Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక వృద్ధుడి హుక్కా… స్వామి వివేకానందుడిలో ఓ ఆత్మమథనం…

January 12, 2025 by M S R

.

.       (Sai Vamshi) …. * వివేకానందుడు తాగిన హుక్కా *

స్వామి వివేకానంద పొగతాగడాన్ని చాలా ఇష్టపడేవారు. తీర్థయాత్రలు చేసే సమయంలో, వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఖాళీ సమయాల్లో పొగతాగడం ఆయనకు ఉపశమనంగా ఉండేది.

Ads

ఒకరోజు సాయంత్రం ఉత్తర భారతదేశంలోని ఓ వీధిలో ఆయన నడుస్తూ ఉండగా ఒక గుడిసెలో ఒక వృద్ధుడు హుక్కా తాగుతూ కనిపించాడు. ఆయనకు దాన్ని తాగాలని చాలా కోరిక కలిగింది. ఒకసారి ఆ హుక్కాను తనకిమ్మని ఆ వృద్ధుణ్ని అడిగారు.

దానికా వృద్ధుడు సమాధానం ఇస్తూ ‌”అయ్యా! నేనో పాకీవాణ్ని. అంటరానివాణ్ని. మిమ్మల్ని చూస్తే చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన మనిషిలాగా ఉన్నారు. నేను తాగిన హుక్కా మీరెలా తాగుతారు?” అన్నాడు.

“నిజమే! నువ్వు తాగిన హుక్కా నేను తాగలేను” అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి వివేకానందుడిలో అశాంతి నెలకొంది.

“నేను ఇంతకాలం నేర్చుకున్నదేమిటి? నేను చేసిందేంటి? ప్రతి మనిషిలో శివుడు ఉంటాడని నా గురువు రామకృష్ణ పరమహంస చెప్పారు. నేను ఇప్పుడు సన్యాసిని. సర్వసంగ పరిత్యాగిని. అయినా నాలో ఈ భేదభావాలు ఎందుకు?

శూద్రులు, దళితులు మాత్రం దైవసంతానం కాదా? ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్న భావం నాలో ఎలా వచ్చింది?” అనుకుని వెంటనే ఆ వృద్ధుడి దగ్గరకు తిరిగి వెళ్లి అతణ్ని మళ్లీ అడిగి హుక్కా తీసుకుని తాగారు.

“ఇప్పుడు నాకు రెండు విషయాలకు సంతోషంగా ఉంది. నా చిరకాల కోరికైన హుక్కా తాగడం నెరవేరింది. ఈ ప్రపంచంలో అందరూ సమానమే అన్న విషయాన్ని నీ హుక్కా తాగడం ద్వారా నేను గ్రహించాను” అని అతనితో చెప్పారు.

(Indian Spiritual Leader ‌’Sri Chinmoy’ (Chinmoy Kumar Ghose) రాసిన “Great Indian meals: Divinely delicious and Supremely Nourishing, Part 5” పుస్తకంలో రాసిన అంశాలు) (ఇవాళ వివేకానంద జయంతి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions