కాంగ్రెస్ కి అధికారం ఇస్తే భారతదేశపు సంపద అంతా ఎక్కువమంది పిల్లలని కనే వర్గానికి దోచిపెడుతుంది. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ వారికి దోచిపెడుతుంది! చివరికి మీ తాళిబొట్టు ను కూడా వదలదు… ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఇది…
*****
Well… వారూ వీరూ అనే భేదం లేకుండా అందరూ ప్రధానిని విమర్శిస్తున్నారు! అసలు ఎన్నికల మొదటి విడత ప్రక్రియ ముగిసిన తరువాత ప్రధాని ఇలాంటి వ్యాఖ్య చేయటం సబబా?
******
ఎవరు సలహా ఇచ్చారో తెలీదు కానీ ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్య చేయడం సమంజసంగా లేదు! అంత అవసరం ఏమొచ్చింది? అన్ని ఎన్నికల సర్వేలు బీజేపీకి స్వంతంగా 321 సీట్లు వస్తాయి అని చెపుతున్నాయి! NDA కి 347 నుండి 362 మధ్య సీట్లు వస్తాయి అని చెపుతున్నాయి! ఇది అన్ని ఎన్నికల సర్వేలను కలిపితే వచ్చే సరాసరి సంఖ్య!
Ads
ఒక సర్వే మాత్రం బీజేపీకి మెజారిటీ వస్తుంది అంటూనే గత ఎన్నికల కంటే తక్కువ సీట్ల (278) తో పాటు NDA కి 317 సీట్లు రావొచ్చు అంటోంది, INDI గ్రూపు కొంచెమ్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డది. ఇది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన స్ట్రాటజీను పోలి ఉంది! అఫ్కోర్స్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా ఇదే వ్యూహాన్ని రచించి అమలుచేసింది కాంగ్రెస్!
********
ఎటూ మెజారిటీ సర్వేలు బిజేపి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని తేల్చి చెప్తున్న వేళ మోడీ కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య మాత్రం సమంజసం కాదు! అనవసరంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ ప్రతి మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు బ్యాంకులో వేస్తామని అనే దానికి మోడీయే స్వయంగా ప్రచారం చేసినట్లయింది.
గత రెండు జనరల్స్ ఎన్నికలప్పుడు మోడీ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు కానీ రెండుసార్లూ విజయం సాధించిపెట్టారు బీజేపీకి. ఈసారి మాత్రం కొంచెం వివాదానికి కారణం అయ్యారనే చెప్పుకోవాలి.
********
మోడీ ఒక మతాన్ని నేరుగా పేరుతో టార్గెట్ చేయలేదు. బహుశా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దేశంలోకి వచ్చిన రోహింగ్యాలని ఉద్దేశించి అని ఉండవచ్చు. ఇక కాంగ్రెస్ మేధావులు మాత్రం 2011 జనాభా లెక్కలు తీసి హిందువుల జననాల సంఖ్య ఎంత శాతం ఉందో కాకి లెక్కలు చెబుతున్నారు.
అదే సమయంలో బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దేశంలోకి చొరబడిన 5 కోట్ల మందిని చాలా కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన తరగతుల మహిళలకి ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు కాక అదనంగా సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తాము అనే వాగ్దానాన్ని టార్గెట్ చేస్తూ మోడీ విమర్శించారు!
అయితే ఇది మోడీ అన్న మాటనా? గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ అన్నమాటనే మోడీ గుర్తు చేశారు! ‘’ భారత దేశ సంపదలో సింహ భాగం హక్కుని ముస్లిమ్స్ కలిగి ఉన్నారు అని కదా మన్మోహన్ అన్నది. 2006 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నదేమిటంటే… : We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably the fruits of development. These must have the first claim on resources”
ప్రధాన మంత్రి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇలా ఎలా అనగలిగాడు? విచిత్రం ఏమిటంటే ఇందిర హత్య తరువాత జరిగిన ఎన్నికలలో రాజీవ్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మన దేశంలో ఉన్న సిక్కులని నమ్మవచ్చా అంటూ ప్రశ్నించాడు. 2004 లో అదే సిక్కు మతానికి చెందిన మన్మోహన్ సింగ్ చేత ముస్లిం అప్పీజ్మెంట్ ప్రకటన చేయించింది కాంగ్రెస్.
దాని బదులు బలహీన వర్గాలకు ప్రథమ హక్కు ఉంది అని ఉంటే బాగుండేది. అంటే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా పేదరికం ప్రాతిపదికన సంపద పంపిణీ అని ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు! మన్మోహన్ నోట వచ్చింది కానీ అనిపించింది ఎవరో మనందరికీ తెలిసిందే! అదే మాటని మోడీ కాంగ్రెస్ గ్యారంటీలను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు! తప్పేముంది?
*******
రాహుల్ ఏమన్నాడు?…. మేము భారతదేశం మొత్తం X Ray నిర్వహిస్తాము, అంటే ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది? వాళ్ల మతం ఏమిటీ? వాళ్ల కులం ఏమిటి? ఇలా X Ray సర్వే చేసి అప్పుడు ఆ సంపదలో ముస్లిమ్స్ కి ఎంత వాటా ఇవ్వాలో నిర్ణయిస్తాడుట! మరి దీనిని ఏమనాలి?
********
ఇదేమన్నా కొత్త కాన్సెప్టా? వెల్త్ రీ- డిస్ట్రిబ్యూషన్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు! 80 ఏళ్ల కింద నిజంగా జరిగిందే!
జెర్మనీ – హిట్లర్ – నాజీ పార్టీ – జార్జ్ సోరోస్ !
రెండో ప్రపంచ యుద్దకాలానికి ముందే, అంటే 1938 లో హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ జెర్మనీలోని యూదుల ఆస్థుల వివరాలు సర్వే చేయించాడు. తరువాత యూదులందరినీ కాన్స్ట్రంటేషన్ కాంపుకి తరలించాడు.
యూదుల ఆస్థులన్నీ నాజీ పార్టీకి వెళ్లిపోయాయి. ఇదీ సంపదని పంచడం అంటే! జార్జ్ సోరోస్ పుట్టుకతో యూదుడు, కానీ చేసేది క్రైస్తవ మత ప్రచారం! జార్జ్ సోరోస్ అనేవాడు యూదులని వoచించడంలో ఎప్పుడూ ముందు ఉండే నాజీ పార్టీ అభిమాని. అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కాఫిర్ ఎలానో జార్జ్ సోరోస్ కి రాహుల్ అలాంటి వాడు!
So! Wealth re-distribution అంటే కష్టపడి సంపాదించుకున్న వారి సంపదని స్వాధీనం చేసుకొని ఓట్ల కోసం పంచిపెట్టడం అన్నమాట! రాహుల్ యూరోపు పర్యటనలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేవి జార్జ్ సోరోస్ ద్వారా నేర్చుకొని మన దేశంలో అమలు చేస్తాడు! మోడీ దీని మీద సరయిన సమయంలో స్పందించారు! 2014 లో కనుక మళ్ళీ ఎన్నికయితే నాజీ పార్టీ పథకాన్ని అమలు చేసేదే కాంగ్రెస్!
**********
నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో అన్నది ఏమిటో తెలుసా? భారత దేశ విభజన సమయంలో తూర్పు పాకిస్ధాన్ (బంగ్లాదేశ్) నుండి హిందువులు పశ్చిమ బంగ్లాకి వలస వచ్చారు అత్యాచారాలు, హత్యల నుండి తప్పించుకోవడానికి! 1950 మార్చిలో ప్రధాని హోదాలో నెహ్రూ వెస్ట్ బెంగాల్ లోని నదియా (Nadiya refugee camp) శరణార్థుల శిబిరాన్ని సందర్శించాడు!
నదియా శరణార్థుల శిబిరం అనేది లక్షలాది హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తూర్పు పాకిస్ధాన్ నుండి వెస్ట్ బెంగాల్ లోకి వచ్చిన శరణార్థుల శిబిరం! శరణార్థుల శిబిరంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలు ఉండడం చూశాడు నెహ్రూ. బెంగాల్ లో వివాహం అయిన మహిళలు మంగళ సూత్రంతో పాటు చిన్న శంఖం (అది అసలు శంఖం కావొచ్చు లేదా బంగారంతో చేసిన చిన్న శంఖం ధరించడం సాంప్రదాయం)
దీన్ని చూసిన నెహ్రూ బెంగాల్ నుండి తిరిగి ఢిల్లీ వచ్చిన తరువాత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో ప్రసంగిస్తూ తూర్పు పాకిస్ధాన్ లో హిందువుల మీద హింస జరిగితే హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలు ఎలా ఉన్నాయి అని ఎదురు ప్రశ్నించాడు! అంటే హిందూ మహిళల మెడలో బంగారముతో చేసిన మంగళ సూత్రం ఉండకూడదు అన్నమాట నెహ్రూ దృష్టిలో…
అక్కడితో ఆగిపోలేదు నెహ్రూ! 1950 లో పాకిస్ధాన్ అధ్యక్షుడు లియాకత్ అలీ ఖాన్ తో ఒప్పందం చేసుకున్నాడు. నెహ్రూ – లియాకత్ అగ్రిమెంట్ గా ప్రసిద్ధమైన ఆ ఒప్పందం ప్రకారం తూర్పు పాకిస్ధాన్ నుండి హిందువులు వెస్ట్ బెంగాల్ లోకి రాకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి అని.
తూర్పు పాకిస్తాన్ నుండి శరణార్థులుగా ఎవరూ భారత్ కి రాకుండా చట్టం చేశాడు నెహ్రూ! 1950 నుండి 1971 వరకు 25 లక్షల మంది హిందువులు ప్రాణాలు వదలడం జరిగింది తూర్పు పాకిస్ధాన్ లో. ఇక బలవంతపు మత మార్పిడులు అయితే ఎన్ని జరిగాయి అనేది లెక్కలేదు.
********
1992 లో అజ్మీర్ లో జరిగిన వరస అత్యాచారాల కేసులో నిందితుడు ఫరూక్ చిస్తి రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ ఎలాంటి చర్యలు లేవు! వారం క్రితం హుబ్లీ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ హీరేమట్ కూతురు నేహా లవ్ జిహాద్ హత్యకి గురయితే కేసు లేదు. సదరు కాంగ్రెస్ నాయకుడు అచ్చం కేరళ స్టోరీ సినిమాలో జరిగినట్లే నా కూతురు విషయంలో కూడా జరిగింది అంటూ ప్రధాన నిందితుడు ఫారాజ్ తో పాటు 8 మంది పేర్లను బయట పెట్టాడు కానీ సిద్ధరామయ్య మాత్రం అది వ్యక్తిగత కక్ష వల్ల జరిగింది అని కొట్టి పారేశాడు!
*********
మావో కల్చరల్ రివల్యోషన్
హిట్లర్ ఫైనల్ సొల్యూషన్
ఛావేజ్ బొలీవియా విప్లవం
స్టాలిన్ కలక్టివైజేషన్
ఇలా సోషలిస్టు సిద్ధాంతం పేరిట జరిగిన మారణహోమం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి కానీ కాంగ్రెస్ అదే సిద్ధాంతాన్ని సోరోస్ సలహాతో మన దేశంలో మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నది!
UCC అమలు కావాలి అంటే బిజేపికి 400 సీట్లు అవసరం. అందుకే అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో మోడీ ప్రచారం చేస్తున్నారు! 400 సీట్లు గెలిచి UCC అమలు అయితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది! కాంగ్రెస్ ఒక్కటేనా? తెలుగు దేశం పార్టీ, టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెసు, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కూడా కనుమరుగు అవుతాయి.
*********
1. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది నాశనం చేయాలి… ఉదయనిధి స్టాలిన్! TN
2. వినాయకుడు అనేవాడు మిథ్య… M రియాజ్. కేరళ.
3. వాట్ ఈజ్ దిస్ సెంగోల్ నాన్సెన్స్? J. బ్రిట్టాస్. Kerala.
4. రేహాన్ బీఫ్ జిందాబాద్.. ఒవైసీ, హైదరాబాద్.
5. 10 నిముషాలు ఆర్మీని పక్కన పెడితే… అక్బరుద్దీన్
6. భారత్ తెరే తుక్డే తుకడే కరెంగే. JNU ఢిల్లీ.
ఫైనల్ టచ్: ‘ అరియుమ్ మలరుమ్ వెచ్చోడ; వరున్ను నింతే కలన్మర్ .. మళయాళంలో ఈ వాక్యాలకు అర్థం ఏమిటో తెలుసా? Prepare for your funeral and death is coming.. అంతిమ యాత్రకి సిద్ధంగా ఉండు, నీ చావు దగ్గరలో ఉంది.
ఈ వాక్యాలను బిగ్గరగా అరుస్తూ అన్నది 7 ఏళ్ల పిల్లవాడు తన తండ్రి భుజం మీద కూర్చొని మరీ! PFI నిషేధానికి గురి కాక ముందు కేరళలో PFI ఒక ఊరేగింపు నిర్వహించినప్పుడు ఆ 7 ఏళ్ల పిల్లవాడు అన్న మాటలు ఇవి!
‘ కిరోసిన్ ఇప్పటికే చల్లి ఉంది ‘ రాహుల్!… ఇవేవీ వివాదాలు కావు అన్నమాట!
***********
మోడీ జస్ట్ లక్ష ద్వీపంలో కుర్చీ వేసుకుని కూర్చున్నందుకు మాల్దీవుల టూరిజం సంక్షోభంలో పడింది! మరి అలాంటిది భారత దేశ సంపదని ఎక్కువ మంది పిల్లలు కనే వర్గానికి దోచిపెడుతుంది అని మోడీ అనగానే ఎందుకంత ఉలిక్కి పడింది కాంగ్రెస్?
మల్లిఖార్జున ఖర్గే హుటాహుటిన మోడీ అపాయింట్మెంట్ కోసం ఎందుకు అడిగాడు? ఎందుకంటే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాల గురించి వివరంగా చెప్పడానికట! అదేదో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి వివరంగా చెప్పవచ్చు కదా? మోడీ వ్యాఖ్య వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా మాల్దీవులకి పట్టిన గతే పడుతుంది అని భయపడడం వల్ల!
*********
సంపదను పంచడం తప్పు కాదు అంటూ రాజీవ్ సన్నిహితుడయిన శామ్ పిట్రోడా మరో డామేజీ ప్రకటన చేశాడు! శామ్ పిట్రోడా ఏం చెప్తున్నాడు? అమెరికాలో చనిపోయిన వారి ఆస్తులలో 55% అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మిగతా 45% అతని వారసులకు ఇస్తుంది అని!
అంటే దీనర్థం భారత్ లో కూడా అలాంటి చట్టాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ అనే కదా? So! మరో వెనిజులా, బొలీవియా, క్యూబా, రష్యాలలాగా భారత్ ను కూడా చేస్తుంది అన్నమాట! మల్లిఖార్జున ఖర్గేకి మోడీ అపాయింట్మెంట్ ఇక అవసరం లేదు!
మ్యాటర్ క్రిస్టల్ అండ్ క్లియర్!
**********
బీజేపీ ఎటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అందులో చైనాకు కూడా సందేహం లేదు! కాకపోతే రామ్ నామ్ సత్య హై లాగా చివరి ప్రయత్నంగా తన వంతు మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు పెడుతున్నది మోడీ ప్రధాని కాకూడదు అని!
అందుకే ఎక్కడో జెర్మనీలో ఉండి భారత్ కి రావాలంటే భయపడే ధృవ్ రాతీ గాడి చేత దక్షిణాది భాషల్లో వాడి జోకులని తర్జుమా చేసి వదులుతున్నది చైనా. అఫ్ కోర్స్ ట్రంప్ గెలవడానికి రష్యా సహాయం చేసింది అని అమెరికన్ దర్యాప్తు సంస్థలు మొదట్లో చెప్పినా.. ఇటీవలే రష్యా కాదు, ఆ పని చేసింది చైనా అని నిర్ధారించాయి. అలాంటిది పక్కనే ఉన్న భారత్ లో జరిగే ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండగలదా? (రచయిత :: పొట్లూరి పార్థసారథి… కథనంలో పేర్కొన్నవి రచయిత సొంత అభిప్రాయాలు మాత్రమే)
Share this Article