Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిష్ణోయ్ గ్యాంగ్..! సల్మాన్‌ ఖాన్‌కే కాదు, ఏకంగా కెనడా ప్రధానికీ పూర్తిగా సమజైంది…

October 17, 2024 by M S R

.

లారెన్స్ బిష్నోయి Vs సల్మాన్ ఖాన్!
గత శనివారం అక్టోబర్ 12 న NCP నాయకుడు బాబా సిద్ధికి (Baba Siddiqui ) ముంబైలోని బాంద్రాలో తన కొడుకు కాంగ్రెస్ mla అయిన జీషన్ ఇంటి నుండి బయటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చనిపోయాడు!

బాబా సిద్ధికి మొదటిన్నుండి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇటీవలే కాంగ్రెస్ కి రాజీనామా చేసి NCP లో (అజిత్ పవార్ ) చేరాడు. సిద్ధికి కొడుకు జీషన్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి వెస్ట్ బాంద్రా నుండీ గెలిచాడు.

Ads

దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధికి చనిపోగా జీషన్ కొద్దిలో తప్పించుకున్నాడు! అనుమానంతో బాంద్రా పోలీసులు ముగ్గురొని అరెస్ట్ చేసి, విచారించి ఆధారాలు లేవని వదిలేశారు! కానీ కాంగ్రెస్ మాత్రం సిద్ధికి హత్యకి కారకుడు లారెన్స్ బిష్నోయి అని ఆరోపిస్తున్నది.

అయితే బిష్నోయికి చెందిన వారుగా భావిస్తున్న ఒకరు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు ఇలా…. ఓమ్! జై శ్రీరామ్! జై భారత్! సల్మాన్ ఖాన్, మాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ నువ్వే కోరి మాతో శత్రుత్వం పెంచుకున్నావు.

బాబా సిద్ధికి హత్య చేయడానికి కారణం సల్మాన్ ఖాన్ తో, దావూద్ ఇబ్రహీంతో, అనుజ్ తపన్ తో సంబంధాలు ఉండడమే. బాలీవుడ్ మాఫియా మరియు దావూద్ తో మాత్రమే మా యుద్ధం! ఈ శరీరం, సంపద అనేవి మాకు దుమ్ము, ధూళితో సమానం!

బాబా సిద్ధికి ఇప్పుడు మంచివాడుగా కనిస్తుండవచ్చు కానీ గతంలో ఇదే బాబా సిద్ధికి మోకా చట్టం ( Maharashtra Control of Organised Crime Act ) దావూద్ తో కలిసి నిర్భంధంలో ఉన్న సంగతి మరిచిపోయారా?

సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే వాళ్ళు మా టార్గెట్ లో ఉంటారు! దావూద్ గ్యాంగ్ తో కలిసి పనిచేసే వాళ్ళు మా టార్గెట్ లో ఉంటారు! సిద్ధికి హత్యకి ప్రతీకారంగా మా అనుచరులలో ఎవరైనా మరణిస్తే దానికి ప్రతీకారం తీర్చుకుంటాం! జైశ్రీరామ్! జై భారత్!…… అంటూ ఆ ఫేస్బుక్ పోస్ట్ లో ఉంది. ఆ పోస్ట్ వైరల్ అయ్యింది బాగా!

So! లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ సిద్ధికిని హత్య చేసింది అని తెలుస్తున్నది! అయితే కేవలం ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా ఒక క్రిమినల్ కేసుని నడపలేరు పోలీసులు. మహారాష్ట్రలో రాజకీయ హత్య జరిగి 30 ఏళ్ళు అవుతున్నది.

బీజేపి mla లు అయిన రామ్ దాస్ నాయక్ ( Bandra ) మరియు ప్రేమ్ కుమార్ శర్మలు (Khetwadi ) హత్య చేయబడ్డారు 1990 దశకంలో. ఇక శివసేనకి చెందిన mla లు అయిన విఠల్ చవాన్, రమేష్ మోరెలు కూడా అదే సమయంలో హత్య చేయబడ్డారు. కాంగ్రెస్ మాత్రం లా అండ్ ఆర్డర్ లేదు మహారాష్ట్రలో అని ఆరోపిస్తున్నది. అప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్.

 

********
ఎవరీ లారెన్స్ బీష్నోయి?
వివరాలలోకి వెళ్లేముందు 28 సంవత్సరాల వెనక్కి వెళితే కానీ విషయం బోధపడదు.

1998, సెప్టెంబర్ 16

రాజస్థాన్ లోని బవాద్ (Bawad ), మథానియా (Mathaniya ), జోధపూర్ జిల్లా.

సూరజ్ బర్జాత్యా సినిమా ‘హమ్ సాత్ సాత్ హై ‘ (Hum Sath sath Hai ) షూటింగ్ జరుగుతున్నది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం తదితరులు తారాగణం.

షాట్ గ్యాప్ లో మారుతి జీప్సీలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం దగ్గరలోని కంకని గ్రామం పొలాల వైపు వెళ్లారు. అక్కడ కృష్ణ జింకల ( Black Bucks ) సమూహం చూసి సల్మాన్ ఖాన్ తుపాకితో రెండు కృష్ణ జింకలని కాల్చి చంపాడు!

రాజస్థాన్లోని జోధ్ పూర్ జిల్లాలో బిష్నోయి ( Bishnoi) ప్రజలు ఉంటారు. బిష్నోయి ప్రజలు కృష్ణ జింకలని చంపడం మీద తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు.

1998,సెప్టెంబర్ 28 న అదే సినిమా యూనిట్ షూటింగ్ జరిగింది. ఈసారి ఘోడ (Ghoda farms ) దగ్గర మరో కృష్ణ జింకని కాల్చి చంపాడు సల్మాన్ ఖాన్. మరోసారి బిష్నోయి సమాజం వారు తీవ్ర నిరసన తెలిపారు. వాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు? 1998,అక్టోబర్ 12 న జోధ్ పూర్ పోలీసులు సల్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు.

********
ఏప్రిల్ 10, 2006 న ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా పరిగణిస్తూ 5 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కృష్ణ జింకలు అంతరించిపోతున్న వన్య ప్రాణి జాబితాలో ఉండడం వలన వాటిని వేటాడడం, గాయపరచడం అనేది వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తారు!

*******
ఆగస్టు 24, 2007 జోధ్ పూర్ జిల్లా కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పు ని సమర్థిస్తూ సల్మాన్ ఖాన్ పిటిషన్ ని కొట్టివేసింది.అందరూ సల్మాన్ ఖాన్ 5 ఏళ్ళు జైల్లో గడుపుతాడు అనుకున్నారు. సల్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు కానీ సల్మాన్ ఖాన్ రాజస్థాన్ హై కోర్టులో అప్పీల్ చేశాడు.

ఆగస్టు 31, 2007 న ట్రయల్ కోర్టు , జిల్లా కోర్టులు ఇచ్చిన తీర్పులని రాజస్థాన్ హైకోర్టు నిలిపివేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు అనే నిబంధన విధిస్తూ బెయిల్ ఇచ్చింది. ఇదే కోర్టు సల్మాన్ ఖాన్ అక్రమంగా తుపాకి కలిగి ఉన్నాడు అనే కేసుని కొట్టివేసింది. అయితే విచారణ కొనసాగుతుంది అని వాయిదా వేసింది. వారం తరువాత సల్మాన్ ఖాన్ జైలు నుండీ విడుదల అయ్యాడు.

**********
ఇలా ఒక కోర్టు నుండీ మరో కోర్టుకి కేసు మారుతూ వస్తున్న్నది కానీ ఇప్పటి వరకూ విచారణ పూర్తి కాలేదు.

ట్రయల్ కోర్టు వేసిన శిక్షని సవాలు చేస్తూ జోధ్ పూర్ జిల్లా కోర్టులో అప్పీల్ చేయడం, జిల్లా కోర్టు ట్రయల్ కోర్టు తీర్పుని సమర్ధించడం, దాని మీద సల్మాన్ హైకోర్టులో అప్పీల్ చేయడం హైకోర్టు శిక్ష రద్దు చేయడం… దీనిమీద రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లడం, మళ్ళీ విచారణ చేయమని సుప్రీం కోర్టు ట్రయల్ కోర్టుని ఆదేశించడం, ట్రయల్ కోర్టు గతంలో తాను ఇచ్చిన తీర్పుని సమర్ధించడం, చివరికి కేసుని త్వరగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగాయి.

1998 లో జరిగిన నేరం మీద ఇప్పటికీ శిక్ష ఖరారు చేయకపోవడం ఏదైతే ఉందో అది మన న్యాయ వ్యవస్థ పని తీరు ఎలా ఉందో అర్ధం అవుతున్నది.

*********
బిష్నోయి సమాజం!
బిష్నోయి సమాజం ని 16 శతాబ్దంలో గురు జంబేశ్వర్ స్థాపించాడు!
బిష్నోయి ప్రజలు జోధ్పూర్, బికనేర్ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటారు.

బిష్నోయి లేదా విష్నోయికి సముచితమైన అర్ధం ఉంది!

బిష్ అంటే 20 అని అర్ధం.హిందీ లో బీస్.
నోయి అంటే 9 అని అర్ధం.హిందీలో నౌ.

గురు జంబేశ్వర్ 20+9=29 సూత్రాలని ప్రతిపాదించాడు!

విష్ణువుని ఆరాధిస్తారు! కాబట్టి విష్నోయి అని కూడ అంటారు.

గురు జంబేశ్వర్ స్థాపించిన బిష్నోయి వైష్ణవ సాంప్రదాయంని అందరూ నిష్ఠగా పాటిస్తారు.

బిష్నోయి సమాజంలో అన్ని కులాల వారు, జాతుల వారు ఉంటారు.

పూర్తిగా శాకాహారులు! వృక్ష సంరక్షణ, జంతు సంరక్షణ, పర్యావరణ రక్షణ కోసం ప్రాణాలు ఒదులుతారు!
1730 లో అప్పటి జోధ్ పూర్ మహారాజా గారు చెట్లను నరికి తెమ్మని ( అకేసియా – కనివింద ) సైనికులని పంపిస్తే ఆ చెట్లని కాపాడడం కోసం వందల మంది బిష్నోయిలు సైనికులని ఎదిరించి ప్రాణాలు వదిలారు.

బిష్నోయిలు నీలం రంగుని వాడరు! నీలం రంగు కోసం చెట్లని నరకాలి కాబట్టి నిషేధం.
బిష్నోయి ప్రజలకి ఇంటి పేర్లు ఉండవు. ఇంటి పేరు బదులు బిష్నోయి ఉంటుంది.

********
1998 లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలని చంపినపుడు లారెన్స్ బిష్నోయి వయస్సు 5 ఏళ్ళు. పుట్టింది పంజాబ్ లోనే అయినా బిష్నోయి సమాజంలో సభ్యుడు.

కృష్ణ జింకలని చంపాడు అని సల్మాన్ ఖాన్ మీద పగ పట్టాడు లారెన్స్ బిష్నోయ్! లారెన్స్ బిష్నోయి 2011 లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసి విద్యార్థి రాజకీయాలలో ప్రవేశించాడు! అప్పుడే గోల్డి బ్రార్ (సతీందర్ జిత్ సింగ్ ) పరిచయం ఏర్పడింది. లారెన్స్ బిష్నోయి, గోల్డి బ్రార్ నేర సామ్రాజ్యంకి పునాది 2011 లో పంజాబ్ యూనివర్సిటీలో పడింది!

2022 లో పంజాబ్ ర్యాప్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య జరిగినపుడు లారెన్స్ బిష్నోయి పేరు దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది! లారెన్స్ బిష్నోయి అనుచరుడు గోల్డ్ బ్రార్ సిద్ధూ మూసేవాలా హత్య నేనే చేశాను అని ప్రకటించాడు!

********

లారెన్స్ బిష్నోయి, goldi బ్రార్ – ఖలిస్థాన్ లింక్! లారెన్స్ బిష్నోయి, గోల్డి బ్రార్ లకి ఖలిస్థాన్ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సాతో సంబంధాలు ఉన్నాయి.

గోల్డి బ్రార్ స్టూడెంట్ వీసాతో కెనడా వెళ్లి అక్కడ బబ్బర్ ఖల్సా టెర్రరిస్ట్ లతో కలిసి పనిచేసాడు. అయితే గోల్డి బ్రార్ మీద కెనడా పోలీసులు కేసు నమోదు చేయడంతో అక్కడి నుండీ పారిపోయాడు!

ఇంతవరకు గోల్డి బ్రార్ ఆచూకి తెలియదు అటు కెనడాకి కానీ ఇటు భారత NIA కి కానీ. ఇక 2015 లో లారెన్స్ బిష్నోయిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుండీ పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ జైళ్ళ లో ఉంటున్నాడు. మొత్తం 40 క్రిమినల్ కేసులు ఉన్నాయి లారెన్స్ బిష్నోయి మీద. ట్రాన్సిట్ వారంట్ మీద గుజరాత్ లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నాడు.

*********
క్షమాపణలు చెపితే వదిలేస్తాం!

కృష్ణ జింకలని చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కనుక బిష్నోయి సమాజానికి క్షమాపణ కోరితే వదిలేస్తామని చెప్పినా సల్మాన్ మొండికేసాడు! అందుకే లారెన్స్ బిష్నోయి సల్మాన్ ని చంపుతాను అని ప్రకటించాడు!

2022 లో లారెన్స్ బిష్నోయి తమ్ముడు అన్మోల్ బిష్నోయి సల్మాన్ ఖాన్ ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ మీదకి కాల్పులు జరిపాడు! ఏప్రిల్ 2024 లో సల్మాన్ ఖాన్ కి చంపుతాము అంటూ బెదిరిస్తూ లెటర్ పంపించాడు లారెన్స్ బిష్నోయి! చివరికి సల్మాన్ ఖాన్ కి ఆప్తుడు అయిన బాబా సిద్ధికిని కాల్చి చంపారు.

అన్మోల్ బిష్నోయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది NIA డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో! లారెన్స్ బిష్నోయి, తమ్ముడు అన్మోల్ లు ఇద్దరూ జైల్లోనే ఉన్నారు! లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ లో మొత్తం 700 మంది ఉన్నారు. వీళ్ళలో గురి తప్పకుండా కాల్చగలిగే షార్ప్ షూటర్లు 70 మంది ఉన్నారు.

********
దావూద్ ఇబ్రహీం – లారెన్స్ బిష్నోయి!

దావూద్ జైల్లో ఉన్నా, పాకిస్థాన్ పారిపోయి అక్కడే ఉన్నా ముంబై నేర సామ్రాజ్యంలో ఏ మాత్రం మార్పు లేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ళు జరిగిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి శరద్ పవార్ అండతోనే దావూద్ ముంబై నుండీ పాకిస్తాన్ వెళ్ళగలిగాడు! కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది!

ఇప్పుడు లారెన్స్ బిష్నోయి కూడా జైల్లో ఉంటూనే హత్యలు చేయిస్తున్నాడు. అంటే అర్గనైజ్‌డ్ హత్యలు చేయిస్తూ ఎలా తప్పించుకోవచ్చో కాంగ్రెస్ చేసి చూపించింది!

రాహుల్ శాంతి భద్రతలు అంటూ నీతులు చెప్తున్నాడు! శరద్ పవార్ కి తన గతం గుర్తుకు వచ్చి మౌనంగా ఉన్నాడు! బాబా సిద్ధికి కాంగ్రెస్ కి రాజీనామా చేసి NCP లో (అజిత్ పవార్ ) చేరడంలో ఉద్దేశ్యం తనకి రక్షణ ఉంటుంది అనే కదా?

**********
కెనడా VS భారత్

బాబా సిద్ధికి హత్య తరువాత డస్ట్ ట్రాడూకి జ్ఞానోదయం అయ్యింది! కెనడా ఆరోపణలు  ఏమిటంటే…

గోల్డి బ్రార్, లారెన్స్ బిష్నోయి లు RAW కి పని చేస్తున్నారు. కెనడాలో హత్యలు చేయడానికి గోల్డి బ్రార్ మనుషులు పనిచేస్తున్నారు! RAW సహకారంతోనే కెనడాలో ఉంటున్న సిక్కులని ఒక్కక్కరిని చంపుతున్నారు!
అవునా!

మరి భారత్ లో నిషేధించిన బబ్బర్ ఖల్సా నాయకులు కెనడాలో ఎందుకు ఉంటున్నారు? SFJ – శిఖ్ ఫర్ జస్టిస్ నాయకులు కెనడాలో ఎందుకు ఉంటున్నారు?

డష్టిన్ ట్రాడూ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు! ప్రస్తుతం కెనడా తీవ్ర సంక్షోభంలో ఉంది! ఒక రెస్టారంట్ లో వెయిటర్ జాబ్ కోసం 3 వేల మంది లైన్లో నుంచున్నారు అంటే కెనడాలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు!

డష్టిన్ ట్రాడూని రాహుల్ తో పోల్చుతున్నారు కెనడా ప్రజలు!

అజిత్ దోవల్ పేరుని ఉటంకిస్తూ నేరుగా దాడి చేశాడు డస్టిన్ ట్రాడూ! ఖలిస్తాన్ మూక ఒత్తిడిని తట్టుకోలేక ట్రాడూ కెనడాలోని రాయబార సిబ్బందిని దేశం విడిచి వదలి వెళ్ళాల్సిందిగా ఆదేశించింది కెనడా!

భారత్ కూడా కెనడా రాయబార సిబ్బందిని దేశం వదిలి వెళ్ళాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది!

ఎక్కడ బాబా సిద్ధికి హత్య? ఎక్కడ కెనడా?

అసలు కెనడా విదేశాంగ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వారు ఎక్కువ శాతం ఖలిస్థాన్ వాళ్ళే! భారత్ నుండీ వీసా అప్లికేషన్లు వస్తే పంజాబ్, హర్యానా వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు అన్నది పచ్చి నిజమ్! ఇక గోల్డి బ్రార్,లారెన్స్ బిష్నోయిలు తమ స్టాండ్ ని మార్చుకొని ఖలిస్థాన్ కి వ్యతిరేకంగా మారారు అన్నదీ నిజం! ఇదే కెనడా అనుమానాలకి మూలం!…. (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions