.
నిన్న నాలుగైదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి… స్ట్రెయిట్ సినిమాగా ప్రజెంటర్లు చెప్పుకునే ఓ మలయాళ సినిమా కూడా వృషభ పేరిట వచ్చింది… ఇది పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ… కేవలం తెలుగు, మలయాళం భాషల్లో మాత్రమే వచ్చినట్టుంది…
తెలుగు మార్కెట్‌ను ఎవరూ వదులుకోరు… ఈమధ్య సౌత్ సినిమాలన్నీ హిందీ బెల్టులో తన్నేస్తున్నాయి కదా, అందుకని హిందీ మార్కెట్ జోలికి పోనట్టున్నారు… మోహన్‌లాల్ సినిమా ఇది… తను గొప్ప నటుడే, ఇలాంటి సినిమాల్ని, పాత్రల్ని పరపరా నమిలేయగలడు…
Ads
కానీ… నటి భావన లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు, మరో హీరో దిలీప్‌కు మద్దతుగా నిలబడి, తన సినిమా ప్రమోషన్లకు సహకరించి మలయాళ ఇండస్ట్రీలోనే విమర్శలను ఎదుర్కుంటున్నాడు… ప్రత్యేకించి మాలీవుడ్ లేడీ ఆర్టిస్టులు కడిగేస్తున్నారు బాహటంగా… అందుకని తన తాజా సినిమాపై కొంత ఆసక్తి ఏర్పడింది… అఫ్‌కోర్స్, సినిమాకూ, ఆ వివాదానికీ నేరుగా లంకె లేకపోయినా సరే… హీరో ఎదుర్కునే బ్యాక్ లాష్ ఆ పాత్రపై, ఆ సినిమాపై కూడా కొంత ప్రభావం చూపిస్తుంది…

ఈ వృషభుడి సంగతికొద్దాం… ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం… శాపాలు, రాజులు, బాబాలు, మూఢ నమ్మకాలు, పునర్జన్మలు, దైవిక శక్తులు, మరు జన్మలోనూ కొనసాగే పగలు అన్నీ కలిపి రాసుకున్నారు కథను… ప్లస్ తండ్రీ కొడుకుల అనుబంధాన్ని కూడా కలిపారు… (ఇందులోని స్ఫటికలింగం చోరీ ప్రయత్నాలు ఈమధ్య ఏదో తెలుగు సినిమాలో కూడా చూసినట్టు గుర్తు…)
సో, సహజంగానే మోహన్ లాల్ డబుల్ రోల్… పాతకాలం రాజు ఒకరు… వర్తమానంలో ఓ పెద్ద అంబానీ మరొకరు… కొడుక్కి (సమర్‌జిత్, నయన్ సారిక) ఓ ప్రేమకథ… మోహన్‌లాల్ సినిమా కథ కదా… నిర్మాణ విలువల దగ్గర నో కాంప్రమైజ్… బీజీఎం కూడా వోకే… విజువల్స్ విషయంలో వీఎఫ్ఎక్స్ నాసిరకం అనిపిస్తుంది…
తెలుగు మార్కెట్ కోసమే అన్నట్టుగా ఆలీ, అజయ్, అయ్యప్ప పి శర్మ వంటి నటుల్నీ పెట్టారు ఇందులో… కానీ ప్రధాన పాత్రలన్నీ మలయాళమే… సాధారణంగా కమర్షియల్ మలయాళ సినిమాల్లో కూడా ఎంతోకొంత కథలో, కథనంలో వైవిధ్యం, కొత్తదనం ఉంటుంది కదా… ఇందులో అదేమీ లేదు… పక్కా స్టార్ హీరో తెలుగు సినిమాలాగా నడుస్తుంది…
అందుకే మోహన్‌లాల్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయడు… నిజానికి తనకన్నా సమర్‌జిత్ బెటర్ అనిపిస్తాడు కొన్ని సీన్లలో… (ప్రత్యేకించి గత జన్మ పాత్ర హయగ్రీవగా)…కన్నడనటి రాగిణి ద్వివేది పర్లేదు… ఇంటర్వెల్ ముందు పెద్ద ట్విస్టు… తరువాత సెకండాఫ్‌లో కథనంలో స్పీడ్… సినిమా స్థూలంగా పర్లేదు, అంతేతప్ప మరీ ఎగబడి థియేటర్ వైపు పరుగు తీయాల్సినంత సీనేమీ లేదు..!!
నిర్మాతల్లో ఏక్తాకపూర్ కూడా ఉంది… అందుకే జితేంద్ర ఓ అతిథి పాత్ర… నిజానికి ఈ పాత్ర మేకా రోషన్ చేయాల్సి ఉందట… ఏమైందో గానీ మోహన్ లాల్ వచ్చి చేరాడు ఈ ప్రాజెక్టులోకి… ఏక్తాకపూర్‌కు ఓ చేదు అనుభవం ఇది…

ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదనడానికి పైన వార్తే ప్రూఫ్… బహుశా మోహన్ లాల్ రీసెంట్ కెరీర్‌లో ఇంత ఘోరమైన వసూళ్లు మరో సినిమాకు లేవేమో..!! చివరకు వసూళ్ల సైట్ సాక్‌నిల్క్ కూడా ఈ సినిమాను వదిలేసింది… ఫాఫం..!!
Share this Article