ఒక్కటి మాత్రం నిజం… రానా అవసరమైతే ఎంత లోప్రొఫైల్‌లోనైనా ఉండగలడు… సినిమాను బట్టి, పాత్రను బట్టి ఎలాగైనా అడ్జస్ట్ కాగలడు… ఇండస్ట్రీలో అంత పెద్ద కీలకమైన ఫ్యామిలీ… బాహుబలితో బ్రహ్మాండమైన పాపులారిటీ… ఐనాసరే, ఒక్కసారిగా హైఫైలోకి వెళ్లిపోలేదు… తను అరణ్య వంటి పక్కా సాదాసీదా పాత్రలో ఒదిగిపోయాడు… ఓ మల్టీస్టారర్‌లో పవన్ కల్యాణ్‌తో సెకండ్ లీడ్‌లో నటించాడు… ఇగోె మాత్రమే ప్రధానంగా బతికే ఈ ఇండస్ట్రీలో రానా వ్యవహారధోరణి, తత్వం విభిన్నం, అభినందనీయం…
నిజానికి అది కూడా కాదు… విరాటపర్వం సినిమా విషయంలో రానా గురించి కాదు, అందరూ సాయిపల్లవి గురించే మాట్లాడుతున్నారు… ఆమెకు ఆ సినిమా విడుదలకు ముందే బ్రహ్మాండమైన మైలేజీ వచ్చేసింది… సినిమా హిట్టా, ఫ్లాపా వదిలేయండి… అది భవిష్యత్తు… కానీ సాయిపల్లవి ఓ లేడీ పవర్ స్టార్ అయిపోయింది ప్రస్తుతం… అదేదో వైరల్ వీడియోలో ఎవరో సాయిపల్లవి అభిమాని ప్రశ్నలకు రానా జవాబులు కూడా ఇగోలెస్… క్లాప్స్… అదీ చిత్రనిర్మాతల నుంచే ప్రమోషన్‌కు వచ్చేయడం నిజంగా విశేషం…
Ads
‘‘నేను కూడా సాయిపల్లవి ఫ్యానే… సాయిపల్లవి కోసమే సినిమా తీశాంరా బాబూ…’’ అంటున్నాడు… సినిమా మైలేజీ మొత్తం సాయిపల్లవికే వెళ్లిపోతోందనే వీసమెత్తు ఇగోను ప్రదర్శించలేదు రానా… అదీ గుడ్…
ఇక సినిమా సంగతికి వద్దాం… ఇదొక సుదీర్ఘమైన జర్నీ… అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు… మధ్యలో కరోనాతో ఇబ్బందులు అనేది పాక్షికసత్యం మాత్రమే… ఓటీటీ అన్నారు, మళ్లీ వెనక్కిపోయారు, ఇప్పుడు థియేటర్లు అంటున్నారు…
మధ్యలోకి వచ్చాక సురేష్‌కు సినిమా మీద ఎందుకు డౌట్లు వచ్చాయో, భయం ఎందుకు ఆవరించిందో తెలియదు… పలు రీషూట్స్ జరిగాయట… కథ కూడా డైల్యూట్ చేసి ఉంటారు… సరే, ఎలాగోలా రిలీజుకు రెడీ అయ్యారు… కానీ నిజానికి తాజా ట్రెయిలర్ చూస్తుంటే ఓ గందరగోళం అయితే కంటిన్యూ అవుతోంది… దర్శకుడు వేణు రాసుకున్న ఆ వెలుగు కథేమిటో తెలియదు… నిజంగానే నిజామాబాద్ అడవుల్లో అన్నల నిర్వాకంతో చీకట్లో కలిసిపోయిన ఆ వెన్నెల కథేనా ఇది..?
ప్రేమ వేరు, విప్లవం వేరు… రెండింటికీ వేణు ఎలా అంటుకట్టాడో చూడాలి… తను చెప్పే ప్రేమ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది… విప్లవం వ్యవస్థకు సంబంధించింది… వోకే, వేణు నిజాయితీగానే కథను నేచురల్ వేలో ప్రజెంట్ చేస్తాడనే ఆశిద్దాం… తను ఎన్నుకున్న నటీనటులు కూడా మంచి చాయిసే… అయితే సగటు ప్రేక్షకుడిని తన స్థాయి ఆలోచనలకు కన్విన్స్ చేయగలడా..? ట్రెయిలర్ చూస్తుంటే అదే డౌట్ అనిపించింది…
నక్సలిజాన్ని గ్లోరిఫై చేస్తే ఇప్పటి ప్రేక్షకుడు రిసీవ్ చేసుకుంటాడా అనేదీ నిర్మాతల సందేహం అయి ఉంటుంది… పైగా ఇదేమో ప్రేమైక విప్లవం, పోనీ, విప్లవీకృత ప్రేమ… అయోమయంగా ఉందా..? అవును, కథ ఆత్మ మాత్రం స్టిల్ ఒకింత గందరగోళమే… చూడాలిక, దాన్ని ఎలా ప్రజెంట్ చేశాడో… తను లోతైన, గాఢత ఉన్న ఆలోచనలు కలవాడే… ఎటొచ్చీ, కేజీఎఫ్, పుష్ప, ట్రిపుల్ ఆర్ రేంజ్ ప్రేక్షకులకు ఎలా ఎక్కుతుందో చూడాలి…
Share this Article