Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వార్థం కాదు… అజ్ఞానంతోనే సైబర్ క్రైమ్ బాధితులుగా మారేది…

December 1, 2025 by M S R

.

Murali Buddha ….. నిన్న ఉదయం ఈటివిలో సతీ సుమతి సినిమా వస్తోంది . కాంతారావు , అంజలీ హీరో హీరోయిన్లు .. టివి ఆన్ చేయగానే ఓ సీన్ బాగా నచ్చింది … రేలంగి తన వద్ద మహిమ గల ఒక వజ్రం ఉందని , దానికి పూజలు చేసి కోరికలు కోరుకుంటే జరుగుతాయి అని వర్ణిస్తాడు ..

అది విన్న సూర్యకాంతం అంత మహిమ గల వజ్రం నాకు అమ్మే బదులు నువ్వే ఇంట్లో ఉంచుకొని బోలెడు సంపాదించవచ్చు కదా ? అంటుంది . దానికి రేలంగి దీని అమ్మలాంటి వజ్రం నా వద్ద ఇంట్లో ఉంది . అందుకే అమ్ముతున్నాను అని నమ్మించి, భారీ మొత్తానికి అమ్ముతాడు .. వారం పాటు ముందస్తు పూజలు చేసి ఆ తరువాత కోరికలు చెప్పమంటాడు …

Ads

ఈ సీన్ అంత గొప్పగా ఏముంది ? అనిపించవచ్చు … కానీ ఆలోచిస్తే ఆలోచించాల్సిందే ఉంది … 1960 ప్రాంతంలోనూ అద్భుత ఉంగరాలు , వజ్రాలు అని మోసం చేసే వ్యాపారం ఉంది. అదేమీ ఈ మధ్య వచ్చిన కొత్త వ్యాపారం కాదు అని తెలిసింది .

60 లలోనే సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు ఉంటే, ఈ కాలంలో సైతం డాక్టర్ వంటి చదువుకున్న వారు కూడా ఇలాంటి వాటికి కోట్లు అర్పిస్తున్నారు అంటే మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది . (ఎవరో ఒక లేడీ తెలివిగా ట్రాప్ చేసి ఓ డాక్టర్ నుంచి ఏకంగా 14 కోట్లు కొట్టేయించింది… నిన్నటి వార్తే… భారీ సైబర్ క్రైమ్…)

ఆ సినిమాలో సూర్యకాంతంకు కనీసం చిన్న అనుమానమైనా వచ్చింది . అంత మహిమ గల వజ్రం నాకెందుకు అమ్ముతున్నావ్, నువ్వే ఉంచుకొని కోట్లు సంపాదించవచ్చు కదా అంటుంది . ఇప్పుడు మోసపోతున్న వారికి ఈ మాత్రం అనుమానం కూడా రావడం లేదు …

cyber

ఆ కాలం నాటి కాంతారావు వంటి హీరోలు జీవితంలో దెబ్బ తిన్నారు కదా, వారిని చూసి, ఆ జీవితాలు చదివి ఈ కాలం చిన్న చిన్న నటులు సైతం కొంత డబ్బు రాగానే ఏదో ఓ వ్యాపారం మొదలు పెడుతున్నారు . నటుల్లో అలాంటి జాగ్రత్త కనిపిస్తే వారి సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రం మోసం విషయంలో 1960 నాటి తెలివి తేటలు కూడా చూపడం లేదు …

టివిలో ఆ సీన్ చూడగానే ముందు రాయాలి అనిపించింది … తరువాత ఎంత రాసినా వృథా అని కూడా అనిపించింది తరువాత . ఎందుకంటే, ఓ డెంటిస్ట్ ఇలాంటి మోసానికి కోట్ల రూపాయలు అర్పించాడు అని చదివాక… ఎంత రాసినా ఎవరు మోసపోకుండా ఉంటున్నారు అనిపించింది …

స్వార్ధం వల్లనే ఇలా మోసపోతారు అనుకుంటారు గానీ … స్వార్ధం లేని మనిషి ఉండడు . స్వార్ధం లేకుంటే జీవితమే ఉండదు … స్వార్ధం వల్ల కాదు, అజ్ఞానం వల్ల ఇలా మోసపోతారు … ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేక పోవడం వల్ల ఇలా మోసపోతారు …. స్కూల్ లో ఇంజనీరింగ్ , మెడికల్ కాలేజీల్లో ఈ చదువు చెప్పరు … సొంతంగా నేర్చుకోవాలి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇప్పుడంటే ఎర్రతనం క్షీణదశ కానీ… అప్పట్లో ఎర్రెర్ర సినిమాలు ఎక్కువే…
  • అత్తరు కాదు అది… ఆడదాని నెత్తురు, కొవ్వు… ఓ సైకో ఫాంటసీ…
  • ఇండియా ఎలా గెలిచింది..? పాకిస్థాన్ ఎందుకు మట్టికరిచింది..?
  • ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్… ఇషాన్ కిషన్ బాంబింగ్‌తో పాకిస్థాన్ బెంబేలు…
  • నిజంగానే ఆ నరవాణేపై చర్య తీసుకునే దమ్ముందా ప్రభుత్వానికి..?
  • థర్మోబారిక్..! ఈ ఆయుధ ప్రయోగంతో మనుషులు ఆవిరైపోతారా..?!
  • వరల్డ్ కప్‌లో మరో వింత బౌలింగ్… నమీబియా ఎరాస్మస్ నయా వ్యూహం…
  • పిచ్చోళ్లు… 21 శతాబ్ధం ఇంకా బేవార్సుగా ఉంటుందని ఊహించలేదు…
  • జైలు – సానుభూతి… రేవంత్, లోకేష్‌ ‘సేమ్ టు సేమ్’ స్కెచ్…!
  • ఒక్కసారి బంధాలు గాడితప్పితే… కథలో ఇక అన్నీ రోత ట్విస్టులే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions