Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జైషా నిశ్శబ్ద దరహాసం..? మొత్తం ఆ వైరల్ ఫోటోలో ఉన్నట్టుగానే…?!

June 3, 2025 by M S R

.

ఐపీఎల్ 2025… ఫిక్సింగే గెలిచిందా..? ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ బాగోతం అని మెజారిటీ ఇండియన్ క్రికెట్ ప్రేమికులు అనుమానిస్తారు… ఐనా చూస్తూనే ఉంటారు…

కొన్నాళ్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది తెలుసు కదా… అది క్రికెట్ బాస్ జైషా పేరిట ప్రచారంలో ఉంది… ఇదుగో ఇదీ…

Ads

ipl

అవును, ఫైనల్ దాకా కీలక మ్యాచుల ఫలితం ఈ ఫోటోలో ఉన్నట్టే జరుగుతోంది… చివరకు ఫైనల్‌లో కూడా అంతే… ఎప్పుడైతే పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఔటయిపోయాడో అప్పుడే బెంగుళూరు గెలుపు ఖరారయిపోయింది… ప్రీతి జింతా ఆశలు ఆవిరయ్యాయి… ఖేల్ ఖతం…

18 ఏళ్ల ఐపీఎల్ కప్పు గెలవాలనే ఆమె కల ఆరిపోయింది… నిజానికి క్వాలిఫయర్, నాకవుట్, సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు ఏవీ ఫిక్సింగ్ బాపతులా అనిపించలేదు… ఫైనల్ కూడా కేవలం ఆరు పరుగుల తేడాతో బెంగుళూరు విజయం… శ్రేయాస్ మరో రెండుమూడు ఓవర్లు నిలబడి ఉంటే కథ వేరే ఉండేదేమో… నిజమైన ఆటే సాగుతున్నది అనిపించింది చాలాసేపు… నిజానికి ఏ జట్టూ అంత తేలికగా వదిలేసే రకం కాదు… ప్రత్యేకించి ముంబై ఇండియన్స్… కానీ..?

కోహ్లీ

ముంబై జట్టులో రోహిత్, సూర్యకుమార్, బుమ్రా, హార్దిక్ వంటి అతిరథులు… ఐనా ఫైనల్‌కు రాకుండానే ఓడిపోయారు… గుజరాత్, ఢిల్లీ అప్పటిదాకా బాగా ఆడుతూ వచ్చి, కీలకమైన మ్యాచుల్లో ఈజీగా చేతులెత్తేశాయి… ఐనా సరే, ఈసారి పంజాబ్ జట్టు విజయకేతనం ఎగురవేస్తుందనే నమ్మారు చాలామంది… అంత బాగా ఆడింది… పాయింట్ల పట్టికలోనూ టాప్…

కాకపోతే మొదటి నుంచీ ‘ఈసాల కప్పు నమ్‌దే’ (ఈసారి కప్పు మనదే) అంటోంది బెంగుళూరు జట్టు… బాగా జోష్ కనిపించింది జట్టులో… ఆటతీరు కూడా బాగుంది… కానీ వరుసగా ఫిక్సింగ్ ప్రచారాల్లో ఉన్నట్టుగానే జరిగిన తీరు అనేక సందేహాలకు దారితీస్తోంది… (ఈ ఫిక్సింగ్ ఫోటో కూడా బెంగుళూరు ఫ్యాన్స్ క్రియేట్ చేశారనే అనుకున్నారు మొదట్లో…)

kohli

సరే, ఏదయితేనేం… విరాట్ కోహ్లీ (బెంగుళూరు టీమ్ కెప్టెన్ కాకపోయినా సరే) ధోనీ మీద, రోహిత్ శర్మ మీద… వర్ధమాన స్టార్ క్రికెటర్లపైనా విజయం సాధించాడు… మొత్తానికి ఎవరు ఎక్కువ రన్స్ చేశారు… ఎవరు ఎక్కువ వికెట్లు తీశారు… ఎవరు మంచి కెప్టెన్సీ ప్రదర్శించారు… ఈ లెక్కలకన్నా… అనుకున్నట్టుగానే జైషాయే గెలిచాడా..?

kohli

అవునూ, నిజంగానే తను ఫిక్స్ చేయాలనుకుంటే ఏ ముంబై జట్టునో, ఏ గుజరాత్ జట్టునో తను గెలిపించాలి కదా… ఒకవేళ ఈ ప్రచారాలు నిజమే అయి ఉంటే… మరి బెంగుళూరుతో కనెక్షన్ ఏమిటి..? అదే ఎవరికీ అర్థం కానిది… ఏమో, లోగుట్టు పెరుమాళ్లకెరుక… చప్పుడు గాకుండా జైషా మార్మికంగా, గుంభనంగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది కదా..!!

ప్రీతీ… బ్యాడ్ లక్… ఐపీఎల్ 19వ సంవత్సరంలో చూద్దాంలే… శ్రేయాస్‌ను అలాగే కాపాడుకో… మిమ్మల్ని ఫైనల్ దాకా తీసుకొచ్చింది తనే… చివరలో ఎందుకు చేతులెత్తేశాడని మాత్రం ఎవరినీ అడగకు… జవాబు దొరకదు..!!

ipl punjab

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions