Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…

June 20, 2025 by M S R

.

ఏవేవో కథలు… చాలా చిత్రంగా రాస్తుంటారు కొందరు… చంద్రబాబు ఎన్నాళ్లుగానో ఓ ఉంగరం తొడుగుతున్నాడు వేలికి… అది ఆయన అదృష్టం… అదే గెలిపించింది…

దాంతో జగన్ కూడా సేమ్ ఉంగరాన్ని సంపాదించి ఇప్పుడు తన వేలికి తొడుగుతున్నాడు… సేమ్ చంద్రబాబు, సేమ్ జగన్ అని…

Ads

హహహ… అవేమీ మాయ ఉంగరాలు కావు, మహత్తు ఉంగరాలు కూడా కావు… జస్ట్, హెల్త్ ట్రాక్ స్మార్ట్ రింగ్స్… స్మార్ట్ వాచీలు తెలుసు కదా… సేమ్, ఇవి కూడా అంతే…

కాకపోతే అమ్మకందారులు వీటి విశేషాల్ని మరీ భూతద్దంలో చూపిస్తుంటారు… అప్పుడెప్పుడో విపక్ష నేతగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి పర్యటనకు వెళ్లిన సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో… తన చూపుడు వేలిని జనానికి చూపించిన చంద్రబాబు… దానికి ఉన్న తన ఉంగరాన్ని ప్రత్యేకంగా చూపించాడు…

ఆ ఉంగరం దేనితో తయారైందో గానీ..  స్టీల్ వస్తువు మాదిరిగా ఆ ఉంగరం కనిపించింది. ఆ చిన్న ఉంగరం తన పూర్తి స్థాయి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తనను అలర్ట్ చేస్తుందని, ఈ కారణంగానే 70 ఏళ్లు మీద పడ్డా తాను ఇంకా యంగ్ గానే కనిపిస్తానని, ఆరోగ్యంగా ఉంటానని, ఆ ఉంగరం చెప్పినట్లే తాను వింటానని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చాడు…

ఈ విషయాలు నాడు తెగ వైరల్ అయ్యాయి. మరి ఆ ఉంగరం ఖరీదు ఎంతో తెలియదు గానీ… జనంలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది… టీడీపీ శ్రేణులు దానిని ఓ ఫ్యాషన్ గా కూడా మలచుకున్నాయి… వైసీపీ వాళ్లు దీని మీద కూడా పోస్టులు పెట్టారు… ఏపీలో ఏదైనా సరే వివాదమే కదా…

ఎస్, చంద్రబాబుకు ఆరోగ్య స్పృహ బాగా ఎక్కువ… తక్కువ తింటాడు… అదీ వెరీ కాలిక్యులేటెడ్‌గా… ఏది పడితే అది తినడు… వేళకు మందులు గట్రా ఎలాగూ తప్పవు కదా… జగన్ కూడా ఆ ఉంగరమే వాడుతున్నాడు ఇప్పుడు.., తను కూడా ఏది పడితే అది తినడు… తక్కువ… తనకూ ఆరోగ్య స్పృహ ఎక్కువే…

చంద్రబాబు అప్పుడే 75 దాటుతున్నాడు… మరింత జాగ్రత్త అవసరం… జగన్ వయస్సు 50 దాటింది… ఇక తనకూ తప్పవు ఆరోగ్య జాగ్రత్తలు… ఐనా ఈమధ్య చాలామంది ఈ స్మార్ట్ రింగ్స్ వాడుతున్నారు… వేలికి అలంకరణ ప్లస్ హెల్త్ అలర్ట్స్… జేబులో ఫోన్, ఈ రింగ్‌తో ఆపరేషన్…

ధర కూడా వాళ్లు ధరించే చొక్కాలు, బూట్ల ఖరీదు కాదు… 3 వేల నుంచి 30 వేల దాకా… ఫీచర్లను బట్టి, బ్రాండ్‌ను బట్టి… స్మార్ట్ వాచీలాగే ఈ రింగ్ కూడా మన వాకింగ్ అడుగులు, కరిగిన కేలరీలు, దూరం లెక్కిస్తుంది…

మన నిద్రను ట్రాక్ చేస్తుంది, ఎంతసేపనేదే కాదు, నిద్ర నాణ్యతను కూడా కొలుస్తుంది… పల్స్ రేటు చూస్తుంది… కొన్ని హైఎండ్ రింగ్స్ బ్లడ్ ఆక్సిజన్ పరిస్థితులనూ చూస్తుంది… చెబుతుంది… ఎప్పటికప్పుడు స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కు కూడా ఈ ఉంగరం ఉపయోగమే…

వాచీలాగే ఫోన్ కాల్స్, మెసేజెస్, ఆన్సరింగ్ గట్రా సహజమే కదా… కంటాక్ట్ లెస్ పేమెంట్స్ కు కూడా ఉపయోగిస్తున్నారు కొందరు… ఇంట్లో ఉన్న ఇంటర్‌నెట్ థింగ్స్ కూడా ఈ రింగుతో మేనేజ్ చేయవచ్చు… ఇలా ఎన్నో… సో, ఇది సాంకేతిక ఆరోగ్య సహాయకారి… అంతే… నో మహత్తు, నో మాయ…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
  • పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
  • ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
  • పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
  • బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
  • ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
  • భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…
  • ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…
  • ‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’
  • AI రోబో స్నిప్పర్… ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పర్‌ఫెక్ట్ మర్డర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions