.
ధర్మస్థల పుణ్యక్షేత్రంలో వందల శవాలు, లైంగిక దాడులు, అక్రమ పూడ్చివేతలు అనే వివాదం కొన్నాళ్లుగా సంచలనం రేపుతోంది కదా… యాంటీ హిందూ శక్తులు పనిగట్టుకుని క్యాంపెయిన్ చేస్తున్నాయి కదా… కర్నాటక సిద్ధరామయ్య పిచ్చి ప్రభుత్వం ఎవరో ఏదో చెప్పగానే కోట్ల ఖర్చుతో తవ్వకాలు చేస్తోంది కదా…
తీరా చూస్తే… 15 రోజులు 17 చోట్ల తవ్వితే ఓ పురుష కపాలం, నాలుగు ఎముకలు తప్ప ఏమీ బయటపడలేదు కదా… అబ్బే, ఎవరో నామీద ఒత్తిడి తెచ్చి, ఇవన్నీ చెప్పించారు, పుర్రె కూడా వాళ్లే ఇచ్చారు అని సదరు పారిశుధ్య కార్మికుడు సిట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడని వార్తలు కూడా వచ్చాయి కదా… సో, కర్నాటకలో యాంటీ హిందూ కుట్రలు పకడ్బందీగా భారీగా ప్లాన్లు జరుగుతున్నాయనే నిజం కూడా తెలుస్తోంది కదా…
Ads
సోకాల్డ్ కుహనా లౌకిక మీడియా, సోషల్ మీడియా ఓ కేసును పదే పదే ఉదహరిస్తోంది… ఏమిటయ్యా అంటే… మెడిసిన్ చదువుతున్న తన కూతురు మాయమైంది అని సుజాత భట్ అనే వృద్ధురాలు చేస్తున్న ఫిర్యాదులు… ఇప్పుడు ఆ ఫిర్యాదు కూడా అబద్ధమని తేలుతోంది… అవును, కర్నాటకలో యాంటీ హిందూ సిండికేట్ ఒకటి బలంగా పనిచేస్తోంది, సిద్ధరామయ్య ఉత్త వృథాపాలకుడనీ తేటతెల్లం అవుతోంది…
వస్తున్న కొన్ని వార్తల ప్రకారం… ధర్మస్థలంలో తన కుమార్తె అనన్య భట్ అదృశ్యమైందనీ, దీని వెనుక శక్తిమంతులైన వ్యక్తులు ఉన్నారని సుజాత భట్ చాలా నెలలుగా ఆరోపిస్తున్నది… అయితే, రికార్డులు, సాక్ష్యాలు, విచారణలో లభించిన ఆధారాలు ఆమె వాదనలపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి…
'అనన్య భట్' రికార్డులే లేవు
సుజాత తన కుమార్తె మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థిని అని చెబుతోంది… కానీ, కళాశాల అధికారులు తమ వద్ద ఆ పేరుతో ఏ విద్యార్థి కూడా చేరలేదని ధృవీకరించారు… ఆమె చెప్పిన విధంగా ఎటువంటి పాఠశాల రికార్డులు, అడ్మిషన్ ఫారాలు లేదా అధికారిక సర్టిఫికెట్లు లేవు… కుటుంబ సభ్యులు, సుజాతకు బాగా తెలిసినవారు కూడా ఆమెకు కూతురు ఉన్నట్టు తమకు తెలియదని అంటున్నారు…
సిట్ దర్యాప్తులో అబద్ధాలు బయటపడ్డాయి
ఈ వివాదం తీవ్రమైనప్పుడు, ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థలలో శవాలను తనే పూడ్చిపెట్టినట్లు ఆరోపించి, దానికి ఆధారంగా ఒక పుర్రెను చూపించాడు… అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆ పుర్రె ఒక పురుషుడిదని, స్త్రీది కాదని నిర్ధారించి, అతని వాదనను తోసిపుచ్చింది…
సుజాత కథలో అనేక వైరుధ్యాలు
సుజాత తనను కిడ్నాప్ చేసి, కుర్చీకి కట్టేసి, ఆ తర్వాత మూడు నెలల పాటు ఆసుపత్రిలో కోమాలో ఉంచారని ఆరోపించింది… కానీ, ఆ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఆమె చెప్పినట్లుగా ఎటువంటి రికార్డులు లేవు… ఆమె కోల్‌కతాలోని సీబీఐలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశానని చెప్పగా, సీబీఐ మాత్రం ఆ పేరుతో ఉద్యోగ రికార్డులు లేవని స్పష్టం చేసింది…
1999 నుంచి 2007 వరకు, సుజాత శివమొగ్గలోని రిప్పన్‌పేటలో ప్రభాకర్ బాలిగాతో కలిసి నివసించినట్లు తెలిసింది… స్థానిక పత్రికలు కూడా వారిని “పిల్లలు లేని జంతు ప్రేమికులు”గా పేర్కొన్నాయి… ఇది ఆమె తనకు ఓ కుమార్తె ఉందనే వాదనే అబద్ధమని తేల్చేస్తున్నది…
వ్యక్తిగత కక్షలు, అసలు ఉద్దేశాలు
ఇటీవలి సంవత్సరాల్లో.., ధర్మస్థల ధర్మాధికారి కుటుంబం తనను అవమానించి, తనను మౌనంగా ఉంచేసిందని కదా సుజాత ఆరోపణ… అయితే, సిట్ దర్యాప్తులో బయటపడిన నిజాలు – పురుషుడి అవశేషాలు, తప్పుడు ఉద్యోగ క్లెయిమ్‌లు, రికార్డులు లేకపోవడం – ఈ ఆరోపణలు ఒక తల్లి పోరాటం కాదని, జస్ట్, ఇదంతా కల్పిత కథ అని స్పష్టం చేస్తున్నాయి… ఆమె కూతురు అనన్య భట్ ఓ అబద్ధం, ఆమె చెబుతున్న విషయాలు అబద్ధం…. కానీ ఏదో బలమైన కుట్ర మాత్రం నిజం… సిద్ధరామయ్య ప్రభుత్వం ఓ సిగ్గూశరం, బాధ్యత లేని ప్రభుత్వం అనేదీ నిజం… (కర్నాటక మీడియా వార్తల ఆధారంగా ఈ కథనం...)
Share this Article