.
వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ మ్యాచుల్లో 14 ఏళ్ల పిన్న వయస్కుడు… తొలి సారి క్రీజులో అడుగుపెట్టిన వెంటనే సిక్స్, మూడో బంతికి సిక్స్ … కానీ కాస్త స్కోర్‌కే ఔటయ్యాక ఏడుస్తూ వెళ్లిపోయాడు గుర్తుంది కదా…
పాపం అని అందరూ బాధపడ్డారు… తరువాత కూడా పెద్దగా స్కోర్ చేయలేదు… కానీ తనలోని టెంపర్‌మెంట్ అందరికీ అర్థమైంది… తను ఓ చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడు అని అందరికీ తెలుసు… చేశాడు కూడా…
Ads
అరవీర భయంకర ఫామ్‌లో ఉన్న గుజరాత్ టీమ్‌పై ఆడుతూ జస్ట్, 35 బంతుల్లో సెంచురీ బాదేశాడు… జోక్ కాదు… అల్లాటప్పా రికార్డు కాదు… 30 బంతుల్లో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉంది… తరువాత ఇదుగో, ఈ వైభవమే…
సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్… దట్ టూ ఈ వయస్సులో… 7 ఫోర్లు, 11 సిక్సులతో సెంచరీ… ఓ తుఫాన్… ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా అభినందించారు అక్కడే… వావ్… 101 తరువాత క్లీన్ బౌల్డ్ అయ్యాడు, కానీ స్టేడియం మొత్తం లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది… ఐతే…
తను షాట్లన్నీ పర్‌ఫెక్ట్ ఏమీ కాదు… తనకు అదృష్టం తోడైంది… ఐపీఎల్ కదా… ఎదుట 210 టార్గెట్… సో, ప్రతి బంతినీ రిస్క్ తీసుకుని మరీ పైకి లేపడమే… పలుసార్లు టాప్ ఎడ్జ్… ఫీల్డర్ వైపు వెళ్లకపోవడం, దొరక్కపోవడం తన లక్కీయే…
వైభవ్ క్రీజులో ఉన్నంతసేపూ ప్రత్యర్థుల బౌలింగ్ వెలవెలా… చేష్టలు దక్కి, బాల్ వేయడానికే భయపడే సిట్యుయేషన్… ఎస్, చాలామంది బ్యాటర్లు వచ్చారు, వస్తారు… కానీ కొన్ని ఇన్నింగ్స్ గుర్తుండిపోతాయి అలా…
భవిష్యత్తులో వైభవ్ ఏమిటనేది పక్కన పెడితే… ఈ ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు మంచి జ్ఞాపకం… తొలిరోజు ఆటలో ఔటయి తను ఏడ్చాడు… ఈరోజు బౌలర్లను బాగా ఏడిపించాడు…
రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచుకు ముందు దిగువ నుంచి రెండో ప్లేసు పాయింట్ల పట్టికలో… గుజరాత్ పైనుంచి రెండో ప్లేసు… వైభవ్ ధాటికి 210 రన్స్ చేసిన గుజరాత్ ను 16 వ ఓవర్‌లోనే ఉఫ్ అని ఊదిపారేసి, రాజస్థాన్ ఏకంగా పాయింట్ల పట్టికలో ఒక మెట్టు పైకి ఎదిగింది… చేరుకుంది… (జైస్వాల్ కూడా బాగా ఆడాడు)… హైదరాబాద్, చెన్నై టీమ్స్‌కన్నా బాగా నయమే కదా…
10 మ్యాచుల్లో 7 ఓటములు, రెండు మాత్రమే గెలుపులతో దిగువన కొట్టుమిట్టాడుతూ ప్లేఆఫ్ చాన్సెస్ గల్లంతే అనుకునే దశలో… (లాస్ట్ 5 మ్యాచులూ వరుస ఓటములే…) ఈ గెలుపుతో కాస్త ఆశలు నిలుపుకుంది…
Share this Article