Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేటీఆర్ ఫార్ములా కేసు… జగన్ మనిషితో అక్రమ ఆర్థిక లంకెలు…

January 8, 2025 by M S R

.

కేటీఆర్ ఫార్ములా కేసులో ప్రధానమైన అంశం ఏమిటి…? అవినీతి, అధికార దుర్వినియోగం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ… తను పెట్టిన కేసు కూడా అదే…

ఏదో విదేశీ కంపెనీ, చెల్లింపులు అనేసరికి ఈడీ ఎంటరైంది… అందరికీ తెలిసిందే… అంతకుముందు కేసీఆర్ బీజేపీని బజారుకు ఈడ్చడానికి, పార్టీ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడానికి ఎన్ని కుటిల విఫల ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ కాలేదు, పైగా ఓ పిచ్చి డ్రామా ప్లానుతో పరువు తీసుకున్నాడు తనే…

Ads

ఐనా సరే, బీజేపీ హైకమాండ్ సిగ్గులేకుండా ఈరోజుకూ కేసీఆర్‌కు సై అంటోందీ నిజమే… తెలంగాణకు సంబంధించి ఓ దిక్కులేని స్ట్రాటజీ… సిగ్గూశరం లేని స్ట్రాటజీ… కేటీఆర్ కేసులో ఇన్వాల్వ్ కావడం దేనికి..? జస్ట్, కేసును నీరుకార్చడానికి… కేసును తన చేతుల్లోకి తీసుకోవడానికి… తద్వారా కేసీఆర్‌కు పదే పదే కొమ్ముకాయడానికి…

కాంగ్రెస్ వ్యతిరేకులందరూ నా ప్రియసఖులే అనేది బీజేపీ తిక్క స్ట్రాటజీ… అదే కేసీఆర్ అదే బీజేపీకి వ్యతిరేకులకు వేల కోట్ల మెఘా డబ్బులు ఇచ్చాడనేది విమర్శ… ఐనా సరే కేసీఆర్‌ను వదలదు అది… సరే, ఒక కేసీఆర్, ఒక చంద్రబాబును అర్థం చేసుకోవడానికి మోడీకి, అమిత్‌షాకు ఒక జీవితకాలం సరిపోదు…

కానీ… ఇప్పుడు ఫార్ములా కేసులోనూ ఎందుకు ఈ తన ఇన్వాల్వ్ తాపత్రయం… గ్రీన్‌కో కంపెనీని అడిగిన పనల్లా చేసిపెట్టి, అడ్డగోలుగా ఎన్నికల నిధులు పార్టీకి జమచేయించారనేది ఓ ఆరోపణ… తెలంగాణ ఏసీబీ కూడా అదే కోణంలో హైదరాబాద్, మచిలీపట్నంలలో రెయిడ్స్ చేసింది… ఐతే..?

అదొక లొట్టపీసు కేసు, అందులో అవినీతి లేదు, మన్నూ లేదు, మశానం లేదు అంటూనే…. నేనొక ధీరుడిని, కేసుల్ని ఎదుర్కుంటాను అంటూనే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు కేటీఆర్… కానీ అధికార దుర్వినియోగం జాడలు కనిపిస్తున్నాయి, విచారణ జరగనివ్వండి అంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌నే క్వాట్ చేసింది హైకోర్టు…

ఇక్కడ ఓ ప్రశ్న… గ్రీన్‌కో అడ్డగోలుగా కోట్ల నిధులు బీఆర్ఎస్‌కు ఇచ్చినట్టు బయటపడగానే బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది… ఆ కంపెనీ అందరికీ ఇచ్చింది కదాని..! కరెక్టే, దాని అవసరాల కోసం నిధులిస్తుంది, కానీ నీకెందుకు ఇచ్చింది..? ఏ అవసరం కోసం..? అది కదా అసలు ప్రశ్న..!!

greenco

అసలు ఏమిటీ గ్రీన్‌కో..? ఎవరిది..? 

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు గ్రీన్ కో… ఈ సంస్థ తన సబ్సిడరీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది… అలాగే ఫార్ములా ఈ రేసుకు మొదటి సీజన్‌లో స్పాన్సర్‌గా చేసింది.

తన ఓ సబ్సిడరీ కంపెనీ తరపున ఈ స్పాన్సర్ షిప్ చేసింది. తాము ఇలా డబ్బులు ఖర్చు పెట్టేయడం వల్ల తమకు లాభం లేదని రెండో ఏడాది స్పాన్సర్ షిప్ రద్దు చేసుకుంది. అయితే బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని భరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

దాదాపుగా రెండు వందల కోట్లు ఈ రేసు కోసం ఖర్చు చేసేందుకు తెలంగాణ సర్కార్ ఒప్పుకుంది. ముందస్తుగా రూ. 55 కోట్లు చెల్లించింది. అందుకు అనుమతులు తీసుకోలేదు. అదీ కేసు…

ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ ఎవరిది అన్న ప్రశ్న ఎక్కువగా వస్తోంది… వైసీపీ నేత, కాకినాడ నుంచి ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కుటుంబానిది గ్రీన్ కో కంపెనీ… గ్రీన్ ఎనర్జీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న సంస్థ… తెలంగాణలో బీఆర్ఎస్.. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ సంస్థ విపరీతంగా విస్తరించింది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలతో సన్నిహితమయ్యారు.

అయితే సునీల్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు. మొదట పీఆర్పీ నుంచి ఆయన పోటీ చేశారు… తర్వాత వైసీపీ, టీడీపీ, వైసీపీ మార్చి మార్చి పోటీ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడూ గెలవలేదు…

ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లాలన్న ప్రచారం జరిగింది. కానీ ఇంకా ముందడుగు పడలేదు. ఇప్పటికైతే వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు.

చలమలశెట్టి సునీల్ సోదరుడు అనిల్ మొత్తం వ్యాపారాలను చూస్తూంటారు. ఆయన సినీ ఇండస్ట్రీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను మాల్దీవ్స్ లో నిర్వహించారు. దీనికి టాలీవుడ్ పెద్ద హీరోలను ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు. ఆ వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అది ఆయన రేంజ్ అన్నట్లుగా ఉంటుంది.

గ్రీన్ కో వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అన్ని చోట్లా సోదాలను చేసి అయినా … పాత ఖాతాలు ఏమైనా ఉంటే వాటిని కూడా వెలికి తీయాలన్న ప్రయత్నంలో ఉంది… ఈ కారణంగా గ్రీన్ కో కూడా ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి…

అర్థమైంది కదా… అసలు జగన్ బాపతు, దాంతో బీఆర్ఎస్‌కు అస్మదీయ కంపెనీ… కానీ ఇప్పుడు ఎదురుతన్నుతోంది… అయితేనేం,.,.? పుష్ప2 సెటిల్మెంట్‌లాగే ఇదీ రాజీ పడుతుందా..? పడకపోవచ్చు… ఎందుకంటే..? ఇందులో రేవంత్ ప్రబల ప్రత్యర్థి కేటీఆర్ ఉన్నాడు కాబట్టి… అడ్డంగా దొరుకుతున్నాడు కాబట్టి… దొరికిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి వదలడు కాబట్టి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…
  • శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions