22 వేల కోట్ల రూపాయల వసూళ్లు… 1818 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వచ్చిన కలెక్షన్లు 22 వేల కోట్లు… ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అత్యధిక కలెక్షన్ల సినిమా అదే… నంబర్ వన్… నిజానికి అది కాదు… వసూళ్ల కథ పక్కన పెట్టండి… ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను చూసినవారి సంఖ్యకు లెక్కలేదు… త్రీడీ, 8కే సహా అందుబాటులో ఉన్న ప్రతి ఆధునిక టెక్నాలజీలోనూ చూశారు… అభిమానించారు… పిల్లలు, పెద్దల తేడా లేదు… ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోయాడు జేమ్స్ కామెరూన్ అందరినీ…
తను వాడిన గ్రాఫిక్స్ అల్టిమేట్… ఆ స్థాయి వేరే దర్శకులెవరికీ చేతకాలేదు… సైన్స్ ఫిక్షన్ కోణం కాదు… అదొక భావాతీత ఉద్వేగం… అర్థమైంది కదా మనం చెప్పుకుంటున్నది అవతార్ సినిమా గురించే… ఒక సినిమాను గరిష్ఠ స్థాయిలో ఎంజాయ్ చేయించిన టెక్నికల్ ఖండిక అది… ఎన్నేళ్లు కష్టపడ్డారు, ఏయే టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారనే అంశం మీదే వేల కథనాలు, వేల వీడియోలు, వేల ఇంటర్వ్యూలు వచ్చాయి… అదీ దాని రేంజ్…
Ads
అది 2009లో విడుదలైంది… పదమూడు, పద్నాలుగేళ్లుగా ఒక సినిమా సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఇంత ఆతృతంగా ఎదురు చూస్తున్న తొలి సినిమా ఇదే… ఎస్, ఈ హైప్, ఈ బజ్, ఈ ఇంట్రస్టుకు కారణం అవతార్ ఫస్ట్ పార్ట్… దాని విజయం… అద్భుతమైన కల గంటాడు కామెరూన్… ఆ కలలోకి మనల్ని తీసుకుపోతాడు… ఆ కలను అబ్బురపరిచేట్టు ఆవిష్కరిస్తాడు… కాసేపు ఆ లోకంలో మనల్ని వదిలేస్తాడు… మనం ఊహించని స్వప్నాంశాలు అవి… అందుకే ఆ థ్రిల్…
ఎస్, ఒక బాహుబలి రెండో పార్ట్‌కు అద్భుతమైన బజ్ క్రియేటైంది దాని ఫస్ట్ పార్ట్ విజయంతోనే… కేజీఎఫ్-2 దుమ్మురేపు విజయానికి కారణం కూడా ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన విజయకేతనాలే… నిజానికి ఈ రెండు సినిమాల విషయంలో మొదటి భాగాలే బాగుంటాయని ఓ జనాభిప్రాయం… అయితేనేం… వసూళ్లు దుమ్ము రేపాయి… ఓ పాజిటివ్ బజ్ సాధించే విజయానికి అవి నిదర్శనాలు… అయితే..?
అవతార్, ది వే ఆఫ్ వాటర్ అని పేరు ఖరారు చేశారు… డిసెంబరులో విడుదల చేస్తామనీ ప్రకటించారు… త్వరలో ట్రెయిలరో, ఇతర ప్రచార చిత్రాలో రిలీజ్ చేస్తారు… ప్రపంచంలోని ప్రతి థియేటరూ ఎదురుచూస్తోంది ఆ సినిమా ప్రదర్శించాలని..! టూడీ, త్రీడీ, ఐమ్యాక్స్, డోల్బీ, 4కే ఇవన్నీ పాతబడ్డయ్… ఫోర్ డీ ఫార్మాట్ కూడా రెడీ చేస్తున్నారట… అదేమిటో చూడాలిక…
టైటానిక్, టర్మినేటర్, అవతార్, ఏలియెన్స్… అన్నీ సంచలనాలే జేమ్స్ కామెరూన్‌వి… ఈ అవతార్ కూడా అయిదు భాగాలుగా తీస్తానని ప్రకటించేశాడు… ఏమో, వయస్సు సహకరిస్తే తీస్తూనే ఉంటాడు… 67 ఏళ్ల ఈ కెనడియన్ మొదట్లో ట్రక్ డ్రైవర్‌గా, బిల్డింగ్ కేర్‌టేకర్‌గా కూడా పనిచేశాడు… మరి ఇప్పుడు..? రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్… అన్నింట్లోనూ ప్రవేశం ఉంది… పరిణతి ఉంది… చివరగా :: ఆయన ఖాతాలో ఇప్పటికి అయిదు పెళ్లిళ్లు..!!
Share this Article