ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఓచోట ఒక్కసారిగా హాహాశ్చర్యం ఆవరించింది… రామజోగయ్యశాస్త్రి గెస్టుగా పాల్గొన్న తెలుగు ఇండియన్ ఐడల్ తాజా ఎపిసోడ్ అది… సింగింగ్ కంటెస్టెంట్ వాగ్దేవి రంగ్‌దే పాటపాడింది… తరువాత తన అభిప్రాయం చెబుతూ థమన్… ‘‘వాగ్దేవీ, నువ్వు రాబోయే పదిహేను ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతావు’’ అని వ్యాఖ్యానించాడు… ఆమె కూడా ఆశ్చర్యపోయింది ఆ అభినందన విని… ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులతోపాటు..!
మ్యూజిక్ కంటెస్ట్‌కు సంబంధించిన బోలెడు టీవీషోలు ప్రతి భాషలోనూ వస్తూనే ఉంటయ్… కానీ ఇలాంటి వ్యాఖ్య, ప్రశంస, అభినందన మొదటిసారి వింటున్నాం… థమన్ బాగా సీనియర్… చిన్నప్పటి నుంచీ మ్యూజిక్ ప్రపంచంలోనే మునిగీ తేలుతున్న కేరక్టర్… పైగా తప్పులు దొర్లుతున్నప్పుడు కాస్త కటువైన వ్యాఖ్యలే చేస్తుంటాడు కూడా… నిర్మొహమాటంగా… అలాంటి నోటి వెంట ఆ మాట ఎవరు పలికించారు..? తనకూ అదే డౌట్ వచ్చినట్టుంది… ఏదో నాకు తెలియని ఎనర్జీ (ఏదో దైవికశక్తి అన్నట్టుగా…) పలికించింది అంటాడు…
మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఈ అమ్మాయి గురించి… నెల్లూరుకు చెందిన వాగ్దేవి వయస్సు 20 ఏళ్లు… పన్నెండేళ్ల వయస్సులోనే పాడుతా తీయగా షోలో పార్టిసిపేట్ చేసింది… ఆమెకు తన వాయిస్ ప్రధాన బలం… కాకపోతే బక్కపలచగా ఉండి, పలుసార్లు పాడుతున్నప్పుడు శ్వాస సంబంధమైన తడబాట్లకు లోనవుతుంది… అదొక్కటే తన లోపం… సంగీతపరంగా, ప్రజెంటేషన్ పరంగా పర్‌ఫెక్ట్… అలై పొంగెరా పాట అద్భుతంగా పాడి ప్రశంసలు పొందింది… చాలామంది పాడలేరు, అటెంప్ట్ చేయరు దాన్ని… అయినా సరే… తను ఇంకా సాధన దశలోనే ఉంది…
Ads
ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది ఆమె… అలాంటిది థమన్ నోటి వెంట అత్యంత అరుదైన ఆ ప్రశంస ఏమిటో..! నిజానికి ఇందులో మనం చెప్పుకునేందుకు విశేషం ఏముందీ అంటారా..? ఏ మ్యూజిక్ కంపిటీషన్ అయినా సరే జడ్జిలు గాయకుల్ని ఎంకరేజ్ చేయడానికి నాలుగు అభినందన పూర్వక వ్యాఖ్యలు చేస్తుంటారు… సహజం… ఇండియన్ ఐడల్ షోకు వచ్చే గెస్టులకు కూడా ముందే చెబుతారు, కాస్త మంచి మాటలు చెప్పి ప్రోత్సహించండి అని…
హిందీ ఇండియన్ ఐడల్ షోలో ఓ చిన్న సీన్ గుర్తుందా..? మన షణ్ముఖప్రియ ఓపాట ఇరగదీసింది… సీనియర్ సింగర్ విశాల్ దడ్లానీ ఆనందం పట్టలేక, స్టేజీ మీదకు వెళ్లి, తన గుండు మీద షణ్ముఖ చేతితో టచ్ చేయించుకుని, ఆశీస్సులు తీసుకున్నాడు… సరే, అదొక హేపీ ఎమోషన్… అంత అసాధారణ ప్రశంసల దాకా చూశాం… కానీ థమన్ చేసిన వ్యాఖ్య దాన్ని ఎన్నోరెట్లు మించిపోయింది… నిజానికి ఇదే షోలో మరో ఇద్దరు ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు కూడా బాగా పాడుతున్నారు… ప్రత్యేకించి కల్పన శిష్యురాలు వైష్ణవి అసాధారణ ప్రతిభ చూపిస్తోంది… దెన్ వై ఓన్లీ వాగ్దేవి..?
థమన్ ఈ షోలో సరదాగా, కొత్తగా కనిపిస్తున్నాడు, తనే వెళ్లి కొన్నిసార్లు డ్రమ్స్, మరికొన్నిసార్లు కీబోర్డు వాయిస్తున్నాడు… జోకులు వేస్తున్నాడు… కానీ గతంలో ఏదో మ్యూజిక్ షోలో చాలా సీరియస్‌గా మొహం పెట్టుకుని కూర్చునేవాడు… కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేస్తాడు, నచ్చకపోతే నిష్కర్షగా ఎక్కడ నచ్చలేదో చెబుతాడు… అలాంటిది ఇండస్ట్రీని రూల్ చేస్తావంటూ ఓ సింగర్‌ను ప్రస్తుతించడం అతి ఆశ్చర్యమే… అదీ అనుకోకుండా…!!
Share this Article