Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేగంగా క్షీణించిన నవీన్ పట్నాయక్ ఆరోగ్యం… అసలు ఏం జరుగుతోంది..?!

May 30, 2024 by M S R

నన్ను దేవుడే పంపించాడు… నాతో కొన్ని పనులు చేయించదలిచాడు…. ఈ మాట అన్నది మోడీ… అసలు గాంధీ మీద సినిమా వచ్చేవరకు ఆయన ఎందరికి తెలుసు..? …… ఈ మాట అన్నది కూడా మోడీయే…. పెళ్లాల మెడల్లో పుస్తెలు కూడా లాక్కుని మైనారిటీలకు ఇస్తారు జాగ్రత్త… ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేసి మైనారిటీలకు ఇస్తారు కాంగ్రెసోళ్లు… ఈ మాటలూ మోడీవే…

తనేం మాట్లాడుతున్నాడో తనకైనా తెలుసా..? చిప్ ఏమైనా తేడా కొడుతోందా..? ఈ విమర్శల మాటెలా ఉన్నా తను చేసిన మరో వ్యాఖ్య కొంత ఇంట్రస్టింగ్… స్థూలంగా చూస్తే అదీ రీసెంటు మోడీ వ్యాఖ్యల్లా అబ్సర్డ్ అనిపించినా ఇది మాత్రం కొంత ఆసక్తికరం, ఎందుకంటే..?

నో డైట్… దోపిడీలకు, అక్రమాలకు, వారసత్వ పాలనలకు పెట్టింది పేరుగా మారిన ఇండియన్ ప్రాంతీయ పార్టీల ముఖచిత్రంలో నవీన్ పట్నాయక్ కొంత విశిష్టంగా కనిపిస్తాడు… 5 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన వయస్సు 77 ఏళ్లు… సంపాదన కక్కుర్తి వేషాల్లేవు, వారసత్వ జంఝాటాలు లేవు, ఏతుల్లేవు, పనికిమాలిన అబద్ధాల జోలికి పోడు, హుందాగా ఉంటాయి ఆయన రాజకీయాలు…

Ads

నిజం… ఆయన ఆరోగ్యం బాగాలేదు… మరీ ఏడాదిగా ఆయన ఆరోగ్యం క్షీణించడం వెనుక తన లాబీ కుట్ర ఏమైనా ఉందేమోనని సందేహం కలుగుతోంది, మా ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని దర్యాప్తు చేయిస్తాం అన్నాడు మోడీ నిన్నెక్కడో… ఏ లాబీ..?

పాండ్యన్ అనే తమిళుడిని నవీన్ పట్నాయక్ తన రాజకీయ వారసుడిగా ఆల్మోస్ట్ ప్రకటించాడు కదా… ఆయన ఐఏఎస్… తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరిపోయాడు, నవీన్ నీడగానే కనిపిస్తుంటాడు అన్ని మీటింగుల్లో… ఆయన భార్య కూడా ఐఏఎస్ అధికారే…

గతంలో వేరు, ఇప్పుడు బ్యూరోక్రాట్ల పాలన నడుస్తోంది, ఆ పాత స్వచ్ఛ పాలన ఇప్పుడు లేదు అంటుంటాడు ఒడిశాలో కంట్రాక్టులు చేసే మనవాళ్లు… నిజంగానే పలు మీటింగుల్లో నవీన్ అస్వస్థత కనిపిస్తోంది.,. చేతులు వణుకుతున్నాయి, కాళ్లు స్వాధీనంలో ఉండటం లేదు… కష్టమ్మీద ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది…



सोशल मीडिया पर वायरल हुआ नवीन पटनायक का वीडियो

◆ भाषण के दौरान कमजोर अवस्था में दिखे नवीन पटनायक #NaveenPatnaik #ViralVideo | Naveen Patnaik pic.twitter.com/dC14W73mww

— News24 (@news24tvchannel) May 28, 2024



ఒక మీటింగులో నవీన్ మాట్లాడుతుంటే చేతులు వణుకుతూ టీవీలో కనిపిస్తోంది… అది కనిపించకుండా వెంటనే తన పక్కనే మైకు పట్టుకుని ఉన్న పాండ్యన్ ఆ చేతుల్ని కనిపించకుండా వెనక్కి పెట్టాడు… ఆ వీడియో వైరల్ అయిపోయింది… చివరకు నవీన్ లాబీ తనను అన్నిరకాలుగా కంట్రోల్ చేస్తుందనే విమర్శలు ఒక్కసారిగా పెరిగిపోయాయి…



Yesterday Mr Pandian was controlling Naveen Babu’s hands, today it is his legs. Puppeteering an elected 5 term Chief Minister in such a manner is unprecedented in our history. My heart goes out to Naveen Babu who may be unaware of this situation. The only way to restore his… pic.twitter.com/lYEJPdZd7L

— Himanta Biswa Sarma (@himantabiswa) May 29, 2024



దీనికితోడు మరోచోట నవీన్ పట్నాయక్ వెనుకే కుర్చీ వేసుకుని కూర్చున్న పాండ్యన్ తన కాళ్లతో సీఎం కాళ్లను ఏదో అడ్జెస్ట్ చేస్తున్నాడు… ఇక దేవదూత పార్టీ ఊరుకుంటుందా..? రచ్చ మొదలుపెట్టేసింది… నవీన్ పట్నాయక్ ఆరోగ్యం వేగంగా పడిపోయేలా ఆయన లాబీ ఏదో కుట్ర చేసిందనీ, అందుకే ఒకే ఏడాదిలో నవీన్ అలా అయిపోయాడని మోడీ వ్యాఖ్య… దర్యాప్తు చేయిస్తానన్నదీ అదే…

ఒకవేళ నవీన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గనుక విజయకేతనం ఎగురవేస్తే… (జనంలో తన పట్ల ఆదరణ ఉంది) తన లాబీ చేతుల్లోకి పూర్తిగా పగ్గాలు వెళ్లిపోయినట్టేనని విశ్లేషణలు జోరుగా వస్తున్నాయి… నా ఆరోగ్యం మీద నీకంత శ్రద్ధ ఉంటే నేరుగా నాకు కాల్ చేస్తే నేనే చెప్పేవాడిని కదా, నా ఆరోగ్యం బాగానే ఉంది, థాంక్స్ అంటూ నవీన్ మోడీకి కౌంటర్ ఇచ్చాడు గానీ… ఏదో జరుగుతోందనే ప్రజల సందేహాలు ఇంకా బలపడుతూనే ఉన్నాయి…

రాజకీయాలు క్రూరమైనవే, సొంత నీడలే హత్యలు చేస్తాయనేదీ నిజమే, కానీ ఎలాగూ తన వారసుడిగా ప్రకటించిన పాండ్యన్‌కు సీఎం నవీన్‌ను తక్షణం ఏదో చేయాలనే ఆలోచన ఎందుకుంటుంది..? వస్తే గిస్తే అధికారం తన చేతుల్లోకే కదా… ఇప్పుడు పరోక్షంగా పాలిస్తున్నదీ తనే కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions