.
చాలా చాలా ఆశ్చర్యకరమైన గెలుపు ఇది… సగటు ఇండియా అభిమాని ఆశలు వదిలేసుకున్న మ్యాచును చాలా స్వల్ప మార్జిన్‌తో, ఓ థ్రిల్లర్ తరహాలో గెలిచిన ఇండియా.., ఇంగ్లండ్‌కు సీరీస్ అప్పగించలేదు సరికదా… ఇంగ్లండ్ గడ్డ మీద సీరీస్ సమం చేసింది… తలెత్తుకుంది…
జో రూట్, హారీ బ్రూక్ సెంచరీలు చేసి, ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసి… జస్ట్, అలవోకగా గెలిచేస్తుంది ఇంగ్లండ్ అనుకునే స్థితి నుంచి… మరో 35 పరుగులు చేస్తే… ఇండియా మీద 3-1తో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుందీ అనుకునే స్థితి నుంచి… 367 కు ఆలౌట్ అయిపోయింది… ఆరు పరుగుల తేడాతో ఇండియా గెలిచింది… ఇది టెస్టు మ్యాచుల్లో ఇండియా నారోయెస్ట్ (Narrowest) విన్…
Ads
రిటైర్డ్ హర్ట్ క్రిస్ వోక్స్ కూడా చివరి రోజున… వచ్చీ క్రీజులో నిలబడి లాస్ట్ బ్యాటర్‌కు సపోర్టుగా ఉందామని ట్రై చేసినా… కట్లు కట్టుకుని మరీ నిలబడినా ఫలితం లేకుండా పోయింది..,.
ఇంగ్లండ్ నమ్ముకున్న బాజ్ బాల్ భ్రమల్ని బద్దలు కొట్టేసింది… వాట్ ఏ టెస్ట్ మ్యాచ్… ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4, సెకండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకున్న హైదరాబాదీ సిరాజ్… హీరో ఆఫ్ ది మ్యాచ్… అఫ్‌కోర్స్ ప్రసిద్ధ కృష్ణ కూడా 8 వికెట్లు తీశాడు… అంతా కొత్త కొత్త ఆటగాళ్లు అయితేనేం, ఇండియా జట్టు మంచి ఆటతీరు కనబరిచింది… అక్కడక్కడా కొన్ని నిర్లక్ష్యాలు ఉన్నా సరే…
ఇండియా పెద్దగా స్పిన్నర్లను నమ్ముకోకుండా గెలిచిన ఆట… ఫాస్ట్ బౌలర్లు గెలిపించిన ఆట… యశస్వి, పంత్, రాహుల్, గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్… అండ్ అఫ్ కోర్స్, ఈ సీరీస్‌లో రవీంద్ర జడేజా బౌలర్ కన్నా బ్యాటర్‌గా రాణింపు… వాషింగ్టన్ సుందర్ కూడా..!
మూడో టెస్టు మ్యాచు కేవలం 22 పరుగులతో ఓడిపోయి… నాలుగో టెస్టులో పోరాడి డ్రా చేసుకుని… ఇప్పుడు గెలిచి… భలే పుంజుకుంది ఇండియా… ఇంగ్లండ్ పదే పదే బాజ్ బాల్ పేరిట దూకుడు స్ట్రాటజీ కనబరిచి, పలు దశలో ఇండియా మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించినా సరే, ఇండియా మాత్రం ఓపికను కనబరిచింది…
ఎక్కడా ఆశలు కోల్పోకుండా పోరాడింది… చివరకు సీరీస్ సమం… ఒకరకంగా… సింపుల్‌గా చెప్పాలంటే… నిజానికి ఇండియా గెలిచినట్టు సీరీస్‌ను… ఎక్కడా నమ్మకాల్ని, ఆశల్ని, పట్టుదలను కోల్పోకుండా..!! కెప్టెన్ శుభమన్ గిల్, తను వ్యక్తిగత రికార్డులను క్రియేట్ చేసుకోవడంతోపాటు ఇండియాకు మరో సమర్థుడైన కెప్టెన్ దొరికాడని అనిపించుకున్నాడు..!!
సిరీస్ లో 7000+ పరుగులు ఒక రికార్డు, 9 మంది 400+ చేసారు… ముగ్గురు ఇండియన్స్ గిల్, రాహుల్, జడేజా 500+ చేసారు… గిల్ ఒక్కడే 754 పరుగులతో టాప్… ఇంగ్లండ్ బాజ్ బాల్ కోసం బ్యాటింగ్ పిచ్చులు తయారు చేసిన ఫలితం ఇది…!
Share this Article