ఫుల్లు బరిబాతల నిలబడి, పూల గుత్తిని అడ్డంపెట్టుకున్న లైగర్ పోస్టర్ మస్తు వైరల్ అయిపోయింది… మీమ్స్, జోక్స్, షేర్స్ అదిరిపోతున్నయ్… ఓహో, ఎంత విప్పి చూపిస్తే అంత యాటిట్యూడ్ అన్నమాట అనే చెణుకులు… మొత్తానికి అర్జున్‌రెడ్డి ఈజ్ బ్యాక్… విత్ ఎక్సట్రా బోల్డ్ యాటిట్యూడ్… అదేదో ‘‘మగతనం పర్‌ఫ్యూమ్’’ యాడ్‌కు ఫర్‌ఫెక్ట్ ఫిట్… సిక్స్ ప్యాకా, ఎయిట్ ప్యాకా ఎవడు చూస్తాడు..? అందరి కళ్లూ ఆ పూలగుత్తి మీదే… సరే, ఈ జబర్దస్త్ భాష వదిలేస్తే…
అప్పట్లో విద్యాబాలన్ సినిమాకు వచ్చిన సందేహమే మళ్లీ… ఆమె నటించిన సినిమా పేరు షేర్ని… అంటే ఆడపులి… అంతేనా..? పులికి స్త్రీలింగపదం తెలుగులో లేదా..? లయన్ అంటే సింహం… లయనెస్ అంటే సివంగి… టైగర్ అంటే పులి… మరి టైగ్రెస్ అంటే..? సరే, ఆడపులి అనే రాసుకుందాం… ఏదో ఒక పులి… మరి సింహం, పులి కలిసిన హైబ్రీడ్ సంతానాన్ని… అదేనండీ, విజయ్ దేవరకొండ భాషలో లైగర్‌ను తెలుగులో ఏమనాలి..? కేసరి ప్లస్ వ్యాఘ్రం కలిపి… ఎలాగూ హైబ్రీడే కదా… కేసఘ్రం అని రాసేద్దామా..? మరీ గొట్టుగా ఉంది కదా…
లైగర్ అంటే… సాంకేతికంగా మగసింహానికీ, ఆడపులికీ పుట్టే సంతానం… నో, నో, మగపులికీ, సివంగికీ పుట్టే సంతానం కాదు…! ఇలా మగపులికీ, సివంగికీ పుట్టే సంతానాన్ని టైగన్ అంటారు… అనగా టైగర్ ప్లస్ లేడీ లయన్ అన్నమాట… మరి ఆ టైగన్‌ను తెలుగులో ఏమనాలి..? పులి పస్ల్ సివంగి కాబట్టి పువంగి అందామా..? ఇవి సరే… ఈ లైగర్‌లలో ఆడను ఏమనాలి..? మగను ఏమనాలి..? సేమ్, టైగన్‌కు ఆడ, మగ పేర్లు ఏమిటి..? తెలుగులో వేర్వేరుగా ఎలా రాయాలి..?
Ads
పిచ్చి లేస్తోందా..? ఈ పోస్టర్ కూడా పిచ్చిరేపేలాగే ఉంది కదా… ఇది అచ్చం మగ యాటిట్యూడ్‌కు ప్రతీక అట… ఓహ్, యాటిట్యూడ్‌కూ లింగభేదాలు ఉంటాయా..? సరే… ఏం చేస్తం మల్ల, విజయ్‌తోని అట్లుంటది మరి… అసలే నరేష్, పవిత్ర లోకేష్ అపూర్వ, చారిత్రిక బంధం మీద వార్తలతోనే నెటిజనానికి పిచ్చి రేగుతోంది… ఇప్పుడు అది సరిపోదని ఈ పోస్టర్ వదిలారు…
ఇద్దరూ శుద్ధపూసలే… ఆమెకు నరేష్ మూడోవాడు… ఆయనకు పవిత్ర నాలుగవది… అఫీషియల్… ఆమెకు పాత మొగుడు సుచేంద్ర ప్రసాద్‌తో అధికారికంగా విడాకులు అయినట్లు లేవు… ఇక నరేష్‌కు కూడా అంతే… మూడో భార్యతో ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నాడట… జస్ట్, నెల క్రితమే విడాకుల నోటీస్ ఇచ్చాడట… మరి ఇష్టం లేక దూరంగా ఉన్నవాడు విడుపుకాగితం ఎందుకు ఇవ్వలేదు..? అంతకుముందు ఇద్దరిని అధికారికంగా వదిలించుకున్న మగాడే కదా…
ఆ మూడో భార్య బెంగుళూరు వెళ్లి మరీ పవిత్రను, నరేష్‌ను మీడియా మీట్‌లో ఏకిపారేసింది… తిడితే హైదరాబాదులో తిట్టు, కానీ బెంగుళూరులో తిట్టడం మర్యాద కాదని పవిత్ర ఏడుపు… నరేష్ ఇంకాస్త దిగజారి తన మూడో భార్య రమ్యకు డ్రైవర్‌తో సంబంధాలు, మగ కేబరేలో సంబరాలు గట్రా ఏదేదో చెప్పేస్తున్నాడట… అల్టిమేట్‌గా తన ఇజ్జత్ తనే తీసుకుంటున్నాడని మరిచిపోతున్నాడు… ఇప్పుడీ లైగర్ పోస్టర్‌తో ఈ ‘‘పవిత్రబంధం’’ చర్చ కాస్తా పక్కకు వెళ్లిపోయింది… వర్మ మార్క్ సినిమాను ఉచితంగా చూస్తున్న ఫీల్ కాస్తా నెటిజనానికి దూరమైపోతోంది… ప్చ్…
అవునూ, డీజే టిల్లు మామా… బీజేపీ వాళ్ల మీటింగులకు సోషల్ మీడియాలో మైలేజీ రాకుండా ఉండటానికి గులాబీ క్యాంపు ఈ పోస్టర్ విడుదలను ప్రోత్సహించిందంటావా..? అయి ఉండదులే… అలాగైతే మరి యశ్వంత్, కేసీయార్‌ల అపూర్వ సంగమం మైలేజీ కూడా దెబ్బతింటుంది కదా… ఈ కేసఘ్రం, అనగా లైగర్ (కేసరి ప్లస్ వ్యాఘ్రం) పోస్టర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే వదిలి ఉంటారు..! సాలా, క్యా పోస్టర్ హై…!! గప్పట్ల సంపూర్ణేష్ ఓ కాలీఫ్లవర్ అడ్డుపెట్టుకుని గిసుంటి పోస్టర్ ఏసిండు… కాకపోతే ఫ్యామిలీ ప్యాక్..!! అంతకుముందు పీకే అనే సినిమాలో ఆమీర్ ఖాన్ టేప్ రికార్డర్‌ను అడ్డం పెట్టుకున్నాడు…!!
Share this Article