కాశి… ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి, ఆ గంగలో మునిగి, ఆ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలనే కోరిక… అబ్బా, కల్కి సినిమాలో చూపినట్లు తొలి నగరం, చివరి నగరం అనే రచ్చలోకి పోవడం లేదు ఇక్కడ… కాకపోతే అత్యంత పురాతన నగరం అనేది మాత్రం నిజం…
భక్తుల డెస్టినేషన్… గతంలో కాశికి పోతే కాటికి పోయినట్టు… కాశికి వెళ్లొస్తే ఊరుఊరంతా స్వాగతం పలికేది… గుడి చుట్టూ, గుడి నుంచి ఘాట్ల వరకు ఆక్రమణలు, షాపులు, మురికి, ఇరుకు వీథులు, జంతువులు… ఘాట్లలో శవాల దహనం ఎట్సెట్రా కాశిని పొల్యూట్ చేశాయి… కష్టమ్మీద కాశికి వెళ్లినా… కొన్నాళ్లు అక్కడ ఉండి రావాలనే కోరికనూ చంపేసుకునేలా ఉండేది…
తరువాత మోడీ కాశి నుంచి ఎంపీగా గెలిచాక… వారణాసి కారిడార్ పేరిట వందల కోట్లను వెచ్చించారు… గంగ ప్రక్షాళనకూ బోలెడన్ని నిధులు… ఆక్రమణలను తొలగించారు… ఘాట్ల నుంచి గుడి వరకు వీథులు వెడల్పు చేశారు… రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి… సరే, మఠాలు, ఆశ్రమాలు, సత్రాలకు ఎప్పటి నుంచో కొదువ లేదు… దీంతో కాశికి భక్తుల రాకడ, తాకిడి పెరిగింది… ప్రధాని నియోజకవర్గం కాబట్టి సీఎం యోగి కూడా బాగా కాన్సంట్రేట్ చేశాడు…
Ads
అంత చేశారు గానీ… పారిశుధ్యం విషయంలో మాత్రం అదే నిర్లక్ష్యం, లెక్కలేనితనం… ఈరోజుకూ ఎక్కడ పడితే అక్కడ చెత్త, మురుగు, దుర్వాసన భక్తులను హడలెత్తిస్తున్నాయి… గతంలో మృతుల అస్థికల్ని కృష్ణాలోనో, గోదావరిలోనో నిమజ్జనం చేసేవాళ్లు అధికంగా… ఇప్పుడు ‘అఫర్డబులటీ’ బాగా పెరిగింది కదా… కాశికి వెళ్తున్నారు… అక్కడి నుంచి త్రివేణీ సంగమం వెళ్తున్నారు…
వాళ్లందరినీ కాశి పారిశుధ్యలోపాలు హడలెత్తిస్తున్నాయి… ఎన్ని వందల కోట్లు పెట్టి, ఎంత సుందరీకరిస్తేనేం..? కీలకమైన పరిశుభ్రత కదా ముఖ్యం అనే అసంతృప్తి కాశికి వెళ్లే భక్తుల్లో ఇంకా పెరుగుతోంది… ఈమధ్య ఓ ట్రెండ్… కాశిలో 11 రోజులపాటు ఉండి రావాలని… వెళ్తున్నారు… వాళ్లలోనూ అసంతృప్తి… మరి ఇంతకుముందు ఎలా ఉండేది అంటారా..? అది వేరు, ఇప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టినా మెరుగుపడకపోవడం, మెయింటెనెన్స్ దరిద్రంగా ఉండటం కొత్త భక్తుల్లో కోపాన్ని పెంచుతోంది…
అప్పుడప్పుడూ దేవస్థానం ఇంత ఆదాయం, ఇంతమంది భక్తులు అంటూ ప్రకటనలు జారీ చేస్తుంటారు… వాళ్లు ముందుగా చూడాల్సింది వసతులు, సౌకర్యాలను…! సరే, అక్కడ పూజారుల దోపిడీ ఎలాగూ మారదు, తగ్గదు… తెలిసిందే కదా… ఈ అస్థికల నిమజ్జనం కోసం వెళ్తున్న వాళ్లు పనిలోపనిగా అయోధ్య వెళ్లివస్తున్నారు…
తిరుమలకు దీటుగా భక్తులు వస్తున్నా… పెద్దగా దర్శనానికి టైమ్ పట్టడం లేదనే సంతృప్తి కనిపిస్తోంది భక్తుల్లో… ఫ్లోటింగ్… ఆగదు… ఎక్కడా కూర్చోబెట్టడాలు, కంపార్ట్‌మెంట్లు ఇంకా లేవు… ఐనా గంటన్నర, రెండు గంటల్లోపు దర్శనం పూర్తయిపోతోందని వెళ్లొచ్చిన భక్తుల ఉవాచ… ఈమధ్య వర్షాలకు రోడ్లు కాస్త దెబ్బతిన్నా సరే… అయోధ్య చుట్టుపక్కల ఆ ట్రస్టు మెయింటెనెన్స్ బాగుందని టాక్… మరి కాశి మీద ఎందుకీ నిర్లక్ష్యం యోగీ సాబ్..?!
Share this Article