మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకు అప్పట్లో చిరంజీవి హోస్టుగా చేశాడు… షో అట్టర్ ఫ్లాప్… హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షో విషయంలో కూడా అమితాబ్ మాత్రమే హిట్… మిగతావాళ్లు ఫ్లాప్… బిగ్‌బాస్ షోకు మొదట్లో జూనియర్ హోస్టుగా చేశాడు… హిట్… కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు విషయంలో ఫ్లాప్… అదేదో వంటల షోలో తమన్నా ఫ్లాప్… ఆమె ప్లేసులో యాంకర్ ఆంటీని తీసుకొచ్చారు…
వ్యక్తుల ఇంటర్వ్యూలు కమ్ చాట్ షోల విషయంలో సమంత, మంచు లక్ష్మి, రీసెంటుగా సింగర్ స్మిత, ఆమధ్య రానా తదితరులు ఏదో ప్రయత్నించారు గానీ పెద్దగా క్లిక్ కాలేదు… అదే బాలయ్య అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్…… అంటే, సినిమాల్లో ఎంత ప్రసిద్ధులైనా సరే టీవీ షోను రక్తికట్టించలేకపోవచ్చు… షో కేరక్టర్‌ను బట్టి, హోస్ట్ చేసే వ్యక్తి స్పాంటేనిటీ, ఈజ్‌ను బట్టి రకరకాల ఫలితం ఉంటుంది…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… వెన్నెల కిషోర్ పేరొందిన కమెడియన్… తను లేని సినిమా ఉండటం లేదు… గతంలో బ్రహ్మానందం అనుభవించిన స్టార్‌డమ్ ఇప్పుడు వెన్నెల కిషోర్ అనుభవిస్తున్నాడు… కానీ బ్రహ్మానందం నటనలో మొనాటనీని జనం తిరస్కరించడానికి చాలా ఏళ్లు పట్టింది… కానీ వెన్నెల కిషోర్ వేగంగా ఆ దురవస్థను చేరుతున్నాడు… ఒకేరకం పాత్రలు, ఒకేరకం నటన ప్రేక్షకులకు నచ్చవు… అంతటి పాపులర్ వెన్నెల కిషోర్ ఈటీవీలో ఓ షో చేస్తున్నాడు… పేరు ‘‘అలా మొదలైంది’’…
Ads
తాజాగా బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తే… అంతటి పాపులర్ వెన్నెల కిషోర్ సైతం ఘోరంగా ఫ్లాపయిన తీరు కళ్లకు కడుతుంది… గతంలో ఈటీవీలో ఆలీతో సరదాగా అనే షో వచ్చేది… పాత తరం నటుల్ని ప్రధానంగా పట్టుకొచ్చేవాడు… పాత సంగతుల్ని తవ్వేవాడు… షో సరదాగా ఉండేది… రాన్రాను దానికి రేటింగ్స్ బాగా పడిపోయినయ్…. ఒకవైపు అత్యంత సీనియర్, మెరిటోరియస్ సుమ యాంకరింగ్ షోలు కూడా క్షీణదశకు చేరుకుంటుండగా… మరోవైపు ఆలీ షో కూడా పడిపోసాగింది…
ఈలోపు ఆలీకి ఏదో ఏపీ ప్రభుత్వ పదవి రావడం కూడా ఆలీ షోకు ప్రతిబంధకంగా మారింది… నిజానికి అదేమీ బాగా చెమటోడ్చే పదవి ఏమీ కాదు, పెద్ద పనేమీ ఉండదు… కానీ ఎందుకో ఈటీవీ వద్దనుకుందో, ఆలీయే వద్దనుకున్నాడో ఆ షో ఆగిపోయింది… దాని ప్లేసులో అర్జెంటుగా వెన్నెల కిషోర్‌ను దింపారు… అలా మొదలైంది అంటూ సెలబ్రిటీ జంటలతో చాటింగ్ షో స్టార్ట్ చేసింది ఈటీవీ…
ప్చ్… వెన్నెల కిషోర్ ఇలాంటి షోలకు అస్సలు పనికిరాడని తేలిపోయింది… ఏమో, నిజంగానే ప్రేక్షకులు చూస్తున్నారేమో, మనమే అకారణంగా తను పనికిరాడని భావిస్తున్నామేమో అనుకుని బార్క్ రేటింగ్స్ చూస్తే షాక్ తగిలినట్టయింది… ఈవారం బార్క్ హైదరాబాద్ రేటింగ్స్‌లో ఈ షోకు వచ్చిన రేటింగ్ జస్ట్, 0.80 మాత్రమే… దారుణమైన రేటింగ్స్ ఇవి… (స్థూలంగా ఒక రేటింగ్ వచ్చి ఉంటుందేమో…)
సెలబ్రిటీల ఎంపిక సరిగ్గా లేకపోవడం ఒక వైఫల్యం కాగా… వెన్నెల కిషోర్ మాట్లాడే తీరు, మాట్లాడించే పద్ధతి అట్రాక్టివ్‌గా లేకపోవడం మరో వైఫల్యం… అసలే ఢీ, జబర్దస్త్ వంటి ఈటీవీ షోలు ఫ్లాపు దారి పట్టగా, చివరకు అలా మొదలైంది వంటి రియాలిటీ షోలు కూడా దెబ్బతినిపోవడం ఈటీవీకి పెద్ద షాక్… అసలు ఈటీవీ బలమే ఇలాంటి షోలు… అవీ దెబ్బతిని… చివరకు ఈటీవీని మూడో స్థానంలోకి నెట్టేశాయి… స్టార్‌మా టీవీతో పోలిస్తే చాలా ఆమడల దూరంలో కుంటుతోంది… ఫాఫం ఈటీవీ…
Share this Article