కాలేశ్వరం ఢమాల్… ధరణి కమాల్… రెరా బాలకృష్ణ గోల్‌మాల్… నయీం డైరీస్ గందరగోళ్… హరితహారం సేమ్ సేమ్… ఇలా ఏది తవ్వినా సరే అంతులేని అక్రమాలు… మొత్తానికి కేసీయార్ పదేళ్లపాటు తెలంగాణను కుళ్లబొడిచిన తార్కాణాలే బయటపడుతున్నయ్… ఎలాగోలా తెలంగాణ సమాజం వదిలించుకుంది… ఇప్పుడు తెలంగాణ సమూహం భయమేమిటంటే…
ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక ఫెయిలైతే, మళ్లీ కేసీయార్ గద్దెనెక్కితే… ఇక కాష్మోరా మేల్కొని మీద పడ్డట్టే..! (చదవడానికి హార్ష్‌గా ఉన్నా సరే, దస్కిన మేడిగడ్డ బరాజ్‌ను చూస్తూ, తవ్వినకొద్దీ అనేక అరాచకాలు బయటికొస్తుంటే నిజంగానే విపరీతమైన ఆగ్రహం కలుగుతోంది తెలంగాణ బుద్దిజీవులకు…)
Ads
ఏ రంగాన్నీ వదల్లేదు… ఇప్పుడు రేవంత్ సర్కారు మిషన్ భగీరథ అక్రమాలపై దృష్టి సారించింది… మెటీరియల్ కొనకుండానే ఫేక్ బిల్స్ పెట్టారట… ఇంట్రా విలేజీ వర్క్స్‌లో గోల్ మాల్ అట… విజిలెన్స్ విచారణకు సర్కారు ఆదేశాలు జారీ చేసినట్టు దాదాపు అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి… ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే..? ఈ నిర్వాకంలో మాజీ సీఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్ పాత్ర మీద కూడా విజిలెన్స్ విచారణ జరగనుందట…
నో డౌట్… మంచి పథకమే… కానీ జరిగిన అవినీతి, అక్రమాల మాటేమిటి..? ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాదాపు 30 వేల కోట్లను అప్పుగా తీసుకున్నారు… కానీ అనేకచోట్ల పాత పైపులైన్లు, ట్యాంకులను కూడా కొత్తగా చూపించి డబ్బులు నొక్కేశారనే విమర్శలు చాన్నాళ్లుగా వినవస్తున్నవే… అఫ్ కోర్స్, కేసీయార్ ప్రభుత్వం దేన్ని వదిలింది..!?
సీఎంవో సెక్రెటరీగా స్మిత సబర్వాల్ స్వయంగా ఈ మిషన్ భగీరథ వ్యవహారాల్ని పర్యవేక్షించింది… అంతా ఆమె కనుసన్నల్లోనే… ఈ పథకం గురించి ప్లస్సులు, మైనస్సులు అన్నీ ఆమెకు తెలుసు… అందుకే ఆమె పాత్రను సమగ్రంగా విచారిస్తే మొత్తం కేసీయార్ ప్రభుత్వ నిర్వాకాలన్నీ బయటపడతాయని రేవంత్ ఉద్దేశం…
నిజానికి ఇక్కడ స్మిత సబర్వాల్ గురించి కూడా చెప్పుకోవాలి… ఆమెను తెలంగాణ సమాజం బాగా అభిమానించింది… ఆమె మీద ఔట్ లుక్‌లో ఏదో దిక్కుమాలిన కార్టూన్, వార్త వస్తే ఆమెకు మద్దతుగా నిలబడింది తెలంగాణ సొసైటీ… ఆ ఇష్యూలో ఆమె న్యాయపోరాటానికి కూడా ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బు ఇచ్చింది… ఆమె సీఎంవోలకు వచ్చాక ఆమె మాటకు ఎదురులేదు, ఎక్కడికీ ఆమెకు బదిలీల్లేవు… మిషన్ భగీరథ విషయంలో ఏ అధికారీ ఏమీ మాట్లాడటానికి ఏమీ లేదు… అంత అథారిటీ చెలాయించుకున్నదామె… సొంత ఆడబిడ్డగా అభిమానించిన తెలంగాణ సమాజానికి ఆమె ఏమి ఇవ్వగలిగింది..? ఇదేనా..?!
అబ్బే, ఆమె మంచిదే, ప్రభుత్వం డబ్బుల కోసం ఏవో అక్రమాలకు పాల్పడుతుంటే ఆమె ఏం చేయగలదు అంటారా..? పోనీ, విజిలెన్స్ విచారణలో అవన్నీ తేలితే మంచిదేగా… విజిలెన్స్ విచారణలో ఏమీ తేలకపోతే మరింత లోతు విచారణకు రేవంత్ సర్కారు మరో ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని కూడా వేసే ఆలోచనలో ఉందట… ఇందులో ఎవరెవరి పాత్ర తేలుతుందో ఇక వేచి చూడాల్సిందే…
Share this Article