Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హైకోర్టు జడ్జికి షాక్ ఇచ్చిన మోడీ సర్కారు… ఢిల్లీ నుంచి కలకత్తాకు బదిలీ…

July 27, 2023 by M S R

తీర్పుల మెరిట్ గురించి కాసేపు వదిలేయండి… ఏం రాస్తే ఎవరితో ఏం తంటా ముంచుకొస్తుందో తెలియదని మెయిన్ స్ట్రీమ్ అస్సలు రాయడం లేదు… జడ్జిలు తిరుమలకు వస్తే ఫోటోలు వేసి, వార్తలు రాసి, మర్యాదగా చేతులు దులుపుకుంటే సరి అనుకుంటోంది మెయిన్ స్ట్రీమ్… ఎవరి అవసరం, ఎవరి ముందుజాగ్రత్త వారిది… ఏది రాయవచ్చో, ఏది రాయకూడదో తెలిసిన న్యాయమేధావులు సైతం నోళ్లు కట్టేసుకుంటున్నారు…

ఎప్పుడేం అవసరం వస్తుందో అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ కనబరుస్తున్న వింత ధోరణి చివరకు ఆయా జడ్జిల వ్యక్తిగత వ్యవహారశైలి మీద కూడా వార్తలు కనిపించకుండా చేస్తోంది… ఇలాంటి వార్తల్లో కాస్త దూకుడు కనిపించే ఆంధ్రజ్యోతి కూడా ఈమధ్య చల్లబడింది ఎందుకో… ఓ రెండు ఉదాహరణలు చెప్పుకుందాం…

ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వ్యవహరించిన జస్టిస్ గౌరంగ్ కాంత్ రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులోని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ న్యాయమూర్తి గారు గత నెలలో, అంటే జూన్ 12 న ఢిల్లీ జాయింట్ కమీషనర్ అఫ్ పోలీస్ (సెక్యూరిటీ)కి ఒక లేఖ రాశారు. ఎంతో బాధతో.. ఆవేదనతో తాను ఈ లెటర్ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన అధికారిక నివాసంలో భద్రత కోసం కేటాయించిన అధికారుల్లో అంకిత భావం లేకపోవటం, చేతకానితనం వల్ల తాను తన పెంపుడు కుక్కను పోగొట్టుకున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

Ads

తలుపు లాక్ చేసి ఉంచాలని తాను ఎన్నో సార్లు చెప్పినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అని.. వాళ్ళు తన సూచనలను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు అన్నారాయన. విధుల్లో ఇంతటి నిర్లక్ష్యం, అసమర్ధత చూపించే వాళ్ల వల్ల తన ప్రాణాలకు..స్వేచ్ఛకు ముప్పు ఉంది అని… ఇలాంటి భద్రత సిబ్బంది వల్ల తాను భయపడాలి వస్తోంది అని ఆ లెటర్ లో ప్రస్తావించారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించి తన అధికారిక నివాసం వద్ద బాధ్యతలు చూస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని… వాళ్ళు అసలు ప్రభుత్వ విధుల నిర్వహణకు ఏ మాత్రం పనికి రారు అన్నారు. వీరిని సస్పెండ్ చేసి విచారణ జరిపించటంతో పాటు మూడు రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని జడ్జి ఆదేశించారు.

judge

ఇదీ ఆయన రాసిన లేఖ… అది బయటికి వచ్చింది… సోషల్ మీడియాలో ప్రముఖంగా సర్క్యులేట్ అయ్యింది కూడా… తరువాత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ (అపాయింట్‌మెంట్స్ డివిజన్) ఆయన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి ఏకంగా కలకత్తా హైకోర్టుకు బదిలీ చేసేసింది… అంటే, ఆయన కోరినట్టు తన ఇంటి భద్రత సిబ్బంది మీద కాదు, ఆయనపైనే చర్య తీసుకుంది… ఇదిగో ఆయన బదిలీ ఆర్డర్…

జడ్జి

ఆమధ్య సేమ్ ఇంకో జడ్జి రాసిన లేఖ కూడా వైరల్ అయ్యింది… అలాహాబాద్ హై కోర్టు జడ్జి గౌతమ్ చౌదరి తాను న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళుతున్న సమయంలో తనకు అసౌకర్యం కలిగించారు అని.. దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు లేఖ రాశారు. పలుమార్లు కోరినా కూడా పాంట్రీ కార్ సిబ్బంది జడ్జికి అవసరమయిన ఫలహారాలు అందించలేదు అని, పాంట్రీ కార్ మేనేజర్ ఎన్ని కాల్స్ చేసినా కూడా స్పందించలేదు అని తన లేఖలో ప్రస్తావించారు.

ఈ లేఖ పై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్త్రి డీవైచంద్రచూడ్ కూడా స్పందించారు. జడ్జిలకు ఉన్న ప్రోటోకాల్ హక్కులను ఉపయోగించుకునే విషయంలో ఆచితూచి వ్యవరించాలని సూచించారు. అంతేకాని వీటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని చూడటం సరికాదు అన్నారు. ఈ రెండు లేఖలు ఇప్పుడు ఆన్ లైన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకరు ఏమో కుక్క తప్పిపోయింది అని.. మరొకరు తనకు స్నాక్స్ ఇవ్వలేదు అని ఫిర్యాదు చేయటంపై నెటిజనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు… అలహాబాద్ హైకోర్టు జడ్జి మీద కూడా మోడీ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుందా..? ఏమో, దాని ఫాలో అప్ తెలియదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions