లోపభూయిష్టమైన కేంద్ర కరోనా టీకాల విధానాన్ని సుప్రీంకోర్టు సోమవారం విచారణలో దాదాపు కడిగేసింది… అది అడిగిన ఏ ప్రశ్నకూ కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు… ప్రతి ప్రశ్నా విలువైనదే… జనంలో చర్చ జరుగుతున్నవే… ముందుగా టీకాల ధరలు… జాతీయ స్థాయిలో ఒకటే ధర ఎందుకు ఉండకూడదు..? ప్రభుత్వం తను ధరల్ని ఖరారు చేయకుండా కంపెనీలకు ఎందుకు వదిలేసింది..? అని ప్రశ్నించింది… నిజమే, ఇదే కదా సగటు మనిషి కూడా తీవ్రంగా తప్పు పడుతున్నది..! ఒక చిన్న పారసెటమాల్ ట్యాబ్లెట్ రేటుకు లక్ష కొర్రీలు పెట్టి మరీ ధరల్ని ఖరారు చేసే కేంద్రం అత్యంత కీలక సమయంలో, క్లిష్టమైన సందర్భంలో… జాతి ఆరోగ్యానికి సంబంధించిన కరోనా వేక్సిన్పై మాత్రం సందేహాస్పదమైన నిర్ణయాల్ని తీసుకుంది… కారు చౌకగా టీకా సప్లయ్ చేస్తాం అన్న కంపెనీలే అడ్డగోలు దోపిడీకి పూనుకుంటే కేంద్రం కళ్లప్పగించి, చేష్టలు దక్కి చూస్తోంది… ఉదాహరణకు… కోవిషీల్డ్ ప్రైవేటు హాస్పిటల్స్‌లో 800 నుంచి 900 దాకా… అదే కోవాగ్జిన్ 1250 నుంచి 1300 (హైదరాబాద్ ధరలు)… రాబోయే స్పుత్నిక్ దాదాపు వెయ్యి రూపాయలు… అరాచకం… కేంద్ర విధాన వైఫల్యం…
కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరు రేట్లు దేనికి అనేది మరో ప్రశ్న… అంతా ప్రజల సొమ్మే కదా… ఒక జాతీయ టీకా విధానం అవసరం ఉన్నప్పుడు కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలపైకి ఎందుకు నెట్టేసినట్టు..? రాష్ట్రాలు సొంతంగా గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఏ గ్లోబల్ సంస్థా వేక్సిన్ పంపిణీకి ముందుకు రావడం లేదు… కేంద్రం వైపు చూపిస్తున్నాయి కంపెనీలు… ‘‘దేశం మొత్తానికి కేంద్రం ప్రాతినిధ్యం వహించడం లేదా..? రాష్ట్రాల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం ఏమిటి..? రాష్ట్రాలు విదేశాల నుంచి టీకాల్ని పొందడం ఆచరణాత్మకంగా కనిపించడం లేదు…’’ అని సూటిగా అడిగింది సుప్రీం… టీకా తీసుకోవాలంటే కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలనే విషయాన్ని కూడా సుప్రీం పట్టుకుంది… గ్రామీణ ప్రాంతాల్లో ఎలా సాధ్యం అని అడిగింది… కంప్యూటర్ కేంద్రానికి వెళ్లి రిజిష్టర్ చేసుకోవచ్చు అని కేంద్రం వాదించింది… అసలు రేషన్‌కు అవసరమైన వేలిముద్రలు వేయడానికే అనేక పల్లెల్లో ప్రజలు టెలిసిగ్నల్స్ కోసం చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది… ఇక కంప్యూటర్ సెంటర్లట…
Ads
21 కోట్ల డోసులు వేశామని గొప్పగా చెప్పుకుంటోంది కేంద్రం… 2 డోసులు లెక్కిస్తే, మొత్తం జనాభాలో 3 శాతం కూడా పూర్తికాలేదు… మరి ఎన్నేళ్లు పడుతుంది టీకాలు కంప్లీట్ చేయడానికి..? సంవత్సరం చివరికి వేసేస్తాం అంటోంది కేంద్రం… సాధ్యమేనా..? ఇన్ని పాలసీ లోపాలతో అయిదారు నెలల్లో ఇన్నికోట్ల డోసులు వేయగలరా..? పైగా ఏడాది చివరలో థర్డ్ వేవ్ అంటున్నారు, దానికి కార్యాచరణ ఏది..? బూస్టర్ డోస్ అంటున్నారు, పిల్లలకు టీకాలు అంటున్నారు… వాటి మాటేమిటి..? సుప్రీం మరో విలువైన ప్రశ్న అడిగింది… అసలు 45 ఏళ్లు పైబడిన వారికి ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చారు కదా, దానికి శాస్త్రీయత ఏమిటి అనడిగింది… సెకండ్ వేవ్‌లో యువత ఎక్కువగా కరోనా బారిన పడిందని లెక్కలు చెబుతున్నాయి, అంటే 18-45 ముఖ్యమే కదా అని ప్రశ్నించింది… 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం టీకాలు వేస్తోంది, 45 ఏళ్లకు దిగువన ఉన్నవాళ్లకు టీకాల బాధ్యతను రాష్ట్రాలకు వదిలేస్తోంది, అదెలా సమంజసం..? ఐనా… వేక్సిన్ పాలసీకి సంబంధించి మోడీ సర్కారు దగ్గర సరైన సమాధానాలు ఉంటే కదా…!!
Share this Article