Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విష్ణుప్రియకు బ్రెయిన్ నత్తి..! ఆమే చెప్పుకుంది… అదీ నాగార్జునతో..!!

September 15, 2024 by M S R

సరే, సరే… నాగార్జున హౌజులో కంటెస్టెంట్ల పర్‌ఫామెన్స్ సమీక్షించి… ఇద్దరు క్లాన్ చీఫుల పదవుల్ని ఊడబీకేశాడు… అక్కడికక్కడే వోటింగు జరిపేసి ఓ కొత్త చీఫును పెట్టాడు… శనివారం మొత్తం ఇదే సమీక్ష, మార్కులు వేయడం, క్లాసులు పీకడం, ఆధారాలు చూపించడం, ఓ ఇద్దర్ని సేవ్ చేయడం… ఇక ఫన్ ఏముంది..? వీకెండ్ ఎపిసోడ్ తాలూకు వినోదం ఏముంది..? మజా ఏముంది..?

ప్చ్, రాను రాను నాగార్జున కొత్త సినిమాల్లాగే మారిపోతోంది నిస్సారంగా బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ల ప్లానింగ్… ఏవో రెండు పిచ్చి గేమ్సయినా ఆడించొచ్చుగా…! ఇదంతా ఎలా ఉన్నా సరే, ఆ తిక్కమేళం విష్ణుప్రియ వాడిన ఓ పదం ఆలోచనల్లో పడేసింది… నాకు నత్తి, బ్రెయిన్ నత్తి అనేసింది హఠాత్తుగా… వింటున్న నాగార్జున కూడా ఓ క్షణం తికమకపడ్డాడు… ఈ పిల్ల ఏమంటోంది అని…

ఆమె ఉద్దేశం ఏమిటంటే… (ఆమె మాటల అర్థాలు అరగడం కష్టమే, ఎట్ లీస్ట్, అర్థమైనకాడికి చెప్పుకుందాం) నత్తి ఉంటే పదాల్ని సరిగ్గా పలకలేం, అంతే కదా… గొంతులోనే పదాలు తట్టుకుని అక్కడే ఆగిపోయి, బయటికి రావడానికి మొరాయిస్తాయి… ఎస్, కొన్నిసార్లు బ్రెయిన్ స్టకప్ అయిపోతుంది… బ్రెయిన్‌లో తిరిగే ఆలోచన వేరు, తీరా నోట్లోకి వచ్చి బయటికి వచ్చేది వేరు… అదీ అస్పష్టంగా… గందరగోళంగా… అదీ బ్రెయిన్ నత్తి అన్నమాట…

Ads

నిజమే… విష్ణుప్రియను ఆ ప్రాబ్లం ఉంది… తనే చెప్పింది కాస్త పిచ్చితనం కూడా ఉందని…! నిజానికి ఆకుల సోనియా ఆమె మీద నోరు పారేసుకున్నప్పుడు ధాటిగా రియాక్ట్ కాలేకపోయింది మాటలతో… బహుశా వేరేవాళ్లయితే సీరియస్ గొడవ అయ్యేదేమో… సోనియాది పిచ్చి వాగుడే… ఎందుకో మరి నాగార్జున ఆమె మాటలు, ఆమె నోరు పారేసుకుని, విష్ణుప్రియ మీద అసభ్య ధోరణిలో దాడి చేయడం మీద మందలిస్తాడని అనుకుంటే, అదీ లేదు…

పైగా విష్ణుప్రియకు కాస్త మాస్కులినిటీ కదా అంటాడు, అంటే కాస్త మగపోకడ ఉందని దెప్పుతున్నాడా..? ఆమె స్ట్రాంగ్ అని మెచ్చుకుంటున్నాడా..? ప్చ్, విష్ణుప్రియతో మాట్లాడినప్పుడు తనకూ కాస్త బ్రెయిన్ నత్తి వచ్చేస్తున్నట్టుంది… అంతేకాదు, బ్రెయిన్ నత్తి, పిచ్చితనం అని విష్ణుప్రియే చెప్పుకుంటోంది కదా, ఇక వదిలేద్దాం అంటూ సోనియాకు చెబుతున్నాడు… ఎస్, దీన్ని కూడా బ్రెయిన్ నత్తే అంటారు… పుణ్యస్త్రీ అనే సంవాదంపై ఇద్దరికీ గడ్డిపెట్టాల్సింది…

శనివారం ఎపిసోడ్‌లో అత్యంత దరిద్రంగా కనిపించింది నాగార్జున ఎంట్రీకి ముందు వచ్చిన గ్రూప్ డాన్స్… కాగా నచ్చిన అంశం ఒకటుంది… హౌజులో శేఖర్ బాషా ఉన్నాడు… బయట భార్య డెలివరీకి ఉంది… తనలో డెఫినిట్‌గా కొంత టెన్షన్ ఉంటుంది కదా… నాగార్జునే నీ భార్యకు సేఫ్ డెలివరీ, నీకు అబ్బాయి పుట్టాడు, ఇద్దరూ సేఫ్ అని సమాచారం ఇచ్చాడు… శేఖర్ బాషా మొహంలో ఆనందం, రిలీఫ్… ఒక్కసారిగా ఉద్వేగంతో కదిలిపోయాడు… అందరూ హత్తుకుని అభినందించారు… నిజానికి బిగ్‌బాస్ హౌజ్ అంటే కృత్రిమత్వం… స్క్రిప్టెడ్… ఇలాంటివి మాత్రమే అప్పుడప్పుడూ ఈ కృత్రిమత్వాన్ని బ్రేక్ చేసి, హౌజును రాగరంజితం చేస్తాయి..!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దర్శకుడు మారుతికి కొత్త తలనొప్పి… ఫ్యాన్స్ నుంచి కొత్త నిరసన…
  • ప్రియుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు… ఇదీ అలాంటి స్టోరీయే…
  • 120 రోజులు సముద్ర గర్భంలో… సెయిలర్ కాదు, ఏరోస్పేస్ ఇంజనీర్…
  • అత్యంత సంక్లిష్టత..! విదేశీ నిపుణులనూ ఆశ్చర్యపరుస్తున్న పోలవరం..!!
  • నిర్మూలన..! కనుమరుగు కానున్న హిస్టారికల్ పాంబన్ రైల్వే బ్రిడ్జి..!!
  • సిన్నర్స్..! ఆస్కార్ నామినేషన్లలో అదిరిపోయే రికార్డు..! మనమెక్కడ..?!
  • ‘గీత’మ్ దాటుతున్న కూటమి సర్కారు… వేల కోట్ల భూమి ధారాదత్తం…
  • చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్… అందరూ తప్పులో కాలేశారా..?!
  • IPS weds IAS … ఇదీ ఆదర్శ వివాహమే… సింపుల్‌గా రిజిష్ట్రార్ ఆఫీసులో…
  • రేవంత్‌కు అకారణ ప్రేమ ఉండొచ్చుగాక… హైకోర్టు వదలడం లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions