‘కొత్తతరం భారతీయ నిర్మాతలకు పాయల్ కపాడియా ఒక స్పూర్తి’ అని అభినందించాడు ప్రధాని మోడీ… ఇంట్రస్టింగ్… ఎందుకో తెలియాలంటే ఆమె పూర్వరంగం, వర్తమాన విజయం తెలిసి ఉండాలి…
పాయల్ కపాడియా… ముంబైలో పుట్టింది… ఏపీలోని రిషి వ్యాలీ స్కూల్‌లో చదువుకుంది… పెయింటర్, వీడియో ఆర్టిస్ట్ మనాలి నళిని బిడ్డ ఆమె… ప్రసిద్ధ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) విద్యార్థి ఆమె…
2015… అప్పుడామె అందులోనే శిక్షణ పొందుతోంది… గజేంద్ర చౌహాన్ అనే ఓ మాజీ టీవీనటుడు, రాజకీయవేత్తను చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం ఆ సంస్థకు… దాంతో విద్యార్థులు భగ్గుమన్నారు… నిరసనలకు దిగారు… సింపుల్, పొలిటిషియన్లను కాదు, ఎవరైనా సరే ఆర్టిస్టులను పెట్టండి అని… పైగా గజేంద్ర చౌహన్‌కు అంత మంచి పేరు కూడా ఏమీ లేదు…
Ads
139 రోజులపాటు సాగింది ఆందోళన… క్లాసులకు వెళ్లకపోతే అనేకమందికి హాస్టళ్లను ఖాళీ చేయాలని నోటీసులిచ్చారు… ఓసారి సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ పత్రాబేను ఘెరావ్ చేస్తే పోలీసులు కేసులు పెట్టారు… కొందరిని అరెస్టు చేశారు అర్దరాత్రి… ఇదే పాయల్ కపాడియా పేరు కూడా చార్జి షీటులో ఉంది… ఆమె వెరవలేదు… గజేంద్ర గ్యాంగు ఆమెను నిందిస్తూ… ‘పాకిస్థాన్ వెళ్లిపో’ అంటూ జాతివ్యతిరేక ముద్రలు కూడా వేసింది… కాషాయ శిబిరం నిర్ణయాల్ని వ్యతిరేకిస్తే వచ్చే మొదటి స్పందన ఇదే కదా… ‘గో టు పాకిస్థాన్…
ఆమె స్కాలర్ షిప్ రద్దు చేశారు… ఆ బ్యాచ్ విద్యార్థుల ప్రాజెక్టులన్నీ పునస్సమీక్షకు పంపించబడ్డాయి… డిసిప్లినరీ యాక్షన్స్, ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ నుంచి తరిమివేత… అన్నిరకాలుగా వేధించారు… సీన్ కట్ చేస్తే…
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించబడే గ్రాండ్ ప్రి గెలుచుకుంది ఆమె… (మొన్న మన భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఒక కేటగిరీలో ఉత్తమనటి అవార్డు పొందిన విషయం గుర్తుంది కదా…) All we imagine as light అనే చిత్రానికి పాయల్ కపాడియాకు దక్కిన పురస్కారం…
అందుకే మోడీ ప్రశంస వార్త చదవగానే కాస్త నవ్వొచ్చింది… ఒకప్పటి జాతి వ్యతిరేకి, ఇప్పుడు జాతి గర్వకిరణం అయినందుకు… ఆమె ప్రస్థానం ముచ్చటేసింది… A night knowing nothing అనే డాక్కుమెంటరీకి 2021లో గోల్డెన్ ఐ అవార్డు కూడా పొందింది ఆమె…
అవార్డులు ఆమెకు కొత్తేమీ కాదు… ఒక సృజనశీలి… Aften Noon Clouds అని చిత్రం 2017 కేన్స్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక ఇండియన్ సినిమా… ఆ సినిమా కూడా ఆమెదే… ఆమె నిర్మాత, దర్శకురాలు, స్క్రీన్ రైటర్, ఎడిటర్… కాకపోతే కమర్షియల్ మూవీస్ ఆమె జానర్ కావు… కొంతకాలం ముంబైలో అడ్వర్టయిజ్ ఇండస్ట్రీలో పనిచేసింది… వీడియో ఆర్టిస్టులకు అసిస్టెంట్‌గా పనిచేసేది… ఏదైతేనేం… కేన్స్‌లో మన జెండా ఎగరేసింది..!!
Share this Article