూడా కోల్పోయి…. హిరోషిమా, నాగసాకి మట్టిలా మారుతున్న స్థితిలో…. తిరిగి మన మట్టి తన సహజలక్షణాల్ని తెచ్చేసుకుని, వానపాములు వంటి రైతు మిత్రుల్ని పుట్టిస్తోందంటే మామూలు విషయమా..? అయితే గోమలం నుంచి వేరు చేసిన ఆ సూక్ష్మజీవులు ఏమిటి..? ఈ ద్రావణం చల్లితే అవి ఎలా డెవలప్ అవుతున్నాయి వంటి శాస్త్రీయ వివరాల జోలికి వెళ్లలేదు ఈనాడు స్టోరీ… కానీ వీలైనంతవరకూ ఎలాబరేట్గా, ప్రొఫెషనల్ పద్ధతిలోనే సాగింది కథనం… కానీ నిజంగా అంత ప్రయోజనకరమే అయితే దీన్ని తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లలోనూ వాడాలి కదా రామోజీరావు గారూ… కాస్త మీ ఆఫీసుల చుట్టూ గోమల ద్రావణంతో శుద్ధి చేయించండి.,. మకిలిపట్టిన ఈ పత్రిక పెద్దల మెదళ్లు కాస్తయినా ‘శుద్ధికి’ నోచుకుంటాయేమో…
Share this Article