Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేనే వస్తున్నా… అక్కర్లేదు, ఫోఫోవోయ్… ధనుష్‌ సినిమాకు మళ్లీ తిరస్కారం…

December 24, 2022 by M S R

ధనుష్… తను కూడా తెలుగువారికి బాగా కనెక్టయిన నటుడే… మంచి నటుడే… కొన్ని సినిమాలు తెలుగులో బాగానే ఆడాయి… తమిళ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకుని, సినిమా తీసినా సరే.., తెలుగులోకి డబ్ చేసి వదిలితే ఎంతోకొంత అదనపు రెవిన్యూ వస్తుందనేది నమ్మకం… తమిళంలో కాస్త పేరున్న ప్రతి హీరో సినిమాను అలాగే తెలుగులోకి వదులుతూ ఉంటారు కదా…

నానే వరువన్ అని ఆమధ్య ఓ సినిమా తీశాడు… ఎప్పటిలాగే తెలుగులోకి డబ్ చేసి, నేనే వస్తున్నా అంటూ తెలుగు థియేటర్లలోకి కూడా వచ్చేశాడు… తను ఎంత ప్రేమగా నేనే వస్తున్నా అంటూ వచ్చినా సరే తెలుగు ప్రేక్షకుడు తలుపులు మూసేసి, ఫోఫోవోయ్ అన్నారు… తెలుగులో కనీస ప్రమోషన్ కూడా లేదు… సినిమా వదిలితే చాలు, వాళ్లే చూస్తారులే అనుకున్నారేమో నిర్మాతలు, హీరో… మీడియా మీట్ల కర్చులు మరీ అంతగా భయపెడుతున్నాయా..? ప్రిరిలీజ్ ఫంక్షన్లు ఏదైనా హోటల్‌లో లిమిటెడ్ గాదరింగుతో చేసినా భరించలేనంత ఖర్చు మీద పడుతోందా..?

అసలు ఆత్మ, ప్రతీకారాల కథల్ని సినిమా పుట్టినప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాం… అవేమీ ఔట్ డౌట్ కావు… కాకపోతే కొత్తగా చెప్పగలగాలి..,. చౌకగా వాటిని ఎలా తీసి, ఎలా వదలాలో రాఘవ లారెన్స్‌కు తెలుసు… ఆత్మలు, పునర్జన్మలు అంటేనే లాజిక్కుల కోసం వెతకొద్దు… కానీ అడ్డదిడ్డంగా మరీ టీవీ సీరియళ్లలా ఏది తోస్తే అది తీసేసి, జనం మీదకు వదలొద్దు కదా… ధనుష్ ఆమాత్రం ఆలోచించలేకపోయాడా..?

Ads

సాధారణంగా పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి తలపడవు… వారం పది రోజుల గ్యాప్ ఉండేలా నిర్మాతలు చూసుకుంటారు… ఎలాగూ వీకెండ్ ఉంటుంది… సో, ఆ రోజుల్లో వేరే సినిమా థియేటర్లలో ఉండదు కాబట్టి, సినిమా ఎలా ఉన్నా సరే, అడ్డగోలు టికెట్ రేట్లతో, ప్రేక్షకుల పర్సుల్ని దోచేస్తుంటారు… సినిమా టాక్ వ్యాపించేసరికి తమ డబ్బు సగమైన వచ్చేయాలనేది ఈ గ్యాపింగ్ వ్యూహం వెనుక కక్కుర్తి… ఓహ్, బిజినెస్ స్ట్రాటజీ అనాలేమో…

మరి ఒకే టైములో రిలీజ్ చేస్తే…? కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి… మార్కెట్‌లో ఉన్న ఒక సినిమా నచ్చకపోతే మరో సినిమాకు వెళ్తాడు ప్రేక్షకుడు, వాటికి ఆల్టర్నేట్ చాయిస్ అనేది ఉంటుంది… పొన్నియిన్ సెల్వన్ వందల కోట్లతో నిర్మించిన భారీ సినిమా… మణిరత్నం కలల ప్రాజెక్టు… తమిళంలో తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఉన్నదే…. వేల థియేటర్లలో రిలీజ్ చేశారు… బాగా ప్రమోషన్ వర్క్ కూడా సాగింది… మరి దానికి పోటీగా బరిలో ఉండాలంటే ఎంత హైప్ క్రియేట్ కావాలి..?

అదుగో, అక్కడే ధనుష్ ఫెయిలయ్యాడు… అసలే అంతంతమాత్రంగా ఔట్‌పుట్ వచ్చిన ‘నేనే వస్తున్నా’ సినిమాను పీఎస్-1కన్నా ఒకరోజు ముందే రిలీజ్ చేశాడు… ఒకరోజులోనే నెెగెటివ్ టాక్ వచ్చేసింది… దాంతో అది కూడా పొన్నియిన్ సెల్వన్‌కు అడ్వాంటేజీ అయిపోయింది… నిజానికి ధనుష్ ఓవర్ కాన్ఫిడెన్స్ అది… ఏముందని ఆ సినిమాలో..? ఏ నమ్మకంతో పీఎస్‌కు పోటీగా వచ్చాడో తెలియదు… తెలుగులోనైతే విపరీతంగా మీమ్స్, జోక్స్ పేలినయ్ సోషల్ మీడియాలో…

dhanush

కథ, కథనాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే… దీనికి ధనుష్ అన్నయ్యే దర్శకుడు… కథలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్, హారర్ తదితర అంశాలు ఉండేలా చూసుకున్నారు గానీ సెకండాఫ్‌లో తీవ్ర గందరగోళంలో పడిపోయి దర్శకుడు చెడగొట్టేశాడు… దాంతో ధనుష్ శ్రమ వేస్టయిపోయింది… తెలుగులో వదిలేయండి, అది తమిళంలో కూడా పెద్దగా క్లిక్ కాలేదు… యువన్ శంకర్ రాజా సంగీతం ఓ మైనస్… పెద్ద జోష్ లేదు, తెలుగులోనైతే అవి థియేటర్ వదిలాక మళ్లీ గుర్తుండవు… అసలు తెలుగుపాటల్లాగే వినిపించవు అవి…

ఇందుజ రవిచంద్రన్ ఒక ఫిమేల్ లీడ్ రోల్ కాగా, మరో ప్రధాన పాత్రకు స్వీడిష్-టర్కీ పిల్ల ఎల్లీ ఎవర్రామ్‌ను తీసుకొచ్చారు… ఐనా రిజల్ట్ లేదు… ఎవరు ఏ సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా సరే చేసేస్తుంటాడు ప్రభు… ఇందులోనూ ఉన్నాడు… సినిమా కొన్నది సన్ టీవీ… అంటే తెలుగులో జెమిని టీవీలో వేస్తారన్నమాట… వేస్తారు కాదు, వేశారు… 11 వ తేదీన, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి జెమినీ టీవీలోనే ప్రసారం చేశారు… ఎలాగూ సన్ వాళ్ల ఓటీటీకి తెలుగులో పెద్ద రీచ్ లేదు… జెమినికి కూడా అంతే…

నేనే వస్తున్నా అని ఎంత చెప్పినా… థియేటర్లకు ఎలాగూ రానివ్వలేదు, టీవీల ద్వారా మీ ఇళ్లకే వస్తున్నా అంటున్నా సరే… తెలుగు ప్రేక్షకుడు మళ్లీ తిరస్కరించాడు… నో అన్నాడు… బార్క్ రేటింగ్స్‌లో ఈ సినిమాకు వచ్చింది రెండు జీఆర్పీ… ఒక్క ముక్కలో టీవీ పరిభాషలో చెప్పాలంటే, ఎవడూ దేకలేదు అని అర్థం… ఫాఫం ధనుష్… రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్యను వదిలేశాక, అదృష్టమూ గతితప్పినట్టుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions