Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!

June 6, 2025 by M S R

.

తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు..? తన పాలనలో ఏ దరిద్రం చోటుచేసుకున్నా సరే, ఓ బకరాను వెతుకుతాడు, బలిచేస్తాడు… తను తప్పించుకుంటాడు… ఏ పాపమూ తనకు అంటుకోకుండా… అది ట్రెండ్…

తప్పయినా సరే, అందరూ పాటించేది అదే… రాజకీయం అంటేనే ధూర్తం కదా… ఆర్సీబీ విజయోత్సవాలే పెద్ద బ్లండర్, దాన్ని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవడం డబుల్ దుర్మార్గం… వాళ్లకు సన్మానాలు చేయడం ట్రిపుల్ దుర్మార్గం… తీరా 11 మంది మరణించిన విషాదాన్ని ఎలా స్కిప్ చేసింది, అంటే ఎలా ఎస్కూపయింది..?

Ads

తన బాధ్యత ఏమీ లేనట్టు..? పోలీస్ కమిషనర్‌ను, మరికొందరిని సస్పెండ్ చేసింది… అసలు నువ్వెందుకు వెళ్లాలి ఈ కిరాయి ఆటగాళ్ల, ఓ ప్రైవేటు బెట్టింగ్ మాఫియా విజేతల విజయోత్సవానికి..? అందులో కర్నాటక వాడెవడున్నాడు..? ఓన్ చేసుకోవడానికి సిగ్గూశరం లేదు సరే, వెంటనే తప్పును పోలీసోళ్ల మీదకు నెట్టేసి, చేతులు దులుపుకుంది…

సరే, వేములవాడలో కోడెలు, గోవులు చచ్చిపోతున్నాయి… ఆ పాపం ఏకంగా వేములవాడ దేవస్థానానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులకు, వేములవాడలో పెత్తనాలు వెలగబెట్టేవాళ్లకు తగులుతూ ఉంది… కానీ ఏం జరిగింది..? ఏమీ లేదు… ఈ తోలుమందం సర్కారులో ఏ సెన్సిటివిటీ లేదు…

ఆది శ్రీనివాస్ ఏమంటున్నాడు..? లంపీ స్కిన్ తగిలింది వీటికి, అందుకే చస్తున్నాయి అంటున్నాడు..? దానికి వేక్సిన్ ఉందనే సోయి ఉండాలి కదా… బోలెడు మంది వెటర్నరీ, ఇతర సిబ్బంది ఉన్నారు కదా… కాచేది గాడిదలా..? ఆవులా..?

పచ్చగడ్డి దొరకదు, పర్యవేక్షణ లేదు, ఊపిరి సలపదు, వేక్సినేషన్ లేదు… వాటిని ఎవరు చంపుతున్నారు..? ఆ పాపం ఎవరికి తగలబోతోంది..? అబ్బే, ఇవన్నీ నాన్సెన్స్, ఆఫ్టరాల్ కోడెలు, ఆఫ్టరాల్ గోవులు అంటారా..? గుడ్… రెడీ టు ఫేస్ ఇట్…

అలాగని బీఆర్ఎస్ నేతలు శుద్ధపూసలు అని కాదు… అసలు భారతీయ పౌరసత్వమే లేని, జాతిని ఏళ్ల తరబడీ అబద్దాలతో మోసగించిన ఎమ్మెల్యే ఇన్నాళ్లు… కులం కోసం తనను బాగా ఉద్దరించిన బీఆర్ఎస్ నాయకత్వం మరోవైపు…

కానీ రోజులు మారాయి, వాళ్లను గెలిచిన విజేతలు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు..? ఇవిగో లంపీ స్కిన్ బాపతు సమర్థనలా..? ఫాఫం… సాక్షాత్తూ రేవంత్ రెడ్డి కార్యాలయమే ఏం చేయాలో రిపోర్టు ఇచ్చిందట… చర్యల్లేవు, పట్టించుకున్నవాడు లేడు… ఐనా అదే ఈవో ఉంటాడు అక్కడ…

సమర్థించడానికి ఎమ్మెల్యే ఉంటాడు… ఫాఫం, రేవంత్ రెడ్డి సర్కారు… జనం సెంటిమెంట్లు గాయపడిన చోట సరైన చర్యో, శిక్షో లేకపోతే, కనిపించకపోతే… ఆ కోపం లీడర్ మీదకే మళ్లుతుంది… ఎవరైనా చెప్పారో లేదో పాపం…!! అవునూ, దేవాదాయ మంత్రి ఎవరు..? ఓహో… ఆమేనా..? సరే, సరే, ఇక అయినట్టే… ఆ గోవులు కాపాడబడినట్టే..!!

ప్రతి చిన్న విషయానికి అబద్దాలతో గాయిగత్తర లేపే బీఆర్ఎస్ ఏం చేస్తోంది..? సర్లె, అసలే అయోధ్య, హిందుత్వ వ్యతిరేక బాస్… వాళ్లేం మాట్లాడతారు… మరి బీజేపీ..? ఆగు, ఆగు… వాళ్లలో వాళ్లు తన్నుకోవడం అయిపోనీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions