ఏదో పరువు దక్కించుకునే పిచ్చి ప్రయత్నం… రాంగోపాలవర్మ జగన్ అధికార ప్రస్థానం మీద వ్యూహం అనే సినిమా తీశాడు కదా… అది మొదటి ఆటకే నీటిబుడగలాగా ఫట్‌మని పేలిపోయింది కదా… అనేక థియేటర్లలో డెఫిసిట్… సరిగ్గా టికెట్లు తెగక ఆటనే ఎత్తేసిన థియేటర్లూ ఉన్నట్టు వార్తలొచ్చాయి కదా… వర్మ జాబితాలో మరో అతి పెద్ద డిజాస్టర్ చేరింది కదా…
తను ఎలాగూ ఎప్పుడూ మునిగే బ్యాచ్, కానీ జగన్ పరువును కూడా నిలువునా ముంచేశాడు కదా… ఎన్నికల వేళ ఇదేదో జగన్‌కు ఫ్లస్ అవుతుందీ అనుకుంటే అది కాస్తా కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయింది కదా… జగన్ అభిమానులైనా గట్టెక్కించకపోరు అనుకుంటే జగన్ క్యాంపు కూడా వర్మను బూతులు తిట్టేసుకుంది కదా…
ఇప్పుడిక కొత్త ఎత్తు వేశాడు… ఇదే వ్యూహం సినిమా రెండో పార్ట్ శపథంను థియేటర్లలో గాకుండా వెబ్ సీరీస్‌లాగా రిలీజ్ చేస్తాడట… కానీ అది పేపర్‌వ్యూ పద్ధతిలో… అంటే డబ్బు చెల్లించి చూడాలి… ఈ విధానంలో గతంలో ఏదో సినిమా రిలీజ్ చేసి చేతులు మూతులు అన్నీ కాల్చుకున్నాడు వర్మ… మళ్లీ ఇప్పుడు అదే పద్ధతి అట…
Ads
మరి ఈ సినిమాను కొనుగోలు చేసే సాహసం ఏ ఓటీటీ చేస్తుంది… ఎవడూ చేయడు… అందుకని ప్రభుత్వం ఆధీనంలోనే ఉండే ఏపీఫైబర్‌నెట్‌లో రిలీజు అట… వ్యూహం రెండో పార్టును ప్రదర్శించే సాహసం ఏ థియేటర్ వాడూ చేయడం లేదు గనుక… నీ సినిమా వద్దూ, నువ్వూ వద్దురా బాబూ అని వర్మకు దండాలు పెట్టుకుంటున్నారు గనుక… వ్యూహమే ఇలా ఉంటే, ఇక శపథం ఇంకెంత బీభత్సంగా ఉంటుందో తెలియదు గనుక… రిలీజ్ చేసి చేజేతులా డెఫిసిట్‌లో పడే ధైర్యం లేదు గనుక… ప్రభుత్వ పరిధిలోని నెట్‌వర్క్‌లో నిమజ్జనం చేసేస్తే పాయె… ఇదీ అసలు వ్యూహం…
దీనివల్ల మరింత పరువు పోగొట్టుకోకుండా వేసిన ఎత్తుగడ… ఇదంతా సరే గానీ, మరి వ్యూహం పేరును శపథం చాప్టర్-1 అని వెబ్ సీరిస్‌కు పెట్టడం దేనికి అంటారా..? వ్యూహం అనే పేరిట ఆల్రెడీ ఒక వెబ్ సీరిస్ ఉంది… గత ఏడాదే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి యార్లగడ్డ సుప్రియ నిర్మించిన సీరీస్ ఇది… అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు, బట్, పెద్దగా పేరేమీ రాలేదు… సో, వ్యూహం అనే పేరు పెట్టడానికి కుదరదు కాబట్టి శపథం పార్ట్-1 అని పెట్టేశారు…
మరి ఈ వెబ్ సీరీస్‌గా రిలీజ్ చేయడం ఏమిటి మహానుభావా అనడిగితే… ముందుగానే థియేటర్ వెర్షన్, వెబ్ సీరీస్ వెర్షన్ తీసి పెట్టారుట… ఒకవేళ థియేటర్ వెర్షన్‌కు సెన్సార్, లీగల్ ఇబ్బందులు వస్తే ఏకంగా వెబ్ సీరిస్ రిలీజ్ చేయాలని ముందస్తు ప్లాన్ అట… పైగా థియేటర్ వెర్షన్‌లో లేనివి ఈ వెబ్ సీరిస్‌లో ఉన్నాయట… (తూచ్, అదేమీ ఉండదు, కనీసం ఇలా చెబితేనైనా ఓ నలుగురు చూస్తారని వర్మ వ్యూహం)…
ఇక ఈ నిర్వాకానికి శపథం తరువాత శాసనం అని మరో సినిమా తీయాలని కూడా వర్మ అనుకున్నాడట… ఎక్కడో చెప్పినట్టున్నాడు కూడా… వ్యూహం, శపథం జగన్ అధికార ప్రస్థానం, తన ప్రత్యర్థులపై నిర్వహించిన రాజకీయ దాడులు అనుకుంటే… మరి శాసనం..? బహుశా జగన్ రూల్ మీద అయి ఉంటుందేమో… కానీ వ్యూహం కలెక్షన్ల దెబ్బకు శపథమే థియేటర్ మొహం చూడబోవడం లేదు… ఇక శాసనం నిర్మిస్తారా..?
అబ్బే, దానిపై నేనేమంత సీరియస్‌గా లేను అని ఏదో సర్దిచెప్పుకుంటున్నాడు వర్మ… చివరగా ఒకమాట… అవునూ, వర్మా… ఈ సినిమాలు జనంలోకి పోవడానికి తప్ప డబ్బు కోసం తీసినవి కావని చెబుతున్నారు కదా… యూట్యూబులో పెట్టేస్తే పోలా..!! మరోమాట… ఇష్టమొచ్చింది తీసేసి వెబ్ సీరిస్‌లో పెట్టేస్తే అంతా వోకే, సెన్సారోళ్లకు దొరికితే కదా సమస్య అనుకుంటున్నాడేమో వర్మ… వెబ్ సీరిస్ అంటే కోర్టు కేసులకు ఇమ్యూనిటీ ఏమీ ఉండదు..!!
Share this Article