ఈ టీవీ డిబేట్లలోని ‘నిపుణుల’ భీకరమైన వాదనలను కాసేపు పక్కన పెట్టేయండి… చానెళ్ల గొట్టాల అర్ధపాండిత్యపు ప్రేలాపనల్ని కూడా కాసేపు వదిలేయండి… డ్రగ్ మాఫియా చేసే కుట్రల్ని కూడా కాసేపు విస్మరిద్దాం… మీ ఆయుష్ డైరెక్టర్ చెబుతున్నాడు కదా… ఆనందయ్య మందు హానికరం కాదు, ఆ ముడిసరుకులు కూడా ఎప్పుడూ వాడేవే, దీన్ని ఆయుర్వేదం అనడం లేదు, మూలికావైద్యమే అందాం, కానీ ఇది ప్రమాదకరం మాత్రం కాదు… ఇదే కదా ఆయన చెబుతున్నది… అంతకుముందు వేసిన కమిటీ కూడా అదే రిపోర్టు కదా ఇచ్చింది… ఆయన మందు ఇచ్చిన 63 వేల మంది నుంచి ఒక్క చిన్న కంప్లయింట్ లేదు కదా… అలాంటప్పుడు జగన్ ఒక పని ఎందుకు చేయకూడదు…? ఆనందయ్య మీద ఉన్న ప్రధాన అభ్యంతరం ఆయన క్వాలిఫైడ్ కాదు అని… నిజానికి వారసత్వంగా మూలికావైద్యవిద్యను పొందేవారికి వేరే క్వాలిఫికేషన్ ఏమీ ఉండదు… జనం ఇచ్చేదే సర్టిఫికెట్… ఇప్పుడు ఆనందయ్యకు వేల మంది ఇస్తున్నదీ సర్టిఫికెటే… ఐనాసరే…
Ads
మీ ఆయుష్ టీం నుంచే కొందరు నిపుణుల్ని పెట్టండి… మీరే ముడిసరుకులు తెప్పించండి… ఆయన చెప్పినట్టే వండండి… అందరూ ఓ ఏకాభిప్రాయానికి వచ్చి డోస్ నిర్ణయించండి… పోలీసుల్ని పెట్టి, బారికేడ్లు పెట్టి, సీరియస్ వాళ్లకు కూపన్లు ఇచ్చి, రమ్మనండి… కూపన్లు లేని వాళ్లను ఊళ్లోకే రానివ్వకండి… రైట్… నష్టమైతే లేదు, పనిచేస్తే చేసింది, లేకపోతే నాలుగు రోజులకు జాతర ఖాళీ… అంతే కదా… పైగా ఆనందయ్య ఎవరు..? రెండు తరాలుగా అక్కడే మూలికావైద్యం చేసుకుంటున్న కుటుంబమే… పైగా తను మాజీ సర్పంచి… మొన్నటి ఎన్నికల్లో ఎంపీటీసీగా కూడా గెలిచాడట… అధికార పార్టీయే… (ఫలితాలు ప్రకటించలేదు, లీగల్ వివాదంతో ఎన్నికలు సందిగ్ధంలో పడ్డాయి కదా…) థాంక్ గాడ్… ఏపీ పాలిటిక్స్ తాలూకు కంపు తన మీద ప్రభావం చూపించకుండా ఉండటానికి… ఎలాగూ తను రెడ్డి, కాపు, కమ్మ, రాజు కాదు… యాదవ్… అధికార పార్టీ వాళ్లందరికీ తెలిసినవాడే… అంటే తను మోసగాడు కాదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం… అలాగే తను వైసీపీ అయినా సరే, టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు… ఎందుకంటే… ఆ వ్యక్తి గురించి తెలుసు, ఆ మందు గురించి తెలుసు కాబట్టి… ఎలాగూ నెల రోజులుగా కొన్ని వేల మందికి నష్టమేమీ జరగలేదు కాబట్టి, ఇక ముందు కూడా జరగదన్నట్టే కదా… (మందు ఆగిపోయిన చివరిరోజు ఆయన 4 వేల మందికి ఐడ్రాప్స్ తయారు చేస్తే, అందులో 1000 పోలీసులు, 500 వైసీపీ వాళ్లు తీసుకున్నారు… అది నష్టదాయకమే అయితే వాళ్లు ఎందుకు తీసుకున్నారు..?)
Share this Article