Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Sam Manek Shah… బడి పాఠాల్లో చదవాల్సిన జీవితం… The Great Indian Soldier…

January 26, 2024 by M S R

మనం మన ఒకప్పటి ఫీల్డ్ మార్షల్ మాణెక్ షాను ఎందుకు గుర్తుచేసుకోవాలి… ఎందుకు ఆయన చిరస్మరణీయుడు… తను వేసుకున్న ఆర్మీ దుస్తులకు అఖండమైన ఖ్యాతిని, గౌరవాన్ని, మర్యాదను, ఖదర్‌ను తెచ్చిపెట్టాడు కాబట్టి… దేశం తనను ఎప్పుడూ మరవకూడదు కాబట్టి… ఒక వ్యక్తిగా, ఒక జవానుగా పరిపూర్ణ జీవితం తనది… ఇప్పుడు తన బయోపిక్ వచ్చింది… ఆ సినిమా జీ5 ఓటీటీలో ఉంది… 130 కోట్ల వసూళ్లతో ప్రేక్షకగణం నీరాజనం పట్టింది… ఆ సినిమా గురించి మరోసారి చెప్పుకుందాం… కానీ నెహ్రూ కుటుంబం అంతటి మహోన్నతుడి పట్ల సరైన విధంగా వ్యవహరించిందా..? సరే, ఓ పాత స్టోరీలోకి వెళ్దాం… నిజంగానే ఆయన కూడా పాకిస్థాన్ మిలిటరీ పెద్దల బాటలో నడిచి ఉంటే మన దేశం ఇప్పుడిలా ‘ప్రజాస్వామిక దేశం’గా ఉండేదా..?


……..  By…. పార్ధసారధి పోట్లూరి…..   1. 1971 లో తూర్పు పాకిస్తాన్ లో [బంగ్లాదేశ్ ] లో హింస చెలరేగింది. ఉర్దూని జాతీయ భాషగా అంగీకరించని తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరగబడడంతో సైన్యం అణిచివేత మొదలుపెట్టింది. దాంతో బంగ్లా ప్రజలు పొరుగునే ఉన్న అస్సాంలోకి శరణార్దులుగా రావడం మొదలుపెట్టారు. రోజురోజుకి సంఖ్య పెరిగిపోతుండడంతో అప్పటి ప్రధాని ఇందిర ఫీల్డ్ మార్షల్ మానెక్ షాని [Field Marshal Sam Hormusji Framji Jamshedji Manekshaw] పిలిపించింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ :

ఇందిర: శరణార్దుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. మనం ఏమీ చేయలేమా ?

మానెక్ షా : అంటే సైన్యం జోక్యం చేసుకోవాలి అని అర్ధమా? అది యుద్ధానికి దారి తీస్తుంది .

ఇందిర; ఫరవాలేదు! మీరు సిద్ధంగా ఉన్నారా ?

మానెక్ షా :లేదు. ఇప్పుడు కుదరదు. నా ఆర్మ్‌డ్ డివిజన్స్ లో ఒకటి ఝాన్సీ బబిత ఏరియాలో ఉంది, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నాకు సమయం కావాలి. ప్లాన్ చేయాలి. ట్రైనింగ్, ప్రిపరేషన్, ట్రూప్స్ కి కావాల్సిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిత్యావసర సరుకులు, ఆర్టిలరీ, యుద్ధ టాంకులు ఇలా చాలా ఉన్నాయి సిద్ధం చేసుకోవడానికి. అదీ కాక మరొక వారం రోజుల్లో వర్షాలు మొదలువుతాయి. అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిన్న చిన్న నదులు కూడా సముద్రాల్ని తలపిస్తాయి. ఒకవైపు నుండి చూస్తే ఇంకో వైపు అసలు ఏమీ కనపడే స్థితి ఉండదు. అలాగే వాతావరణం కూడా మన ఎయిర్ ఫోర్స్ కి సహకరించదు. కింద ఉంటేనే ఏమీ కనపడదు, అలాంటిది ఆకాశంలో పైలట్లకి ఏమీ కనపడదు కింద. ఎయిర్ ఫోర్స్ సహకారం లేకుండా ఆర్మీ ఒక్కటే ఏమీ చేయలేదు. మీరు కనుక యుద్ధానికి ఆదేశిస్తే నా రాజీనామా ఇప్పుడే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఓడిపోయే యుద్ధం నేను చేయలేను కనుక. నన్ను కాదని వేరే వాళ్ళని పంపించినా 100% ఓడిపోతాము మనం.

bangla

Ads

ఇందిరకి తన మాట కాదన్నందుకు కోపం వచ్చింది కానీ శాం మానెక్ షా పనితీరు ఎలా ఉంటుందో తనకి తెలుసు కనుక ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. వర్షాలు తగ్గగానే ఫీల్డ్ మార్షల్ శాం మానెక్ షా పక్కా ప్లాన్ తో తూర్పు పాకిస్తాన్ మీద దాడిచేసాడు. 13 రోజుల్లోనే పాకిస్తాన్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవడానికి కారణం ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా మాత్రమే ! ఇంకొన్ని విషయాలు…

1. శామ్ మానెక్ షా మరియు యాహ్యాఖాన్ లు ఇదరు కూడా బ్రిటీష్ ఇండియా సైన్యంలో కలిసి పనిచేసిన వారే ! విభజన తరువాత యాహ్యాఖాన్ పాకిస్థాన్ సైన్యంతో వెళ్ళిపోయాడు. శామ్ మానెక్ షా శక్తి,సామర్ధ్యం, యుద్ధ వ్యూహాలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తి యాహ్యాఖాన్.

2. 1971 నాటికి యాహ్యాఖాన్ పాకిస్తాన్ నియంత మరియు సైనిక జెనరల్. శామ్ మానెక్ షా డిసెంబర్ 9వ తేదీన 1971 లో పాకిస్తాన్ నియంతని ఉద్దేశించి ఒక మెస్సేజ్ పంపాడు: భారత సైన్యం మిమ్మల్ని చుట్టుముట్టింది. మీరేమీ చేయలేరు. మీ ఎయిర్ ఫోర్స్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. బంగ్లా ముక్తి వాహిని మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. చిట్టగాంగ్, చల్నా, మనగ్లా పోర్టులని బ్లాక్ చేసాము. మీకు బయటి నుండి ఎలాంటి సహాయము అందే ప్రసక్తే లేదు. మీరు బంగ్లా ప్రజల మీద చేసిన క్రూర హత్యలు, అత్యాచారాల మీద చాలా కోపంగా ఉన్నారు. మీరు కాలయాపన చేస్తే మా సైన్యం కూడా రక్షించలేదు మీ సైనికులని బంగ్లా ప్రజల నుండి. ఎందుకు అనవసరంగా ప్రాణాలని బలి పెడతారు. లొంగిపొండి. వెనక్కి వెళ్లి మీ భార్యా పిల్లలతో సుఖంగా ఉండండి… ఇదీ ఆ మెసెజ్….

bangla

ఈ మెసేజ్ యాహ్యాఖాన్ మీద బాగా పనిచేసింది. 93 వేల మంది సైనికుల ప్రాణాలని బలి పెట్టేకంటే లొంగిపోవడమే మేలని బంగ్లాదేశ్ లోని సైనిక కమాండర్ లకి ఆదేశాలు ఇచ్చాడు యాహ్యాఖాన్. ఎందుకంటే యాహ్యాఖాన్ కి శాం మానేక్ షా గురించి బాగానే తెలుసు. ఇటు భారత ప్రభుత్వ ప్రమేయం కంటే ఫీల్డ్ మార్షల్ మానెక్ షా హెచ్చరిక బాగా పనిచేసింది. ఒకవేళ భారత ప్రభుత్వ అధికారులు కనుక హెచ్చరిక చేసి ఉంటే మాత్రం యాహ్యాఖాన్ తన దళాలని పోరాడమనే చెప్పేవాడు.

౩. ఆ విధంగా పాకిస్తాన్ లొంగిపోయింది, 93,000 మంది పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా భారత్ చేతిలో చిక్కారు. కొద్ది వారాల తరువాత జుల్ఫీకర్ ఆలీ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన తరువాత ఇందిరతో రాయబారాలు చేశాడు.

4. ఇందిర, భుట్టోల మధ్య సిమ్లా శాంతి ఒప్పందం కుదిరింది. బేషరతుగా 93,000 మంది పాకి సైనికులని విడిచిపెట్టింది ఇందిర. కనీసం మన సైనికులు పాకిస్తాన్ చేతిలో యుద్ధ ఖైదీలుగా ఉన్నారని కానీ, వాళ్ళని వదిలేయమని కానీ అడగలేదు ఇందిర. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రస్తావన లేనే లేదు ఆ ఒప్పందంలో. అసలు 93 వేల మంది శత్రు సైనికులు మన దగ్గర యుద్ధ ఖైదీలుగా ఉన్నప్పుడు ముందు అడగాల్సింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి. అసలు ఆ సమయం మళ్ళీ మళ్ళీ రాదు కానీ ఇందిర ఆ పని చేయలేదు.

5. ఇందిర, జుల్ఫీకర్ ఆలీ భుట్టోల మధ్య జరిగిన ఒప్పందాన్ని మానెక్ షా ఏమన్నాడో తెలుసా ? ‘‘పాకిస్తాన్ మనల్ని కోతిని చేసి ఆడించింది’’ అని. మనకి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జరిగిన సైనిక, ధన నష్టానికి బదులుగా ఇప్పటికీ బంగ్లాదేశ్ లో సాగుతున్నదేమిటి..? హిందువుల మీద దాడులు, బలవంతపు మత మార్పిడులు.

6. మరో పక్క ఎప్పటికయినా ప్రమాదం అని బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళే దారిలో ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని విస్తరించి బంగ్లాదేశ్ భూభాగం కలుపుకోమని ఇందిరకి అప్పటి సైనిక వ్యూహకర్తలు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు చికెన్ నెక్ ప్రాంతం చాలా ప్రమాదకరంగా మారింది. ఇన్ని తప్పులు చేసి బంగ్లాదేశ్ విముక్తి తన ఖాతాలో వేసుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి తప్పితే వేరే విధంగా ఉపయోగపడలేదు భారతదేశానికి.

7. 1971 లో సాధించిన విజయం కేవలం గంపగుత్తాగా ఫీల్డ్ మార్షల్ మానెక్ షా కే దక్కుతుంది. మరి నాలుగేళ్ల తరువాతే ఎమర్జెన్సీ ఎందుకు విధించింది ఇందిర ? అదే ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణ చేసి బలవంతంగా ‘india secular ‘ అనే పదాన్ని ఎందుకు పెట్టింది ?

bangla

8. 2008 లో ఫీల్డ్ మార్షల్ మానెక్ షా వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో ఊటిలోని హాస్పిటల్ లో చేరితే సైన్యానికి కి చెందిన తోటి జనరల్స్ ని పరామర్శించడానికి సైతం అనుమతి ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ సర్కార్. మానెక్ షాని హాస్పిటల్ కి వెళ్లి యోగక్షేమాలు అడిగింది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రమే. చివరికి మానెక్ షా గారికి రావాల్సిన పాత బాకీలు 1.15 కోట్లు ఆయన చివరి రోజుల్లో చెక్ రూపంలో ఇచ్చారు. అదీ కలాం చొరవతో మాత్రమే. అంత డబ్బుని అన్ని రోజులు ఆయనకి ఇవ్వకుండా ఎందుకు ఆపినట్లు ? కనీసం ఆయన మరణించిన రోజున కానీ, ఆయన అంత్యక్రియలు జరిగిన రోజున కానీ జాతీయ పతాకాన్ని అవనతం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.

9. కలాం వ్యక్తిగా గొప్పోడు… నేను చేయతగిన సాయం ఏమైనా ఉందా అనడిగాడు మానెక్ షాను పరామర్శకు వెళ్లినప్పుడు… అప్పుడు తనకు రావల్సిన బాకీల గురించి చెప్పాడు, తరువాత కలాం చొరవతో వచ్చిన ఆ బాకీ సొమ్మును కూడా సైన్య సంక్షేమ నిధికే ఇచ్చేశాడు… ‘బాధగా ఉందా..? దేనికి బాధ’ అనడుగుతాడు కలాం తనను తిరిగి వెళ్లేటప్పుడు… ‘అవును సర్, ఈ దేశ సుప్రీం కమాండర్ నాకోసం వస్తే లేచి నిలబడి సెల్యూట్ కొట్టలేని స్థితిలో ఉన్నందుకు బాధగా ఉంది’ అంటాడు మానెక్ షా… గ్రేట్ జవాన్… 

10. కృష్ణమీనన్ అనే చవట రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఆర్మీ చీఫ్ తిమ్మప్ప రిటైర్ అవగానే మానేక్ షాని పిలిచి జెనరల్ తిమ్మప్ప మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దానికి మానెక్ షా బదులిస్తూ తోటి జెనరల్ మీద నా అభిప్రాయం ఏమిటో తెలుస్కోవాలనే కుతూహలాన్ని బట్టి చూస్తే మాలో మాకు అభిప్రాయ భేదాలు సృష్టించడానికే అనిపిస్తున్నది. మేము సోల్జర్స్ మి. మీ రాజకీయ ప్రయోజనం కోసం మాలో మాకు తగువులు పెట్టవద్దు. మీరు మా విషయాలలో జోక్యం చేసుకోనంత వరకు మేము మీ విషయాలలో జోక్యం చేసుకోం. Mind your own business and we mind our own business అని బదులిచ్చారు మానెక్ షా! ఒక రక్షణ మంత్రితో ఒక ఫీల్డ్ మార్షల్ ఇలా మాట్లాడడం భారత దేశ చరితలో అదే మొదటిసారి.

bangla

11. మానెక్ షా చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న రోజుల్లో సైనిక తిరుగబాటు జరగవచ్చు అనే వదంతులు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోసారి విక్రం సింగ్ హయాంలో కూడా సైనిక తిరుగుబాటు జరగవచ్చనే వదంతులు వచ్చాయి. ఇలా కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు వదంతులు వచ్చాయంటారు ?

1971 నాటి యుద్ధ సమయానికి ఉన్న ఆయుధాలు అంతకు ముందు ప్రధాని లాల్ బహుదర్ శాస్త్రి హయాంలో కొన్నవే. గాంధీ కుటుంబం మాత్రం విమానాలలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవచ్చు. విమానవాహక నౌకలో విహార యాత్ర చేసుకోవచ్చు. బట్టలు లండలో ఇస్త్రీ చేయించుకొని తెప్పించుకోవచ్చు. ఇందిర చెప్పుల కోసం ప్రత్యేక విమానంలో తెప్పించుకోవచ్చు కానీ సైనికులకి మాత్రం సరయిన బూట్లు, చలి కాచుకోవడానికి దుస్తులు ఇవ్వరు. కానీ తుప్పు పట్టిన తుపాకులతో శత్రువుతో యుద్ధం చేయాలి. నెహ్రూ హయాంలో ఉన్న రక్షణ మంత్రి కృష్ణ మీనన్ శాం మానెక్ షా ని మిలటరీ కోర్టులో దోషిగా నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించి, అంతే తీవ్రంగా విఫలం అయ్యాడు. ఇదీ అసలు ట్రాజెడీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions