మస్తు డబ్బుంది… సో వాట్..? పొలిటిషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ గల్లా జయదేవ్ కొడుకు… సో వాట్..? మహేశ్ బాబు మేనల్లుడు… సో వాట్..? ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించారు గల్లా అశోక్ అనే ఓ వారస హీరోను…! పెద్ద తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా బోల్తాపడ్డాడు… ఏదేదో నేపథ్యం ఉంది కదాని, తెరను చించేస్తామని వచ్చేస్తే సరిపోదు,… అలా చాలామంది వచ్చారు, పోయారు… నిలబడింది కొందరే… అందుకే ఇదే అశోక్ తాత, అనగా సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో చెప్పేవాడు…
‘‘సినిమాలు కొన్ని హిట్టవుతాయి, కొన్ని ఫట్టవుతాయి, కానీ ఒక నటుడిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారా..? యాక్సెప్టెన్సీ వచ్చిందా అనేదే ప్రధానం’’… నిజమే… అందరూ ప్రభాస్, బన్నీ, జూనియర్, మహేశ్‌లు కాలేరు కదా… ఆమధ్య అశోక్ హీరోగా ‘‘హీరో’’ అనే సినిమా తీశారు… అయిదున్నర కోట్ల దాకా బిజినెస్ జరిగితే మూడున్నర కోట్ల లాస్ వచ్చిందట… అంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో రిజెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు… ఆమధ్య టీవీలో కూడా వేశారు…
తాజా బార్క్ రేటింగ్స్‌లో ఈ సినిమా రేటింగ్స్ తెలుసా మీకు..? జస్ట్ రెండు… మీరు నిజమే చదివారు… రెండు… సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాప్ అన్నమాట… ష్, మరీ నిష్ఠురంగా చెప్పాలంటే ఎవడూ దేకలేదు అని అర్థం… నిజానికి స్టార్‌మా రీచ్ చాలా ఎక్కువ… ఈ టీవీలో ప్రసారం చేస్తేనే రెండు వచ్చిందంటే… బహుశా జెమినిలో గానీ, జీటీవీలో గానీ వేసి ఉంటే పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చేదేమో… సరే, ఈ హీరో గురించి చాలా ఎక్కువ చెప్పుకున్నాం…
Ads
ఈసారి బార్క్ రేటింగుల్లో మరొకటి ఆకర్షించింది… అదీ బంగార్రాజు రేటింగ్స్… అక్కినేని, చైతూ నటించిన సినిమా… అప్పుడెప్పుడో హిట్టయిన సోగ్గాడే చిన్నాయన సీక్వెల్… పైగా కృతిశెట్టి హీరోయిన్… కాస్త ఆంధ్రా వాసన అధికం కాబట్టి తెలంగాణలో జనం పెద్దగా పట్టించుకోలేదు… ఆంధ్రాలో బాగానే వసూళ్లు సాధించింది… నాగార్జునకు, చైతూకు పెద్ద రిలీఫ్… చాన్నాళ్లుగా తండ్రి, ఇద్దరు కొడుకులు కిందామీదా పడుతున్నారు పాపం…
బుల్లితెర మీద జీతెలుగు చానెల్లో ప్రసారం చేశారు… పర్లేదు, 14 దాకా రేటింగ్స్ వచ్చాయి… నిజానికి ఆ రేటింగ్స్ మరీ ఎక్కువ కాదు, అలాగని మరీ తీసిపారేయదగినంత తక్కువ కూడా కాదు… సో, నాగార్జునను వదిలేయండి, ఇంకెన్నాళ్లు నటిస్తాడులే గానీ, చైతూకు ఊపిరి పోసినట్టే ఈ సినిమా… అసలే సమంత ఎపిసోడ్‌తో ఫాఫం, కుంగిపోయి ఉన్న స్థితిలో కెరీర్‌పరంగా చైతుకూ ఈ సినిమా సక్సెస్ ఉపయోగకరమే…
మరొక్క సినిమా గురించి కూడా చెప్పుకోవాలి… అదీ వీాటితోపాటు టీవీలో ప్రసారం అయ్యింది కాబట్టి… అవసరాల శ్రీనివాస్ నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’… ఈటీవీలో ప్రసారం చేశారు… రేటింగ్స్ తెలుసా..? జస్ట్, ఒకటి… ఒకటి అంటే ఒకటి… అంతే… రేటింగ్స్ లెక్కల్లో చెప్పాలంటే ఒక్కడూ ఆ సినిమాను చూడలేదు అని అర్థం… ఇక్కడ ఆ సినిమా గురించి కాదు, చెప్పాల్సింది… ఈటీవీ గురించి… ఇలాంటి సినిమాల్ని కొని, ఏం సాధించాలని అనుకుంటోంది ఆ చానెల్..? ఇదుగో ఇలాంటి వేషాలు వేసినందుకే ప్రస్తుతం మూడో స్థానంలో నిలబడి దిక్కులు చూస్తోంది…!!
Share this Article