ఒరేయ్, ఆ వెబ్ సీరీస్ జోలికి వెళ్లొద్దురా… వెంకటేశ్ తన ఇజ్జత్ మొత్తం పోగొట్టుకున్నాడు, దిమాక్ లేదు, రానాకు ముందు నుంచే లేదు… మొత్తం బూతులు, వెగటు సీన్లు… ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్ధసంభోగ సినిమా అనుకో… అశ్లీలానికి వెంకీ మామ, అసభ్యతకు రానా పట్టం కట్టారు……. ఇలా అందరమూ నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటున్నాం కదా… సన్నీ లియోన్, మియా మల్కోవాలను కూడా పెట్టుకోకపోయావా అని కడిగేస్తున్నాం కదా…
హహహ… ఇప్పుడు ఆ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్… ఇండియా మాత్రమే కాదు… పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో కూడా నెంబర్ వన్ ట్రెండింగ్… ఐనా ఆ దేశస్థులకు వేరే దిక్కేముంది…? గతంలో కాస్త కష్టం, ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ ఉంటే సరి, బోలెడు ఓటీటీలు… ఇండియన్ సినిమాలు, వెబ్ సీరీస్… మరీ ఇలాంటి సీరీస్ దొరికితే చొంగ కార్చుకుంటూ చూడటమే…
అందరూ తిట్టీ తిట్టీ నెగెటివ్ పబ్లిసిటీ ఇచ్చీ ఇచ్చీ మొత్తానికి ఈ సీరిస్ ట్రెండింగ్‌లోకి రావడానికి పరోక్షంగా సహకరించినట్టు అయింది… ఈ రాతలన్నీ చదివి, ఎంచక్కా రాత్రి పూటో, ఒంటరిగా ఉన్నప్పుడో ఓపెన్ చేసేస్తున్నారు… రానా ఫ్యామిలీతో చూడొద్దని అన్నాడు, ఏదో ఘనకార్యం సాధించినట్టు… వాడి మొహం… ఏవేవో వివరణలు ఇస్తున్నాడు… క్షమాపణలు చెబుతున్నాడు, అదే సమయంలో ఫ్యామిలీతో చూడొద్దు, ఒంటరిగా చూడండి అంటున్నాడు… అంటే ఏమిటి..? ఒక్కరే చూడండి, ఎంజాయ్ చేయండి అంటున్నాడు పరోక్షంగా… అవును మరి, శృంగార, సంభోగ సైట్లను, వల్గర్ ఎక్కువగా ఉన్న సీరీస్‌ను ఒంటరిగానే చూస్తుంటారు కదా…
Ads
కానీ ఐరనీ ఏమిటంటే..? వెంకటేశ్ సినిమాల్ని కూడా ఒంటరిగా చూడాల్సిన దిక్కుమాలిన రోజులొచ్చినయ్… రానా ఏవో పిచ్చి కూతలు కూస్తున్నాడు గానీ వెంకటేశ్ నోటి వెంట మాట లేదు… సిగ్గుపడుతున్నాడో, తలదించుకున్నాడో లేక సీరీస్ ట్రెండింగ్‌లో ఉన్నందుకు ఆనందపడుతూ, రానా నాయుడు సీక్వెల్ కోసం రెడీ అయిపోతున్నాడో… బయటికి మాత్రం కిక్కుమనడం లేదు… ఈ వయస్సులో ఇదేం దరిద్రం అని తిట్టేయకండి… ఫాఫం, ఈ వయస్సులోనే కదా పర్వర్షన్ స్టార్టయ్యేది…
అన్నట్టు ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మాత్రమే కాదు… బహ్రెయిన్, ఖతార్, మాల్దీవ్స్, దుబాయ్, శ్రీలంక, ఒమన్, మారిషస్, కువైట్ దేశాల్లో కూడా ఈ వెబ్ సీరీస్‌ను ఎక్కువ మందే చూస్తున్నారు… నిజానికి ఈ దేశాల్లో పనిచేసే మన ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఈ సీరీస్ చూస్తున్నారని అనుకోవాలి…
ఓవరాల్, వరల్డ్ ర్యాంకింగ్స్, పాయింట్స్ పరిశీలిస్తే మాత్రం చాలా సబ్ స్టాండర్డ్ అని తెలిసిపోతూనే ఉంది… 9 వ ప్లేసు… టాప్‌లో ఉన్న గ్లోరీ సీరీస్ పాయింట్స్ 781 అయితే రానానాయుడు పాయింట్స్ జస్ట్, 108… ఐనా సరే, వెబ్ లెక్కల్లో సినిమా హిట్టయినట్టే… వెంకీ, శరాన్ని ఇంట్లో డీప్ ఫ్రీజులో దాచేసి, ఇక సెకండ్ పార్ట్‌కు రెడీ అయిపో… కమాన్…!!
Share this Article