.
ఆపరేషన్ సిందూర్… అంటే పైశాచిక ఉగ్రమూకల మతదాడిలో, అవును, మతదాడిలో భర్తల ప్రాణాలు కోల్పోయిన మహిళల రక్తతిలకం ఆపరేషన్ సిందూర్…
సిందూర్ అంటే మాంగల్యం, హిందూ మహిళల వైవాహిక స్థితికి సూచిక… అందుకే ఆ పేరు పెట్టారు… అంతేకాదు, పీవోకేపై, అంటే ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల వివరాలను కూడా ఇద్దరు మహిళా ఆఫీసర్లతో మీడియాకు బ్రీఫ్ చేయించింది రక్షణ శాఖ…
Ads
మసూద్ అజహర్ కుటుంబంలో పది మంది హతం… అంటే భారత సైన్యం ఎంత కాలుక్యులేటెడ్‌గా, ఎంత యాక్యురసీతో దెబ్బకొట్టిందో అర్థమవుతూనే ఉంది… నిజానికి పహల్‌గామ్‌కు వచ్చిన దుండగులు మోడీని టార్గెట్ చేసుకుని వచ్చారట… మోడీ పర్యటన రద్దు కాగానే ఆ అక్కసంతా హిందూ పర్యాటకులపై చూపించారు…
ఈ దాడులతో అయిపోయిందా..? ఆల్రెడీ పాకిస్థాన్ రక్షణ మంత్రి కాళ్లబేరానికి వచ్చాడు… నిన్నటిదాకా పిచ్చి కూతలు కూశాడు కదా, ఇండియాలోని ఫేక్ సెక్యులరిస్టుల్లాగే… ఇప్పుడు ఇండియా సంయమనం పాటిస్తే మేమూ వెనక్కి తగ్గుతాం అంటున్నాడు… అక్కడికి ఏదో చేతనైనట్టు..?
ఇప్పుడు మీడియా బ్రీఫింగ్ చేసిన మహిళా ఆఫీసర్లు ఎవరంటే..? ఒకరు… కర్నల్ సోఫియా ఖురేషి… పీజీ బయో కెమిస్ట్రీ… ఐరాస తరఫున కాంగోలో పీస్ మిషన్ ఆర్గనైజ్ చేసింది 2006లో… 2016 పూణెలో జరిగిన 18 దేశాల మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజులో ఇండియన వింగ్‌ను లీడ్ చేసింది…
మరొకరు… వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్… ఇంజనీరింగ్ అయిపోయాక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్ పైలట్… చాలా సీనియర్… ఈ ఇద్దరితో మీడియా బ్రీఫింగ్ ఇప్పించడం వెనుక పెద్ద వ్యూహాలు గట్రా ఏమీ లేవు గానీ… సిందూరం కోల్పోయిన మా మహిళా బాధితుల తరపున మా మహిళా జవాన్లు చాలు మీకు బుద్ది చెప్పడానికి అనే సంకేతం ఇవ్వదలుచుకుంది ఇండియన్ ప్రభుత్వం…
ఇండియా టార్గెట్ చేసి కొట్టిన 9 ఉగ్ర స్థావరాలూ ధ్వంసం అయిపోయినట్టే తెలుస్తోంది… ఎందరు మరణించారనే లెక్క పాకిస్థాన్ ఎలాగూ వెల్లడించదు… ఇండియన్ ఆర్మీ వెళ్లి లెక్కించదు… సో, ఆ అంకె ఎప్పుడూ సరిగ్గా తేలదు… కానీ అప్పుడే అయిపోయిందా..?
పాకిస్థాన్ అన్నీ మూసుకుని కూర్చుంటే… సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్‌లాగే ఇక ఇదిక్కడే స్టాప్… కేవలం ఉగ్రస్థావరాలను కొట్టాము, పాకిస్థాన్ ఆర్మీ ఇన్‌ఫ్రా జోలికి పోలేదు అని ఇండియా చెబుతున్నదీ అంటే అంతే… ఒకవేళ పాకిస్థాన్ గనుక ఓ అడుగు ముందుకేస్తే… ఇక యుద్ధమే… ఇండియా ప్రిపేరయిపోయింది…
పోయి మోడీకి చెప్పుకో అన్నారు కదా…! ఈ దేశ సార్వభౌమత్వానికి సవాల్… ఇంకెలా డీల్ చేయబోతున్నదో వేచి చూడాలి…
Share this Article