.
Pardha Saradhi Potluri …. స్పై ఏజెన్సీ అంటే మోస్సాద్ లా ఉండాలి! దాని చాలా ఆపరేషన్స్, కమిట్మెంట్ గురించి చాలా విన్నాం, చదివాం కదా, ఇది మరీ విస్మయకరం…
IRGC ( Iran Revolutionary Gaurds Corps ) ఖుద్స్ ఫోర్స్ (Quds Force ) కమాండర్ జెనరల్ ఇస్మాయిల్ ఖాని (Esmail Qaani ) క్షేమముగా ఇజ్రాయెల్ చేరుకున్నాడు!
Ads
Yes..! IRGC ఖుద్స్ ఫోర్స్ కమాండర్ జెనరల్ ఇస్మాయిల్ ఖాని నిజానికి మోస్సాద్ ఏజెంట్! ఇది గూఢచార చరిత్రలోనే, అది ఏ దేశ స్పై ఏజెన్సీ అయినా కావొచ్చు మోస్సాద్ ఒక అద్భుతం అనే చెప్పాలి!
జెనరల్ ఇస్మాయిల్ ఇచ్చిన సమాచారం వల్లనే హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హానియా, హెఙబొల్లా టాప్ లీడర్స్ నజరల్లాహ్, సఫీయుద్దీన్ లని ఇజ్రాయేల్ మట్టుబెట్టగలిగింది!
Well..! 2024 అక్టోబర్ లో దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయేల్ చేసిన వైమానిక దాడిలో IRGC ఖుద్స్ ఫోర్స్ జెనరల్ ఇస్మాయిల్ ఖాని కూడా చనిపోయారు అని వార్తలు వచ్చాయి!
లేదు, ఇస్మాయిల్ ఖాని దేశద్రోహనికి పాల్పడ్డాడు అని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతోల్లా అలీ ఖోమేని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నాడు అనే వార్త కూడా గత అక్టోబర్ నుండి ప్రచారంలో ఉంది… అంతే తప్ప నిజంగా ఇజ్రాయేల్ దాడిలో చనిపోయాడా లేక బందీగా ఇరాన్ లోనే ఉన్నాడా అన్నది ఎవరూ కనుక్కోలేక పోయారు!
కానీ అనూహ్యంగా ఇస్మాయిల్ ఖాని ఇజ్రాయేల్ లో క్షేమంగా ఉన్నాడని మరియు 2024 అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయేల్ దక్షిణ బీరూట్ మీద దాడికి ముందే ఇస్మాయిల్ ఖానిని టెల్ అవీవ్ కి తరలించిందని తెలుస్తున్నది!
So..! ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడికి సన్నద్ధం అవుతున్న వేళ ఖోమేని నమ్మిన బంటు ఇస్మాయిల్ ఖాని ఇజ్రాయేల్ లో క్షేమంగా ఉన్నాడని వార్త రావడం ఖోమేనితో పాటు ఇరాన్ సైన్యాన్ని ఆత్మరక్షణలో పడవేస్తుంది అన్నది నిజం!
ఇస్మాయిల్ ఖాని దగ్గర IRGC గురుంచి అత్యంత విలువైన సమాచారం ఉంటుంది కదా! అట్టుంటది మరి మోసాద్‌తోని..!!
Share this Article