ఓ చిన్న ముచ్చట… ఇండియాలో తిరిగే డొమెస్టిక్ ఎయిర్ లైన్స్‌లో ఏది బెటర్..? ఇదీ ప్రశ్న… చాలామంది విస్తారా బెటర్ అని చెప్పారు… అదెప్పుడూ గతంలో ఎక్కలేదు… అంటే టాటా వాళ్ల ఆ విమానాలు ఎగరడం మొదలయ్యాక అని అర్థం… రీసెంటుగా ముంబై వెళ్లబడ్డాను… ఉన్నది ఒక్క రోజే… ఎండాకాలంలో విజయవాడలో ఉన్నట్టే… ఎండ, చెమట, ఉక్కబోత…
ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే… ఇరుకు రోడ్లు, క్రీస్తుపూర్వం నాటి ఇళ్లు… హైదరాబాద్ ఎంత బెటరో కదా అని ప్రతి అడుగులోనూ అనిపిస్తుంది… సరే, ముంబై కోస్తా నగరం కాబట్టి, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండి ఈ చెమట సమస్య కామనే… మనం డొమెస్టిక్ దగ్గర ఉన్నాం కదా… మళ్లీ ఇండిగో బారిన పడాల్సి వచ్చింది… వాడిది ఓ దందా…
సాధారణంగా ఇంటర్నేషనల్ ఫ్లయిట్ అయితే రెండు గంటల ముందు రమ్మంటారు… ఎర్లీగా బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు… కానీ డొమెస్టిక్‌కు ఈ రూల్స్ ఎక్కువగా ఉండవు… గంట ముందు రిపోర్ట్ చేసినా చాలు… ఇంకా లేటుగా వచ్చేవాళ్ల కోసం కూడా ఫైనల్ కాల్, ఫైనల్ కాల్ అని పిలుస్తూనే ఉంటారు… కానీ ఇండిగో వాడిది దందా అని చెప్పుకున్నాం కదా… రెండు గంటల్లోపే వచ్చేయాలట… అలాగని టికెట్టుపై గానీ, వాడి సైట్‌లో గానీ ఉండదు…
Ads
మనం తాపీగా వెళ్లామో… గేట్లు క్లోజ్ అంటాడు… బోర్డింగ్ ఆపేశాం అంటాడు… మరేమిటి దారి అని తెల్లమొహం వేస్తాం… వేరే ఫ్లయిట్ పట్టుకొండి అంటారు వాళ్లు తేలికగా… తీరా ఆ పీక్ టైమ్‌లో టికెట్లు దొరకొచ్చు, దొరక్కపోవచ్చు… దొరికినా అవి నాలుగైదు రెట్ల రేట్లతో ఉంటయ్… మన ప్రోగ్రాం అంతా డిస్టర్బ్ అయిపోతుంది… చూసీ చూసీ ఫలానా కౌంటర్‌కు వెళ్లండీ అంటారు… అక్కడ ఈ దందా ఉంటుంది… ఇంకో ఫ్లయిట్‌లో సీటు అడ్జస్ట్ చేస్తాం అంటూ సగం ఫ్లయిట్ చార్జి అదనంగా వసూలు చేస్తాడు… చూశారా, మేం కాబట్టి మిమ్మల్ని ఆదుకున్నాం అన్నట్టు మొహం పెడతాడు… మనం ఎడ్డిమొహాలేసుకుని వాళ్లు అడిగినంత కట్టేసి, హౌలాగాళ్లం అయిపోతాం… విచిత్రంగా ఈ దందాలు ఏ అధికారికీ కనిపించవు…
తీరా సర్వీసు కూడా దరిద్రం… కనీసం ఓ చిన్న వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు… ఈ ఇండిగో దుర్మార్గపు ధోరణి దగ్గర సీన్ కట్ చేద్దాం… వాపస్ వచ్చేటప్పుడు విస్తారా… కాస్త రేటెక్కువ గానీ ప్లజెంట్… కేబిన్ క్రూతో సహా… మామూలుగా ఎయిర్ హోస్టెస్ అనగానే ఇతర విమాన సర్వీసుల్లో పిక్కలు, చంకల దాకా కనిపించే పిచ్చి స్కర్టులు, ఫుల్లు మేకప్పులు కనిపిస్తాయి కదా… అసలు ప్రయాణికుడికి అసిస్ట్ చేయడమే హోస్టెస్ విధి… దానికి ఈ ఎక్స్‌పోజింగ్ ఏమిటో, ఎందుకో తెలియదు…
కానీ విస్తారాలో ఫుల్ డ్రెస్సులో ఉంటారు హోస్టెస్‌లు… ఎక్కువ మేకప్పును పులమరు… డీసెంట్ డ్రెస్సింగు… పైగా ఆడ హోస్టెసుల సంఖ్య తక్కువే… అందంగా ఉండే మగ హోస్టులే ఎక్కువ… (కేబిన్ క్రూ)… ఫుడ్ ఆర్డర్ ఇస్తే సప్లయ్, లేదా స్నాక్స్ ఇస్తారు… బిజినెస్ క్లాస్ అయితే ఎక్కగానే వెల్‌కం డ్రింక్… నిజంగా ప్రయాణికుడిని గెస్టులా చూస్తారు… టాటా అంటే టాటాయే…
ఇండిగో వాడికి మరో దరిద్రపు సలహా… పేర్లలో తేడా ఉంటే, ఆ సాకుతో కూడా అదనపు వసూళ్లు చేసుకోవచ్చురరేయ్… ప్రయాణికులకు ఓ సలహా… ఆన్‌లైన్‌లో చెకిన్ అయిపోయి, ఈ-బోర్డింగ్ చూపించి, నేరుగా ఆ గేటు వద్దకు వెళ్లిపోవడమే… కాకపోతే చెకిన్ బ్యాగేజీ ఉండకూడదు… ఫిజికల్ బోర్డింగ్ పాస్ కోసం వెళ్తే కొర్రీలు, అదనపు వసూళ్లు అనే దందాకు గురవుతాం… బహుపరాక్…
Share this Article