గురువుగా గౌరవించడం, పెద్దలకు ప్రణమిల్లడం, కాళ్లు మొక్కడం, పాదపూజ చేయడం…. ఇవన్నీ ఓ హంబగ్ సమర్థనలు…. ఒకరి కాళ్లకు మొక్కడం అంటే ఎదుటోళ్ల పెద్దరికాల్ని, పెత్తనాల్ని, ఆధిపత్యాన్ని అంగీకరించడం… మోకరిల్లడం…. మానవ పరిణామ క్రమాన్ని, సాంస్కృతిక పరిణామాన్ని నిశితంగా పరిశీలించే ప్రతి ఒక్కరూ అంగకరించే నిజం అది…
తల్లిదండ్రులకు, సీనియర్ కుటుంబసభ్యులకు మొక్కు వోకే… అందులో గౌరవం ఉంది, అణకువ ఉంది,… అందులో సిగ్గుపడాల్సింది లేదు, తలవంచాల్సింది లేదు,… ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శించడమే… గురువులు వోకే… ఇక మిగతా ఎవరికి కాళ్లు కడిగి పూజ చేసినా అది ఆధిపత్య అంగీకార సూచనే…
పురాతన కాలం నాటి ధోరణి… (నిజానికి ఈ సంస్కృతి ఎలా వచ్చిందనేది ఓ థీసీస్ సబ్జెక్టు… అది ఈరోజుకూ నడుస్తూనే ఉంటుంది… చెంఘిజ్ ఖాన్ కాలం తరహాలో… దీంట్లో గౌరవ ప్రకటనకన్నా బానిసధోరణే అధికం… (బూట్లు, పాదాలు నాకించుకోవడం అనేది మరీ సీరియస్ సబ్జెక్టు…) గురువులు అనగానే పాదపూజలు అనే దిక్కుమాలిన దాస్యానికి దిగిపోతారు చాలామంది… సీమంతాలు, రజస్వల ఫంక్షన్లకు కూడా డబ్బు కాంక్షతో ఎగేసుకుని వెళ్లి, పాదపూజలు చేయించుకుని డబ్బు దండుకునే పెద్ద పెద్ద స్వాముల గురించి ఇక్కడ కాసేపు మరిచిపోదాం…
Ads
జగ్గీ వాసుదేవ్… స్వయం ప్రకటిత గురువు… మరణాలు, ఆక్రమణలు గట్రా బోలెడు ఆరోపణలు… సరే, ఏదో ఆదిగురువును పెట్టాడు, ఏదేదో చేస్తున్నాడు సరే… తన రిటెయిల్ మార్కెట్ సైట్‌లో తన ఫోటో కనిపించింది… దాని ధర 3200 అట… అందులో తన పాదం ఫోటో ఉంటుంది, ఓ ఫ్రేమ్… అంతే…
రోజూ తెల్లారే దాన్ని మొక్కి, మోక్షప్రాప్తి బాటలో నడవటానికి సౌకర్యం అన్నమాట… ఆ పాదం ఫోటో అమ్మకం దేనికీ అంటే… గురువు పాదపద్మాల ధూళి, ఆధ్యాత్మిక సాధనలో బాట అని ఏవో పిచ్చి సమర్థనలు కూడా అందులో ఉంటాయి… అంతటి భరతుడే రాముడి పాదుకల్ని కుర్చీలో పెట్టి పరిపాలన సాగించాడు… అదీ చెప్పులు, పాదాలు మహత్యం…
ఇప్పుడు అందరి భయమూ ఏమిటంటే..? ఈ జగ్గీ వాసుదేవ సద్గురు గారు రేప్పొద్దున పాదధూళి అంటూ ఏదో మట్టిని, ధూళిని కూడా అమ్మకానికి పెడతారేమోనని..! మొక్కండి, నమ్మండి, పూజించండి… అంతే గానీ ఈ నిజపాద దర్శనాలు ఏమిటి..? పాద ధూళి మార్కెటింగులు ఏమిటి..? జనాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు..?
మొదలెట్టకండి… ఇతర మతాల్లో ఈ పోకడలు ఉంటే వ్యతిరేకిస్తారా అని… ఎస్, ఏ మతంలో ఇలాంటి పోకడలున్నా సరే ఖండనార్హమే… పాద దర్శనాలు, పాదపూజలకే అంత మహత్తు ఉంటే ఇక యాగాలు దేనికి..? హోమాలు దేనికి..? మంత్రాలు దేనికి..? మనకున్న విచక్షణ జ్ఞానానికి సార్థకత దేనికి..!!
ఈ పాదాల ఫోటో అమ్మకాలపై నెట్‌లో ఒక్కొక్కరూ ఆడుకుంటున్నారు… అఫ్‌కోర్స్, ఒకరిద్దరు సమర్థకులు కూడా ఉంటారనుకొండి..!!
Share this Article