మిత్రుడు జగన్నాథ్ గౌడ్ చెబుతున్నట్టు…. వినేష్ ఫోగాట్ మొదటి అంతర్జాతీయ ప్రపంచ పోటీ న్యూ ఢిల్లీ లో 2020 సంవత్సరంలో ఆసియన్ రెస్లర్ పోటీలో 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు.
చివరి అంతర్జాతీయ పోటీ 2022 లో ప్రపంచ రెస్లర్ పోటీల్లో కూడా 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం 53 కాకుండా 50 కేజీల విభాగంలో పాల్గొని చివరికి పోటీ రోజు బుధవారం బరువు చూసినప్పుడు 50 కేజీల కంటే ఎక్కువ ఉండటం వలన ప్యారిస్ ఒలంపిక్స్ నుంచి డిస్ క్వాలిఫై చేశారు. 50 కేజీలు అంటే 50 లోపు బరువు ఉండాలి అని అర్ధం. ఫైనల్ గా బరువు మిషన్ ఎక్కినప్పుడు ఒక్క గ్రాము ఎక్కువ ఉన్నా అది 50 నుంచి 51 కేజీ విభాగంలోకి వస్తుంది.
సాధారణంగా 15 నుంచి 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయంలో కొందరు జుట్టు కత్తిరించుకుంటారు, ఇంకొందరు బ్లడ్ కొంత తీపించుకుంటారు. ఏమి చేసినా చివరి నిమిషం వరకు చేసుకోవచ్చు. ఆ చివరి నిమిషంలో నిర్ణీత కేటగిరీ బరువు కంటే 0.1 గ్రాము ఎక్కువ ఉన్నా డిస్ క్వాలిఫై చేస్తారు.
Ads
అసలు 11 సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలో కామన్ వెల్త్ పోటీలప్పుడు కూడా 51 కేజీ విభాగంలోనే పోటీ పడింది. నిజానికి ఆమె ఇప్పుడు కూడా 53 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఎందుకు మన కమిటీ ఆమెని 50 కేజీల అత్యంత తక్కువ బరువున్న కేటగిరీలో పోటీ లో నిలిపినట్లు అనేది ముందు ముందు తెలియవచ్చు…
ప్రస్తుత 2024 ఒలంపిక్స్ రెజ్లింగ్ లో మహిళా కేటగిరీలు
1. 50 కేజీల విభాగం పోటీలు
2. 53 కేజీల విభాగం పోటీలు
3. 57 కేజీల విభాగం పోటీలు
4. 62 కేజీల విభాగం పోటీలు
5. 68 కేజీల విభాగం పోటీలు
6. 76 కేజీల విభాగం పోటీలు
బ్రెజిల్ లో జరిగిన రియో 2016 ఒలంపిక్స్ లో కూడా తాను ఉన్న బరువు కంటే తక్కువ బరువు కేటగిరీలో పాల్గొని చివరికి బరువు చూసే సమయానికి వినేశ్ బరువు ఎక్కువ ఉండటంతో ఆమెని డిస్ క్వాలిఫై చేశారు…. ఏది ఎమైనా నీవు విజేతవు వినేష్… అందులో డౌట్ లేదు, తను ఫైటర్… ఓటమే ఎరుగని ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసి గెలిచింది… కానీ…?
ఆమె ఫైనల్స్‌లోకి తీసుకొచ్చిన పోటీ సమయంలో బరువు తూచలేదా..? అప్పుడు కూడా ఎంతో కొంత ఎక్కువ ఉండే ఉంటుంది కదా… అలాగే కోచ్ చివరి వరకూ ఆమె బరువును పరిగణనలోకి తీసుకుని, జాగ్రత్తపడాల్సింది కదా… తనెందుకు నిర్లక్ష్యం వహించాడు… ఎక్కువ బరువు కేటగిరీకి బదులు తక్కువ కేటగిరీలో పోటీపడుతున్నప్పుడు, బరువు విషయంలో చివరి క్షణం వరకూ అప్రమత్తంగా ఉండాలి కదా… ఎక్కడ, ఎవరిది నిర్లక్ష్యం… ఎవరు జవాబుదారీ..? బంగారు పతకం ఇండియా ఖాతాలో పడుతుందని ఆశపడుతున్నవేళ ప్రతి భారతీయుడి గుండె పగిలిపోయింది… బాధ్యులను క్షమించకూడదు..!!
Share this Article