పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి… దాంతో నీ పనైపోయింది అధోగతి…… ఎక్కడో విన్నట్టు ఉంది కదూ… అవును, చూడాలని ఉంది… అనబడే చిరంజీవి సినిమాలో… ఆయనకూ, సౌందర్యకూ నడుమ సాగే ఫేమస్ సంభాషణ… ఎప్పుడు విన్నా, చూసినా నవ్వాపుకోలేం… చిన్నప్పుడు రేడియోలో బాలానందం సినిమాలో పిల్లల కవిత్వాలు వచ్చేవి కొన్ని… తరువాత ఇప్పుడు ఫేస్‌బుక్ కవిత్వాలు కూడా అదే టైపు… అఫ్ కోర్స్, తెలుగు సినిమా పాటలన్నీ అంత్యప్రాసల ప్రయాసలు, అష్టావక్రల ప్రసవాలే కదా…
మహేశ్ బాబు సినిమా ఒకటి వస్తోంది కదా… సర్కారువారి పాట అనే సినిమా… అందులో ఒక పాటను రిలీజ్ చేశారు… కళావతి సాంగ్… అది వింటుంటే ఆ చూడాలని ఉంది సినిమా సీనే గుర్తొచ్చింది… సరే, సినిమాలన్నింటిలోనూ అదే టైపు… కానీ మరీ థమన్ ట్యూన్, అనంత శ్రీరాం సాహిత్యం నవ్వొచ్చేలాగే ఉన్నయ్… కానీ ఏమాటకామాట… మహేశ్‌బాబు వయస్సు పెరిగేకొద్దీ కుర్రాడైపోతున్నాడు… నో డౌట్, అందగాడు… ఆ హీరోయిన్ కీర్తి సురేష్‌కన్నా బాగున్నాడు… పాట లొకేషన్ కూడా బాగుంది… అయితే..?
Ads
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరశరం
వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటినాకీ తడబాటసలేందే
ఉందే దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరశరం
వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ
అన్యాయంగా మనసుని గెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగ ఘోరంగా నా కలలని కదిపావే
దొంగ అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళావీ కళావతి కల్లోలమైందే నా గతి
కురులావి కళావతి కుళ్ళబొడిసింది చాలుతీ
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరశరం
ఏ, వందో, ఒక వెయ్యో, ఒక లక్షో
మెరుపులు మీదికి దూకినాయ
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో
చిలిపిగ తీగలు మోగినాయ
పోయిందే సోయ
ఇదీ ఆ పాట… అసలు అనంత శ్రీరాంకు ఏమైందో అర్థం కావడం లేదు… ఒప్పుకుందాం, సంగీతదర్శకుడు, సినిమా దర్శకుడి టేస్ట్‌ను బట్టి రాయల్సిందే, లేకపోతే డబ్బు రాదు, కెరీర్ లేదు, కానీ మరీ ఇదేమి సాహిత్యం..? సారీ, సాహిత్యం అనే పెద్ద పదాన్ని వాడినందుకు… మరీ ‘‘
కళ్ళావీ కళావతి కల్లోలమైందే నా గతి
కురులావి కళావతి కుళ్ళబొడిసింది చాలుతీ
కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువ్వు లేకుంటే అధోగతి’’ ఇదేం పాట శ్రీరామా..?
గతి, చాలుతీ, కళావతి, నువ్వే గతి, అధోగతి…. ఈ తి తి భాషేమిటి..? పోనీ, కాస్త క్రియేటివిటీయో, ఆకట్టుకునే ట్యూన్ ఉందా అంటే అదీ లేదు… సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఇలాంటి పాటలా ఇచ్చేది..? అన్నట్టు, సోయ అనే పదానికి అర్థమేమిటి..? దిగుదిగుదిగు నాగ సినిమాతో పోయిన పరువును తిరిగి తెచ్చుకునే ప్రయాస బదులు, మరింత దిగజార్చే కంటెంట్ దేనికి స్వామీ..?! ప్రతిభ ఉండీ మరీ మోడరన్ వేటూరి టైపులోకి జారిపోవడం దేనికి..? అసలు ఆ మెరుపులు వందో, వెయ్యో, లక్షో ఇప్పటికైనా తేలిందా లేదా…!!
Share this Article