షాక్… షాక్… చిరంజీవి సినిమాకా ఈ దురవస్థ అని పేరున్న సైట్లు కూడా తెగ రాసేస్తున్నాయి… అస్సలు నమ్మశక్యంగా లేదు సుమీ అంటూ అబ్బురపడిపోతున్నయ్… విషయం ఏమిటయ్యా అంటే..? చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదు అనేది వార్త… దానికి షాక్ అట… షాక్ ఏముంది..? అందరికీ తెలుసు, ఆచార్య దెబ్బ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మీద దారుణంగా ఉండబోతోంది అని… నిజానికి చిరంజీవి కూడా ఊహించే ఉంటాడు… అందుకే అవసరమైతే సొంతంగానే రిలీజ్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు… ఎందుకంటే, అది తన సొంత సినిమా కాబట్టి…
ఎస్, ఇన్నేళ్ల చిరంజీవి కెరీర్‌లో బయ్యర్లు ఎగబడటమే తప్ప బయ్యర్లు వెనుకంజ వేయడం తొలిసారి చూస్తున్నాం… కానీ ఆచార్య డిజాస్టర్ కూడా అదే రీతిలో బయ్యర్ల మీద పడింది కదా… చిరంజీవి తన సినిమా ఫెయిల్యూర్ మీద బయ్యర్లకు డబ్బు ఉల్టా అడ్జస్ట్ చేయడం కూడా తొలిసారి… ఇది సహజంగానే బయ్యర్ల విశ్వాసాన్ని బలంగా దెబ్బతీసి ఉంటుంది… అదే కారణం… నిజానికి సినిమా మీద ఏమాత్రం బజ్ లేకపోవడం కూడా ఓ కారణమే…
ఒకవైపు వచ్చేనెల 5 రిలీజ్ అంటున్నారు… అంటే 15 రోజులు… అస్సలు ప్రమోషన్స్ లేవు… అదేదో థమన్ కాపీ సాంగ్ రిలీజ్ అన్నారు, తీరా చూస్తే దాన్ని ఓ మ్యూజిక్ యాప్‌లో పెట్టేశారు… స్పాటిఫైలో పాట వినాలంటే అదొక తంతు… యూట్యూబ్‌లో పెట్టేస్తే ఆ కథ వేరేగా ఉండేది… ఓ పాత్రను లేపేశారని మరో ప్రచారం… లూసిఫర్ ఒరిజినల్ స్టోరీని, ఆ పాత్రను చిరంజీవికి తగినట్టు బాగా మార్చేశారని ఇంకో ప్రచారం… ఆచార్యలో రాంచరణ్ తోడున్నాడు… ఇందులో ఆ సపోర్ట్ కూడా లేదు…
Ads
సల్మాన్ ఖాన్‌ను చూపించి, హిందీలో కూడా డబ్ చేసి, రిలీజ్ చేయాలనేది ఓ ఆలోచన… కానీ చిరంజీవి పాన్ ఇండియా స్టార్ కాదు, కేవలం సల్మాన్ పాత్ర కోసం, చిరంజీవి లీడ్ రోల్‌లో ఉండే సినిమాను హిందీ ప్రేక్షకులు చూస్తారా, ఆదరిస్తారా అనేదీ డౌటే… సో, తెలుగు మార్కెట్ మీదే ప్రధానంగా దృష్టి… 80- 100 కోట్ల వరకూ వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తే, ఇప్పటివరకూ పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం లేదని వార్తలు… సినిమా ఫలితం ఆచార్యలాగే ఉంటే, ఏమైనా కాంపెన్సేట్ చేసే విషయంలో ముందుగానే బయ్యర్లు ఏమైనా హామీలు అడుగుతున్నారా..? అలా హామీలు ఇవ్వడంకన్నా చిరంజీవి సొంతంగా రిలీజ్ చేసుకోవడమే బెటర్…
కొంతలోకొంతనయం ఏమిటంటే..? థియేటర్ రిజల్ట్ మీద అందరికీ బాగా డౌట్లున్నాయి కాబట్టి ముందుగానే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి అమ్మేసినట్టు సమాచారం… అది కొంతమేరకు చిరంజీవిపై సినిమా అమ్మకం తాలూకు బర్డెన్, స్ట్రెస్ తగ్గించినట్టే… సొంత రిలీజ్ రిస్క్ కదా అంటారా..? కాదు, దసరా సెలవుల్లో రిలీజు కాబట్టి, ఎంతోకొంత సినిమాకు ప్లస్సే… పోటీగా మార్కెట్‌లో నాగార్జున సినిమా ఘోస్ట్ ఉండనుంది… అదీ పెద్ద పోటీ ఏమీ కాదు… సో, బయ్యర్లను వదిలేసి, సొంతంగా రిలీజు చేసుకున్నా పెద్ద రిస్కేమీ లేనట్టే… పైగా థియేటర్లు అడ్జస్ట్ చేసే విషయంలో అల్లు అరవింద్ ఉండనే ఉన్నాడు కదా…! ఐనా సినిమా ఖర్చులో సగం చిరంజీవి రెమ్యునరేషనే కదా… ఎంతొస్తే అంత..!!
Share this Article