స్నాక్స్ టైమ్ కదా… ఏమైనా ప్లేటులో పెట్టుకుని, టీవీ ఎదుట తిష్ట వేశారా అప్పుడే…? ట్యాబులో ఓటీటీ ఏదైనా ఓపెన్ చేశారా..? అయితే సారీ… అప్పుడే స్టోరీ లోపలకు వెళ్లిపోకండి… కాసేపయ్యాక చదువుకోవచ్చు… ఎందుకంటే… ఇది కొందరికి పడకపోవచ్చు… వాంతి వచ్చే ప్రమాదమూ ఉంది… అదీ డిస్‌క్లెయిమర్… పైగా తొలిసారి సోనూ సూద్‌ను నోరు మూసుకోవోయ్ అని తిట్టాలనిపించే స్టోరీ… ఎంత సోనూ సూద్ అయితే మాత్రం తన పిచ్చి చేష్టల్ని, వ్యాఖ్యల్ని కూడా ప్రేమించాలా ఏం..?
టీవీల్లో చాలెంజింగ్, ఎక్స్‌పరిమెంటల్ రియాలిటీ షోలు తెలుసు కదా… ఉదాహరణకు బిగ్‌బాస్ వంటివి… కొందరిని ఓ హౌజులో పడేసి, కమ్యూనికేషన్స్ లేకుండా చేసి, బయట ప్రపంచంతో లింకులు తెంపేసి, రకరకాల టాస్కులు పెట్టేసి, ఎలిమినేషన్ తగాదాలు సృష్టించేసి, డాన్సులు చేయిస్తూ, ఈమధ్య అశ్లీలపు చేష్టలతో, వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ రకరకాలుగా వినోదాన్ని జనరేట్ చేసే షో… అందరికీ నచ్చకపోవచ్చు కానీ వాటికీ ఓ సెక్షన్ వ్యూయర్స్ ఉంటారు…
నిజానికి దాన్ని మరింత ఎక్స్‌టెండ్ చేసి… ఏదో మారుమూల ప్రాంతానికి చేరవేయడం… అక్కడ ఏదైనా పనులు వెతుక్కుని నాలుగు డబ్బులు సంపాదించుకుని తిండి వెతుక్కోవడం, చీకటిపడేవేళకు ఏదో ఓ గుడిసెలాంటి షెల్టర్ చేరుకుని పడుకోవడం… ఇలాంటి చాలా షోలు కూడా ప్లాన్ చేశారు… చేస్తున్నారు… జనం చూస్తున్నారు… ప్రపంచంలో దాదాపు ప్రతి పాపులర్ టీవీ ఇలాంటి షోలను టెలికాస్ట్ చేస్తుంటుంది… ఏదో ఒక రంగంలో కాస్త పేరుతెచ్చుకున్నవాళ్లను ఎంపిక చేసి, వాళ్ల మధ్య క్రియేట్ చేసే రేస్ అన్నమాట…
Ads
అలాంటిదే రోడీస్ షో… నిజానికి దీన్ని ఫస్ట్ క్రియేట్ చేసింది మన తెలుగువాళ్లే… రేడియో జాకీ అమిత్‌తో కలిసి, మచిలీపట్నానికి చెందిన అంబడిపూడి రఘురాం, రాజీవ్ అనే కవల బ్రదర్స్ 2003లో స్టార్ట్ చేశారు… తరువాత ఎంటీవీ 2014లో టేకోవర్ చేసుకుంది… అది ఎవరిది..? వయాకామ్ వాళ్లది… అది ఎవరిది..? నెట్‌వర్క్18 వాళ్లది… అది ఎవరిది..? రిలయెన్స్ అంబానీది..! వూట్ అనే ఓటీటీ కూడా వాళ్లదే… సో, అంబానీ పుణ్యానికి ఏదీ ఇవ్వడు కదా… అనేక షోలకు డబ్బులు చెల్లించి చూడొచ్చు…
ఈ రోడీస్ షోలో గ్యాంగ్ ఉంటుంది… పలువురు సాహసులను ఎంపిక చేసుకుంటారు… పలు ప్రాంతాలకు పంపిస్తారు… మెంటల్, ఫిజికల్, సోషల్ స్ట్రెంత్ పరీక్షిస్తూ ఉంటారు… దానికోసం రకరకాల టాస్కులు ఉంటాయి… వోట్ ఇన్, వోట్ ఔట్, ఎవిక్షన్స్, పాయింట్స్ గట్రా రకరకాల లెక్కలు ఉంటాయి… ప్రతిసారీ గేమ్‌లో ఛేంజెస్ చేస్తూ ఉంటారు… ఇండియాతోపాటు గతంతో నేపాల్, భూటాన్, అమెరికా, బ్రెజిల్, ఈజిస్టు, కెన్యా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, మలేషియా తదితర దేశాల్లో ఈ షో నడిచింది… ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 18వ సీజన్ నడుస్తోంది… ఇదీ దాని కథ…
ఇక కథకొద్దాం… ఈసారి షోలో సిమి తల్సనియా ఉంది… గతంలో డాన్స్ ఇండియా డాన్స్- సీజన్ 5లో… బెల్లీ డాన్స్ చైనా షోలో కూడా పార్టిసిపేట్ చేసింది… ముంబై డాన్సర్… పోటీలో భాగంగా ఓ టాస్క్… ఏనుగు మలం నుంచి పిండిన నీటిని, మలాన్ని టేస్ట్ చేయాలి… ఆమె చేసేసింది… వెగటుగా ఉంది కదా… వాయిక్… అవును, మన రియాలిటీ షోలు ఎలా వికారపు ధోరణుల్లోకి వెళ్తున్నాయో చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ… ఫోటో చూస్తారా..?
500 పాయింట్లు వచ్చాయట… ఎవిక్షన్ తప్పించుకుని, షోలో కంటిన్యూ అయిపోతోందట… ఇక అసలు కథకొద్దాం… దీనికి సోనూ సూద్ హోస్ట్… ఎస్, ఆ ది గ్రేట్ సోనూయే… ఈ ఎపిసోడ్‌లో సిమి చేసిన ఆ ఘనకార్యాన్ని చూసి థ్రిల్లయిపోయాడట… బ్రేవ్ గరల్ అని సిమిని ప్రశంసించాడు… వావ్, దటీజ్ ది స్పిరిట్ అన్నాడు… అన్నట్టు, టేస్ట్ ఎలా ఉందీ అనడిగాడు… ఆమె వాయిక్, ఛండాలంగా ఉందని బదులిచ్చింది… మంత్రసానితనం ఒప్పుకున్నాక బిడ్డ వచ్చినా పట్టాలి, గడ్డ వచ్చినా పట్టాలి, సోనూ సోదూ తప్పేముంది అంటారా..? అవున్లెండి… ఆ షో హోస్టింగ్ అంటేనే అదొక దిక్కుమాలిన మంత్రసానితనం..!! అన్నీ ఇలాంటి కాన్పులే చేయాలి..!!!
Share this Article