.
సెలబ్రిటీలు ఈమధ్య వేదికల మీద పిచ్చి కూతలకు ప్రసిద్ధి… సారీలు చెబుతున్నారు… లెంపలేసుకుంటున్నారు… కొందరు అదీ చేయరు… జన్మఃసంస్కారం అది… లేదా డిక్షనరీలో ఆ ధోరణికి వేరే పదాలు కూడా ఉన్నాయి…
గతం వేరు, ఇప్పుడు వేరు… ఇప్పుడు ఫంక్షన్లు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనంలోకి వెళ్లిపోతున్నాయి… సెలబ్రిటీలు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటే తిరిగి మాటల్ని వెనక్కి తీసుకునే చాన్స్ లేదు… లెంపలేసుకోవడం తప్ప…
Ads
ఐతే కొన్నిసార్లు తాము అనుకున్నది వేరు, చెప్పాలనుకున్న దాంట్లో తప్పు ఉండదు… కానీ చెప్పలేకపోవడం, అంటే సరిగ్గా కన్వే చేయలేకపోవడం… అలా బుక్కవుతుంటారు… వర్తమాన సెన్సిటివ్ ఇష్యూస్ మీద అసలు సెలబ్రిటీలు మాట్లాడటమే తక్కువ, ఏమైనా తెలిసి ఏడిస్తే కదా… ఒకరో ఇద్దరో సరిగ్గా చెప్పలేక వివాదంలోకి జారుకుంటారు…
విజయ్ దేవరకొండ ఇదే టైపు… రెట్రో సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఏదో అన్నాడు… ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్ ఆదివాసీలను కించపరిచాడని పోలీసు కేసు పెట్టాడు… గుడ్, ఊరుకోవాల్సిన అవసరం లేదు… ఐతే ఎఫ్ఐఆర్ నమోదైందా, లేదా ఇంకా తెలియదు… కానీ… ఈ విషయంలో విజయ్ తప్పుందా లేదా… జస్ట్, ఓ డిబేట్ సేక్…
ఇక్కడ విజయ్ ఉద్దేశం గమనించాలి ముందుగా… తను వచ్చిన సందర్భం రెట్రో సినిమా… ఈ కథలో అండమాన్‌లోని ఓ దీవి… అక్కడ రాజరికపు ఇనుప కోరల్లో ఓ ఆదిమ లేదా ఆదివాసీ జాతి… వాళ్లను సదరు హీరో ఉద్దరించే కథ…
విజయ్ ఇక్కడ చెప్పాలనుకున్నదేమో… మొన్న పహల్‌గాం ఉగ్రవాద చర్యను ఖండించడం,… గుడ్, చాలామంది నోళ్లు పెగలని సెలబ్రిటీలకన్నా విజయ్ నయం… ఆ ఉగ్రవాదులకైనా సరైన చదువూసంధ్యా ఏడిస్తే ఇలా బ్రెయిన్ వాష్ అయ్యేది కాదు… 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు చేస్తున్నారు… కశ్మీర్ మనదే, కశ్మీరీలు మనవాళ్లే, కానీ పాకిస్థానీలే కామన్ సెన్స్ లేక ఇలా చేస్తున్నారు…
ఇదీ తను చెప్పింది… ఇక్కడ విజయ్ తీసుకున్న కాంటెక్స్ట్ ట్రైబల్స్ ఇష్యూ కాదు… ఆ పదం అక్కడ వాడాల్సిన అవసరమూ లేదు… ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, కశ్మీరీలను సపోర్ట్ చేస్తూ, పాకిస్థానీలను తిడుతూ… ఆ సినిమా కథలోని ట్రైబల్స్ ఇష్యూను కూడా కలిపేసి కలగాపులగం చేశాడు… దురుద్దేశం ఏమీ లేకపోయినా సరే, తన చెప్పాలనుకున్నది సరిగ్గా కన్వే చేయలేనితనం అది…
ఐతే విజయ్ ఉద్దేశం ట్రైబల్స్‌ను ఉగ్రవాదులతో పోల్చడం గాకపోయినా… జనంలోకి అలాగే వెళ్లింది… తన ఉద్దేశం ట్రైబల్స్‌ను కించపరచడం గాకపోవచ్చు… కానీ ఎప్పుడైతే వివాదం నెలకొందో తను గానీ, తన టీమ్ గానీ ‘అలాంటి ఉద్దేశం లేదు, ఒకవేళ ఎవరికైనా బాధ కలిగితే సారీ’ అని చెబితే ఏం పోయింది..? హుందాగా ఉండేది… అది సంస్కారం కూడా..!!
Share this Article