Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గ్రేట్ రాఠీ… 5 బంతుల్లో 5 వరుస వికెట్లు… క్రికెట్‌లో ఈ ఫీట్‌ను ఏమంటారు..?

June 17, 2025 by M S R

.

దిగ్వేష్ సింగ్ రాఠీ… ఈ ఢిల్లీ క్రికెటర్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు… నిజానికి బాల్ దొరికితే దంచుడే అన్నట్టుగా సాగే టీ20, ఐపీఎల్ వంటి మ్యాచుల్లో అసలు హేట్రిక్ సాధించడమే గ్రేట్…

ఎంతో అద్భుతమైన బౌలింగ్ ఉంటే తప్ప, పిచ్ సహకరిస్తే తప్ప, ప్రత్యర్థి బ్యాటర్లు మరీ నాసిరకం అయితే తప్ప ఇవి సాధ్యం కావు… అసలే బ్యాటింగ్ పిచ్చులు కదా మనవి, మరీ ఈ టీ20 మ్యాచుల్లో… సో, హేట్రిక్ సాధనే గ్రేట్ అనుకుంటే…

Ads

రాఠీ వరుసగా అయిదు బాల్స్‌కు అయిదు వికెట్లు తీశాడు… అందులో నాలుగు క్లీన్ బౌల్డ్, మరొకటి ఎల్‌బీడబ్ల్యూ… సూపర్ కదా… అవునూ, ఇంతకీ వరుసగా మూడు వికెట్లు తీస్తే హేట్రిక్, మరి వరుసగా అయిదు వికెట్లు తీస్తే ఏమంటారు.?

ట్రిపుల్ హేట్రిక్… అదేమిటి, ట్రిపుల్ హేట్రిక్ అంటే వరుసగా 9 వికెట్లు పడాలిగా అంటారా..? ఎవరో విచిత్రమైన పేరు కాయిన్ చేశారు అలా… దీనికి ఒకాయన రెడిట్‌లో సమాధానం చెప్పాడు… 1-3 వికెట్లు అంటే హేట్రిక్, 1-4 వికెట్లు అంటే డబుల్ హేట్రిక్… 1-5 వికెట్లు అంటే ట్రిపుల్ హేట్రిక్ అట…

(ఇవి వరుస వికెట్లకు పేర్లు… కానీ ఒకే ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీస్తే ఫైఫర్ అంటారు, అంటే ఫైవ్ ఫర్ అని… ఫైవ్ వికెట్ హాల్ అనీ అంటారు… కానీ ట్రిపుల్ హేట్రిక్ వేరు…)

ఇది సరే, ఎవరైనా వరుసగా ఆరు వికెట్లు తీసినవాళ్లున్నారా..? ఆరు బాల్స్‌లో వరుసగా ఆరు వికెట్లు… అధికారికంగా ఐసీసీ రికార్డుల్లో ఏమీ లేదు, ఎవరూ లేరు… కానీ ఏదో దేశీయ మ్యాచులో గారెత్ మోర్గాన్ అనే ఆస్ట్రేలియన్ క్రికెటర్ సాధించాడు… నెట్‌లో కొన్ని వీడియోలు కూడా కనిపిస్తాయి… దానికి ఏం పేరుంది అంటారా..? ఏమో ఎవరూ పేరు పెట్టినట్టు లేదు…)

digvesh

గల్లీ మ్యాచులోనైనా సరే, అది రేర్ ఫీట్… సరే, ఈ దిగ్వేష్ సింగ్ రాఠీ విషయానికి వద్దాం… తనను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 30 లక్షలను కొనుగోలు చేసింది మొన్నటి ఐపీఎల్ మ్యాచు కోసం… ఓవరాక్షన్, ఏదో నోట్‌బుక్‌లో ఏదో రాస్తున్నట్టు, బాల్ విసరడానికి ముందు దాన్ని దాచిపెట్టి, హఠాత్తుగా బయటికి తీసి విసిరినట్టు ఏదో ప్రదర్శిస్తాడు… జులపాల జుట్టు…

వికెట్ పడితే ఎదుటివాడు ఇబ్బందిపడేలా సెలబ్రేట్ చేస్తాడు, ఓ మ్యాచులో 50 శాతం జరిమానా, మరో మ్యాచ్ నిషేధమూ అనుభవించాడు… తను ఇండియా తరఫున ఏమీ ఆడలేదు, సో, టెస్టులు, టీ20, వన్డే లెక్కలేమీ లేవు… జస్ట్, ఐపీఎల్… అదీ పెద్ద ఇంప్రెసివ్ ఏమీ కాదు… కానీ ఈ ఐదు వరుస వికెట్లతో హఠాత్తుగా తెరపైకి వచ్చేశాడు…!!

అన్నట్టు… మన ప్లేయరే, అభిమన్యు మిథున్… కర్నాటక తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా మీద సూరత్‌లో ఆడుతున్నప్పుడు… 2029 నవంబరు… ఒకే ఓవర్‌లో అయిదు వికెట్లు తీశాడు… కాకపోతే నాలుగు వరుస వికెట్లు, తరువాత వైడ్, తరువాత సింగిల్, చివరలో మరో వికెట్…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…
  • దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!
  • మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!
  • జాగ్రత్త, ప్రభుత్వ సంస్థల పేరిట సైబర్ ఫ్రాడ్… పదిమందికీ షేర్ చేయండి…
  • లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!
  • ‘సూపర్ సిక్స్’ ప్యాక్ రేవంత్ రెడ్డి… నిజంగానే ఇది చేస్తే మరింత మేలు..!!
  • పార్టీ జర్నలిస్టు వేరు- పార్టీ కార్యకర్త వేరు… తేడాను చెరిపేశారు…
  • వినోద రూపంలో సందేశం ఓ మంచి కళ… ఈ ఇద్దరు దొంగలు వాళ్లే…
  • దిక్కుమాలిన క్రియేటివిటీ అని ఈసడింపా..? పెటా కోరిందీ అదే మరి..!!
  • గ్రేట్ రాఠీ… 5 బంతుల్లో 5 వరుస వికెట్లు… క్రికెట్‌లో ఈ ఫీట్‌ను ఏమంటారు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions