హఠాత్తుగా ఏ వైరస్ మెదడును అటాక్ చేసి, విచక్షణను దెబ్బతీస్తుందో తెలియదు… మేం హోస్ట్ చేస్తున్నది లేదా జడ్జిగా ఉన్నది మ్యూజిక్ షో అనే సోయి కూడా అకస్మాత్తుగా మాయమైపోతుంది కొందరికి… ఆమధ్య శ్రీముఖి డ్రెస్సింగు గురించి, అనసూయ దుస్తుల గురించి మనం చెప్పుకున్నాం… ఆ సిరివెన్నెల ఏ క్షణాన రాశాడో గానీ… నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… అని… ఇక కాళ్లు, ఆపైన తొడల దాకా చూపించుకునే ఆత్రం, తాపత్రయం బాగా పెరిగిపోతున్నయ్ ఈ సోకాల్డ్ సెలబ్రిటీల్లో…
శ్రీముఖి, అనసూయ ఎలా చూపించుకున్నా సరే… ఏ వెగటు డ్రెస్సులు వేసుకున్నా సరే గానీ… మరీ గీతామాధురి కూడా తెలుగు ఇండియన్ ఐడల్ మ్యూజిక్ షోలో ఆ పరిమితుల ‘గీత’ దాటడం ఒకింత విస్మయకరమే… అసలే దట్టంగా పులుముకున్న మేకప్పు… దానికితోడు ఈ కాళ్ల ఎక్స్‌పోజింగు… ఏం తయారయ్యారా స్వామీ..? ఎలాగూ జడ్జి స్థానంలో కూర్చునేదే కదా, కనిపించడానికి ఏముందిలే అంటారా..? ఊ అంటే స్టేజీ మీదకు వస్తుంటుంది గీతామాధురి… దానికి తగ్గట్టు ఆ వేషధారణ… ఏం తల్లీ, నీకేమైంది..?
Ads
సరే, ఈ గీతలు, సీతల పైత్యాల్ని వదిలేస్తే… తెలుగు ఇండియన్ ఐడల్ షో ఖచ్చితంగా మ్యూజిక్ షోలలో తన ఆధిపత్యాన్ని చూపించుకుంటోంది… దానికి బలం థమనే… విశాఖపట్టణానికి చెందిన భాగవతుల శైలజ మొన్నటి ఎపిసోడ్‌లో ఏదో పాట పాడితే, ఆ బిట్ శ్రేయోఘోషల్‌కు పంపించి, ఆమె నుంచి రిప్లయ్ వీడియో తెప్పించుకుని ప్రదర్శించాడు థమన్… ఇండియన్ తొలి ర్యాపర్ బాబా సెహగల్‌ను రప్పించి ఈ షోకు కాస్త విశిష్టతను అద్దింది థమన్…
బాబా అసలు పేరు హర్‌జీత్‌సింగ్ బాబా సెహగల్… లక్నోలో పుట్టాడు… ఫస్ట్ ర్యాపర్… అసలు ర్యాప్ అంటే తెలియని రోజుల్లోనే బోలెడు ప్రైవేటు ఆల్బమ్స్ చేశాడు… హిట్టయ్యాయి కూడా… విశాల్ దడ్లానీ టైపులో కనిపిస్తాడు, తనకు పిల్లిగడ్డమైనా ఉంటుంది, కానీ సెహగల్‌కు అది కూడా ఉండదు… నున్నగా గొరిగిన గుండు, నో మీసాలు, నో గడ్డం… భలే ఉంటుంది ఆ మొహం… తెలుగువాళ్లకు పరిచయమే తను… చిరంజీవి పాట గుర్తుందా..?
రూప్ తేరా మస్తానా, నీకు డేరా వ్యస్తానా…. నుంచి దేఖో దేఖో గబ్బర్ సింగ్ నుంచి… మొన్నమొన్నటి పెళ్లి సందD దాకా… తెలుగులో పలు పాటలు పాడాడు… హిందీలోకన్నా తెలుగులోనే తనకు చాన్సులు ఎక్కువ… తను నటుడు కూడా… ఈ ఆహా మ్యూజిక్ షోలో కూడా సరదాగా ఉన్నాడు… ఆహా టీం కంటెస్టెంట్ల మీద రాసిచ్చిన ప్రాస కవితలు చదువుతూ, గిఫ్టులు ఇస్తూ షోలో కాస్త జోష్ నింపాడు… పాడాడు… హేమచంద్రతో ఆడాడు… బాగుంది…!! చివరగా :: రూప్ తేరా మస్తానా పాట పాడుతుంటే… వస్తానా బదులు వ్యస్తానా అని ఉచ్చరిస్తుంటే మాత్రం పంటికింద రాళ్లలా అబ్బా అనిపించింది…!!
జీతెలుగు సరిగమపలో మెచ్చుకోవడానికి ఏమీ లేవా అంటారా..? చెత్త… ఒకవైపు సింగర్స్ పాడుతుంటే వెనుక డాన్సర్లు పిచ్చి గెంతులు వేయడం చిరాగ్గా ఉంది… ఆ షో మీద సదభిప్రాయమే పోయింది… జోకులు, వెకిలి డాన్సులు, చివరకు అనంత శ్రీరాంతోపాటు మనో కూడా రెట్రో వేషాలు… వెంట్రిలాక్విజం బొమ్మతో అప్పట్లో కమలహాసన్ ఇది కథ కాదు సినిమాలో ‘అటూఇటూకాని హృదయంతోటి ఎందుకురా’ ఎస్పీ బాలు, రమోల పాడిన సూపర్ హిట్ సాంగ్ ఉంది కదా… చిన్న పిల్ల వేద వాగ్దేవి దాన్ని అనుకరిస్తూ సూపర్ పాడింది… ఆ చిన్నారికి అభినందనలు చెప్పొచ్చు…!!
Share this Article